visas
-
ఇంగ్లండ్‌లో ఐటీ ఉద్యోగులను మించిపోయిన చెఫ్ లు.. కారణం అదే..
-
హెచ్–1బీ రిజిస్ట్రేషన్‌కు ఆఖరు తేదీ మార్చి 22
వాషింగ్టన్: 2025వ సంవత్సరానికి గాను హెచ్–1బీ వీసాల ప్రాథమిక నమోదుకు గడువు మార్చి 22వ తేదీతో ముగియనుందని యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్) తెలిపింది. అభ్యర్థులు ఆన్లైన్లో యూఎస్సీఐఎస్ వెబ్సైట్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలని, సంబంధిత ఫీజును చెల్లించాలని సూచించింది. ఇందుకు అవసరమైన ఐ–907, ఐ–129 వంటి ముఖ్యమైన దరఖాస్తులను కూడా ఆన్లైన్లో సమర్పించవచ్చని వివరించింది. అదేవిధంగా, హెచ్–1బీ క్యాప్ పిటిషన్లకు ఏప్రిల్ ఒకటి నుంచి ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరిస్తామని పేర్కొంది. నాన్ క్యాప్ దరఖాస్తులు ఆన్లైన్లో అందుబాటులో ఉండే తేదీలను తర్వాత ప్రకటిస్తామని తెలిపింది. భారతీయ ఐటీ నిపుణులు ఎక్కువగా దరఖాస్తు చేసుకునే నాన్ ఇమిగ్రాంట్ వీసా హెచ్–1బీ. అమెరికా కంపెనీలు భారత్, చైనా వంటి దేశాల నుంచి వేలాది మంది విదేశీ ఐటీ నిపుణులను ఈ వీసాపైనే నియమించుకుంటాయి. -
స్టూడెంట్స్ పంట పండింది! రికార్డు స్థాయిలో అమెరికా వీసాలు
ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్తున్న భారతీయ విద్యార్థుల పంట పండింది. జూన్, జూలై, ఆగస్టు నెలల్లో భారత్‌కు చెందిన విద్యార్థులకు అమెరికా రికార్డు స్థాయిలో వీసాలు జారీ చేసింది. యూఎస్‌లో ఉన్నత విద్యను అభ్యసించడానికి దరఖాస్తు చేసుకున్న భారతీయ విద్యార్థులకు 90,000 కంటే ఎక్కువ వీసాలు జారీ చేసినట్లు భారత్‌లోని యూఎస్ మిషన్ ‘ఎక్స్’ (ట్విటర్)లో ప్రకటించింది. నాలుగింట ఒకటి ప్రపంచవ్యాప్తంగా అమెరికా జారీ చేసిన ప్రతి నాలుగు స్టూడెంట్ వీసాలలో ఒకటి భారతీయ విద్యార్థులకే జారీ చేసినట్లు యూఎస్ మిషన్ పేర్కొంది. అలాగే తమ ఉన్నత విద్య లక్ష్యాలను సాకారం చేసుకోవడానికి యునైటెడ్ స్టేట్స్ను ఎంచుకున్న విద్యార్థులందరికీ అభినందనలు, శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేసింది. ప్రస్తుత సెషన్ కోసం స్టూడెంట్ వీసా దరఖాస్తులు ముగిసిన నేపథ్యంలో యూఎస్ మిషన్ ఈ గణాంకాలను విడుదల చేసింది. చైనాను అధిగమించిన భారత్ 2022లో యునైటెడ్ స్టేట్స్లో అత్యధిక అంతర్జాతీయ విద్యార్థులతో ప్రపంచంలోని అగ్ర దేశంగా భారత్ చైనాను అధిగమించింది. 2020లో దాదాపు 2,07,000 మంది అంతర్జాతీయ భారతీయ విద్యార్థులు యూఎస్‌లో ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్య పెరుగుతోందని తాజా నివేదిక హైలైట్ చేసింది. భారత్ నుంచి విద్యార్థులను ఆకర్షించడానికి విదేశీ విశ్వవిద్యాలయాలు అందించే సులభతరమైన అప్లికేషన్ ఫార్మాలిటీలు, ఆర్థిక సహాయం, స్కాలర్షిప్లు ఈ పెరుగుదలకు కారణంగా తెలుస్తోంది. ఫ్రాన్స్ కూడా.. ఇంతకుముందు ఫ్రాన్స్ కూడా భారత్ నుంచి సుమారు 30,000 మంది విద్యార్థులను ఉన్నత చదువుల కోసం తమ దేశానికి స్వాగతించాలన్న లక్ష్యాన్ని వ్యక్తం చేసింది. 2030 నాటికి భారతీయ విద్యార్థుల సంఖ్యను పెంచడానికి ఆ దేశం ప్రయత్నాలు చేస్తోంది. విద్యా నైపుణ్యాన్ని పెంపొందించడం, సాంస్కృతిక సంబంధాలను పెంపొందించడం , రెండు దేశాల మధ్య దీర్ఘకాలిక స్నేహాన్ని పెంపొందించడం ద్వారానే ఈ లక్ష్యం సాధ్యమవుతుంది. The U.S. Mission in India is pleased to announce that we issued a record number – over 90,000 – of student visas this Summer/ in June, July, and August. This summer almost one in four student visas worldwide was issued right here in India! Congratulations and best wishes to all… — U.S. Embassy India (@USAndIndia) September 25, 2023 -
India-Canada Relations: కెనడా పౌరులకు ‘నో’ వీసా
న్యూఢిల్లీ: భారత్, కెనడా మధ్య ఉద్రిక్తతలు అంతకంతకూ రాజుకుంటున్నాయి. గత జూన్‌లో ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత్ హస్తం ఉందని కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో ఆరోపించడంతో ఇరు దేశాలు ఢీ అంటే ఢీ అంటున్నాయి. ఇరు దేశాలు దౌత్య ప్రతినిధుల్ని వెనక్కి తీసుకునే వరకు వెళ్లిన ఈ వ్యవహారంలో కెనడాకు షాకిస్తూ భారత్ మరో నిర్ణయం తీసుకుంది. కెనడా పౌరులకు వీసాల మంజూరును భారత్ తాత్కాలికంగా నిలిపివేసింది. భద్రతా కారణాల రీత్యా ఈ వీసాలను ఆపేసినట్టు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కెనడాలో భారత హైకమిషన్లు, కాన్సులేట్లకు రక్షణ లేదని, వాటికి బెదిరింపులు వస్తున్నాయని అందుకే తాత్కాలికంగా వీసాలను నిలిపివేసినట్టుగా తెలిపింది. అంతే కాకుండా భారత్‌లో ఉన్న కెనడా దౌత్యసిబ్బంది సంఖ్య తగ్గించుకోవాలని చెప్పింది. మరోవైపు కెనడాలో భారత్ పౌరులు అప్రమత్తంగా ఉండాలన్న కేంద్రం సూచనల్ని కెనడా ప్రభుత్వం తిరస్కరించించి. ప్రపంచంలో కెనడా అత్యంత సురక్షితమైన దేశమని పేర్కొంది. తమ దేశంలో భారత పౌరులకు వచ్చే ఇబ్బందేమీ లేదని పేర్కొంది. వీసాలు జారీ చేసే పరిస్థితి లేదు వీసా దరఖాస్తులను పరిశీలించడానికి ఏర్పాటైన ఒక ప్రైవేటు ఏజెన్సీ బీఎల్ఎస్ ఇంటర్నేషనల్ గురువారం నాడు తాత్కాలికంగా వీసాల పరిశీలన నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. నిర్వహణ కారణాలతోనే ఆపేస్తున్నట్టు వెల్లడించింది. ఆ తర్వాత కాసేపటికే విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి విలేకరులతో మాట్లాడుతూ ఇరు దేశాల మధ్య భద్రతా పరమైన ఉద్రిక్తతల కారణంగా వీసా దరఖాస్తుల ప్రక్రియ ముందుకు సాగడం లేదని తెలిపారు. ఇతర దేశాల నుంచి దరఖాస్తులు చేసుకునే కెనడియన్లకు కూడా వీసాలివ్వలేమని చెప్పారు. ‘‘కెనడా ప్రజలు భారత్ రాకుండా అడ్డుకోవాలన్నది మా విధానం కాదు. సరైన వీసాలు ఉన్న వారు (గతంలో వీసాలు మంజూరైన వారు) యధావిధిగా రాకపోకలు సాగించవచ్చు. వారు ఎప్పుడైనా మన దేశానికి రావొచ్చు. కానీ ఆ దేశంలోని పరిస్థితులు మన హైకమిషన్ కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తున్నాయి’’ అని బాగ్చి వివరించారు. ఇరు దేశాల మధ్య పరిస్థితుల్ని సమీక్షిస్తామని, భారత హైకమిషన్లు, దౌత్య కార్యాలయాలకు రక్షణ ఉందని తేలితే వీసాల జారీ పునరుద్ధరిస్తామని బాగ్చి స్పష్టం చేశారు. ఉగ్రవాదులకు అడ్డాగా కెనడా కెనడా ఉగ్రవాదులకు స్వర్గధామంగా మారిందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి బాగ్చి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కెనడా ప్రభుత్వం ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తోందని విమర్శించారు. కెనడాలో ఖలిస్తాన్ ఉగ్రవాదుల అరాచకాల ఆధారాలన్నింటినీ ఆ ప్రభుత్వానికి ఇచ్చామని, 20–25 మందిని మన దేశానికి అప్పగించాలని కోరినప్పటికీ స్పందన లేదన్నారు. ఉగ్రవాది నిజ్జర్ హత్య వెనుక భారత్ హస్తం ఉందని ట్రూడో చేసిన ఆరోపణలు రాజకీయ ప్రేరేపితమైనవని మండిపడ్డారు. నిజ్జర్ హత్య గురించి ఎలాంటి సమాచారం కెనడా పంచుకోలేదన్నారు. అంతర్గత వ్యవహారాల్లో కెనడా జోక్యం భారత అంతర్గత వ్యవహారాల్లో కెనడా దౌత్యవేత్తల జోక్యం పెరిగిపోతోందని బాగ్చి చెప్పారు. ఇరు దేశాల్లో దౌత్యవేత్తల విషయంలో సమానత్వం లేదన్నారు. ‘‘కెనడాలో ఉన్న భారతీయ దౌత్య వేత్తల కంటే, మన దేశంలో కెనడా దౌత్యవేత్తలు ఎక్కువ మంది ఉన్నారు. వారి సంఖ్యను తగ్గించాల్సిన అవసరం ఉంది’’ అని అన్నారు. ఈ విషయాన్ని కెనడా దృష్టికి తీసుకువెళ్లినట్టు వివరించారు. ఇక భారత్‌లో ఉన్న కెనడా దౌత్య సిబ్బంది ఎంత మంది ఉన్నారో అంచనాలు వేస్తున్నామని కెనడా హైకమిషన్ వెల్లడించింది. భారత్‌లో కెనడా దౌత్యవేత్తలకి బెదిరింపులు వస్తున్నాయని వారికి భద్రత కల్పించాల్సిన బాధ్యత భారత ప్రభుత్వంపైనే ఉందన్నారు. కెనడాలో మరో ఖలిస్తాన్ ఉగ్రవాది హత్య చండీగఢ్: భారత్, కెనడా మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో కెనడాలో మరో ఖలిస్తానీ మద్దతుదారు హత్య జరిగింది. పంజాబ్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్లో ఒకరైన సుఖ్దుల్ సింగ్ అలియాస్ సుఖ దునెకె మృతి చెందినట్టుగా తెలుస్తోంది. దీనిపై కెనడా ప్రభుత్వం స్పందించలేదు. కెనడాలోని విన్నిపెగ్‌లో బుధవారం రాత్రి సుఖ్దుల్పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి చంపేశారు. గ్యాంగ్ వార్‌లో భాగంగానే ఘటన జరిగిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సుఖ్దుల్ సింగ్‌పై మన దేశంలో హత్య, హత్యాయత్నం, దోపిడీకి సంబంధించిన 18 కేసులు ఉన్నాయి. సుఖ్దుల్ హత్య తమ పనేనని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సామాజిక మాధ్యమాల్లో ప్రకటించింది. పంజాబ్‌లోని మోగా జిల్లా దునెకె కలాన్ గ్రామానికి చెందిన సుఖ్దుల్ 2017 డిసెంబర్లో నకిలీ ధ్రువపత్రాలతో కెనడాకు పరారయ్యాడు. -
ఇకపై నెలకు లక్ష వీసాలు జారీ
న్యూఢిల్లీ: అమెరికా వీసాల కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూపులు ఇక బాగా తగ్గే అవకాశాలున్నాయి. వచ్చే ఏడాది వేసవి తర్వాత వీసాల మంజూరుకయ్యే రోజులు బాగా తగ్గిపోతాయని, నెలకి లక్ష వీసాలు మంజూరు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం అధికారి ఒకరు వెల్లడించారు. 2023 ఏడాది వేసవి నాటికి వీసా దరఖాస్తులు 12 లక్షలకు చేరుకుంటాయన్న అంచనాలున్నాయని తెలిపారు. కోవిడ్–19 కారణంగా ఉద్యోగుల సంఖ్య తగ్గిపోవడం, వీసాల జారీ తాత్కాలికంగా నిలిపివేత వంటి కారణాలతో భారతీయులు వీసాల కోసం ఏడాదికి పైగా ఎదుచు చూడాల్సిన పరిస్థితి ఉంది. ‘వీసాల మంజూరులో భారత్‌కు మేము అత్యధిక ప్రాధాన్యం ఇస్తాం. వచ్చే ఏడాది నాటికి కరోనా కంటే ముందున్న పరిస్థితులు వస్తాయి. నెలకి లక్ష వీసాలు మంజూరు చేయడమే మా లక్ష్యం’’ అని ఆయన చెప్పారు. వీసాల త్వరితగతి మంజూరు కోసం సిబ్బందిని పెంచడం, డ్రాప్ బాక్స్ సదుపాయం కల్పన వంటి చర్యల్ని తీసుకుంటామని ఆ అధికారి వెల్లడించారు గతంలో కొన్ని కేటగిరీల వీసా కోసం 450 రోజులు ఎదరుచూడాల్సి వచ్చేదని, ఇప్పుడది తొమ్మిది నెలలకి తగ్గిందని వివరించారు. -
అమెరికా వీసాలు పొందడంలో భారత్ రికార్డు
సాక్షి, హైదరాబాద్: అమెరికా వీసాలు పొందడంలో ఇండియా రికార్డు సృష్టించింది. మిగతా దేశాల కంటే భారతదేశ విద్యార్థులే ఎక్కువ వీసాలు పొందడం గమనార్హం. అమెరికాలో విద్యాభ్యాసానికి సంబంధించి ఈ ఏడాది రికార్డు స్థాయిలో 82 వేల వీసాలు మంజూరు చేసినట్లు ‘ద యూఎస్ మిషన్ ఇన్ ఇండియా’ప్రకటించింది. 2022లో ఈ స్థాయిలో వీసాలు పొందిన మరో దేశం లేదని తెలిపింది. న్యూఢిల్లీలోని అమెరికా దౌత్య కార్యాలయంతోపాటు చెన్నై, హైదరాబాద్, కోల్‌కతా, ముంబైల్లోని కార్యాలయాలు కూడా భారతీయ విద్యార్థుల వీసాల జారీకి ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చాయని, మే నుంచి ఆగస్టు వరకూ వీటిని వీలైనంత వేగంగా జారీ చేసే ప్రక్రియ చేపట్టడం వల్ల విద్యార్థులు సకాలంలో అమెరికాలో విద్యాభ్యాసం మొదలు పెట్టే వీలు కలిగిందని వివరించింది. ‘‘కోవిడ్–19 కారణంగా గతేడాది మాది రిగా వీసాల జారీలో జాప్యం జరక్కపోవడం, సకాలంలో విద్యార్థులు యూనివర్సిటీల్లో చేరగలగడం ఎంతో ఆనందాన్నిస్తోంది. ఈ ఏడాది రికార్డుస్థాయిలో 82 వేల వీసాలు జారీ చేయడం భారతీయ విద్యార్థులు అమెరికన్ విద్యకు ఇస్తున్న ప్రాధాన్యతకు చిహ్నం’’అని ఛార్జ్ డి అఫైర్స్ పాట్రీషియా లాసినా తెలిపారు. ‘‘అమెరికా దౌత్య వ్యవహారాల్లో అంతర్జాతీయ విద్యార్థులు కేంద్రస్థానంలో ఉంటారు. భారతీయ విద్యార్థుల భాగస్వామ్యం కూడా చాలా ఎక్కువ’’అని మినిస్టర్ కౌన్సిలర్ డాన్ హెల్ఫిన్ అన్నారు. ఇరవై శాతం మంది భారతీయులే.. అమెరికాలో వేర్వేరు కోర్సుల్లో చదువుతున్న అంతర్జాతీయ విద్యార్థుల్లో ఇరవై శాతం మంది భారతీయ విద్యార్థులే. ఓపెన్ డోర్స్ నివేదిక ప్రకారం 2020–2021లో దాదాపు 1,67,582 మంది భారతీయ విద్యార్థులు అమెరికాలో చదువుతున్నారు. 2020లో అమెరికన్ ప్రభుత్వం, ఉన్నత విద్యాసంస్థలు కోవిడ్ రక్షణ ఏర్పాట్లు చేయడంతోపాటు విద్యార్థులను ఆహ్వానించాయి. ఆన్లైన్/ఆఫ్‌లైన్ పద్ధతులు రెండింటిలోనూ బోధన ఏర్పాట్లు చేశాయి. ఇదీ చదవండి: వీసాలున్నా వెళ్లలేక.. -
భారత విద్యార్థులకు గుడ్‌న్యూస్.. చైనా కీలక ప్రకటన
బీజింగ్: కరోనా మహమ్మారి కారణంగా విధించిన లాక్‌డౌన్‌తో చైనా నుంచి వందల మంది భారత విద్యార్థులు స్వదేశానికి తిరిగి వచ్చారు. కోవిడ్ ఆంక్షలు కొనసాగుతున్న నేపథ్యంలో దాదాపు రెండేళ్లుగా ఇక్కడే ఉండిపోయారు. తాజాగా వీసాలపై నిరీక్షణకు తెరదించుతూ భారత విద్యార్థులకు చైనా శుభవార్త అందించింది. దాదాపు రెండేళ్ల తర్వాత తిరిగి చైనాకు వెళ్లేందుకు వీసాలు జారీ చేసే ప్రణాళిక చేస్తున్న ప్రకటించింది. స్టూడెంట్ వీసాలతో పాటు బిజినెస్ వంటి వివిధ కేటగిరీల వీసాలు సైతం జారీ చేయనున్నట్లు డ్రాగన్ విదేశాంగ శాఖ ట్వీట్ చేసింది. ‘భారత విద్యార్థులకు శుభాకాంక్షలు. మీ సహనం విలువైనదని రుజువైంది. నేను నిజంగా మీ ఉత్సాహాన్ని, సంతోషాన్ని పంచుకోగలను. తిరిగి చైనాకు వచ్చేందుకు స్వాగతం.’ అంటూ ట్వీట్ చేశారు చైనా విదేశాంగ శాఖ ఆసియా వ్యవహారాల కౌన్సెలర్ జి రోంగ్. భారత విద్యార్థులు, వ్యాపారవేత్తలు, కుటుంబాలకు వర్కింగ్ వీసాల జారీపై న్యూఢిల్లీలోని చైనా ఎంబసీ వివరణాత్మక ప్రకటనను ట్విట్టర్లో షేర్ చేశారు. ఈ ప్రకటన ప్రకారం చైనాలో ఉన్నత విద్య చదవాలనుకుంటున్న కొత్త విద్యార్థులు, చైనా నుంచి తిరిగి వచ్చిన విద్యార్థులకు ఎక్స్1 వీసాలు జారీ చేయనున్నారు. కొత్తగా వెళ్లే విద్యార్థులు ఒరిజినల్ అడ్మిషన్ లెటర్‌ను అందించాల్సి ఉంటుంది. మిగిలిన వారు చైనా యూనివర్సిటీల నుంచి అనుమతి పత్రాలను అందించాలి. చైనాలో కరోనా ఆంక్షలతో స్వదేశానికి తిరిగి వచ్చి సుమారు 23వేల మంది విద్యార్థులు చిక్కుకుపోయారు. రెండేళ్లుగా తిరిగి వెళ్లేందుకు వీసాల కోసం నిరీక్షిస్తున్నారు. చైనాకు తిరిగి వచ్చే విద్యార్థుల వివరాలను అందించాలని ఇటీవలే చైనా కోరింది. దీంతో వందల మంది విద్యార్థుల జాబితాను చైనాకు అందించింది భారత్. సుమారు 1000 మంది పాత విద్యార్థులు చైనాకు తిరిగి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు అధికారవర్గాలు తెలిపాయి. మరోవైపు.. ఇరు దేశాల మధ్య నేరుగా విమాన రాకపోకలు లేకపోవటం విద్యార్థులకు ఇబ్బంది కలిగించనుంది. కొద్ది వారాల క్రితం శ్రీలంక, పాకిస్థాన్, రష్యా సహా పలు దేశాలకు చెందిన విద్యార్థులు చార్టెడ్ ఫ్లైట్స్ ద్వారా చైనాకు చేరుకున్నారు. ఇదీ చదవండి: తైవాన్‌లో అమెరికా గవర్నర్ పర్యటన.. చైనా ఎలా స్పందిస్తుందో? -
ఉక్రెయిన్ బంధువులకు యూకే వీసాలు
లండన్: వలసబాట పట్టిన ఉక్రెనియన్లు తమ దేశానికి రావచ్చంటూ బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రకటించారు. యూకేలో సమీప బంధువులుంటే వారికి వీసాలను అందజేస్తామని తెలిపారు. ఉక్రెయిన్‌కు బ్రిటన్ 40 మిలియన్ పౌండ్లు విలువైన వైద్య పరికరాలు, మందులు వంటి కనీస అవసరాలను అందజేస్తామని ప్రకటించింది. దీంతో ఉక్రెయిన్‌కు అందజేసే సాయం మొత్తం 140 మిలియన్ పౌండ్లకు చేరుకుంది. -
అమెరికా వీసా దరఖాస్తుదారులకు తీపి కబురు..
US Waives In-Person Interview: భారతీయ అమెరికా వీసా దరఖాస్తుదారులకు ఇది మంచి తీపి కబురు. విద్యార్థులు, కార్మికులతో సహా చాలా మంది అమెరికా వీసా దరఖాస్తుదారులకు వ్యక్తిగత ఇంటర్వ్యూలను రద్దు చేసినట్లు అమెరికా తెలిపింది. ఈ ఏడాది 31 వరకు విద్యార్థుల, కార్మికులు, సంస్కృతిక కళాకారులకు సంబంధించిన వివిధ రకాల వీసాల వ్యక్తిగత ఇంటర్వ్వూలను రద్దు చేస్తున్నట్లు అమెరికన్ సీనియర్ దౌత్యవేత్త ఒకరు భారతీయ కమ్యూనిటీ నాయకులకు తెలిపారు. దీనికి విద్యార్థుల(F, M, J), ఉద్యోగులు(H-1, H-2, H-3, L), సంస్కృతిక కళాకారులు , విశిష్ట ప్రతిభావంతులు(O, P, Q )లకు సంబంధించిన దరఖాస్తుదారులు ఈ వీసా వ్యక్తిగత ఇంటర్య్యూల రద్దుకు అర్హులు. అయితే ఈ విధానం వీసా దరఖాస్తుదారులకు, వారి కుటుంబ సభ్యులకు, స్నేహితులకు ఇది చాలా ఉపయుక్తంగా ఉండటమే కాక చాలా అవరోధాలను, అడ్డంకులను తొలగిస్తుందని దక్షిణాసియా కమ్యూనిటీ నాయకుడు అజయ్ జైన్ భూటోరియా అన్నారు. భూటోరియా ఆసియా అమెరికన్లకు సంబంధించిన అంశాల్లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు సలహదారుడిగా కూడా వ్యవహరిస్తున్నారు. ఈ మేరకు ఆయన దక్షిణ మధ్య ఆసియా సహాయ కార్యదర్శి డోనాల్ లూతో జరిగిన సమావేశం అనంతరం ఈ విషయాన్ని వెల్లడించారు. డోనాల్ లూ డిసెంబర్ 31 వరకు ఈ ఇంటర్వ్యూలను రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారని భూటోరియా చెప్పారు. అయితే ఈ వ్యక్తిగత ఇంటర్వ్యూల రద్దు విధానం వర్తించాలంటే గతంలో అమెరికాకు సంబంధించిన ఏదైన వీసా పొంది ఉండాలి. కానీ వీసా తిరస్కరణకు గురైనవారు, తగిన అర్హత లేనివారికి ఇది వర్తించదు. అయితే ప్రస్తుతం న్యూఢిల్లీలోని యూఎస్ రాయబార కార్యాలయం వెబ్సైట్లో చెన్నై, హైదరాబాద్, కోల్‌కతా, ముంబైలోని కాన్సులేట్లు ఈ కొత్త ఏడాదికి 20 వేలకు పైన మినహాయింపు (డ్రాప్‌బాక్స్) వీసా దఖాస్తులను ఆహ్వానించింది. (చదవండి: ఉక్రెయిన్‌కి రూ.65 కోట్ల విరాళం ఇచ్చిన జపాన్ బిలియనీర్!) -
ఎన్ఆర్ఐలకు హైదరాబాద్ పోలీసుల షాక్
సాక్షి, హైదరాబాద్: నగర పోలీసు విభాగం సోషల్ మీడియాపై డేగకంటి నిఘా ఏర్పాటు చేస్తోంది. దీనికోసం ప్రత్యేకంగా సైబర్ స్పేస్ పోలీసింగ్ చేపడుతోంది. సోమవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కొత్వాల్ సీవీ ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు. సైబర్ క్రైమ్ పోలీసుస్టేషన్‌తో పాటు ప్రతి ఠాణాలోనూ వీటిపై కేసులు నమోదు చేయనున్నారు. అనేక మందికి ఇబ్బందులు.. ఇటీవల కాలంలో సోషల్ మీడియా ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయింది. ఎవరికి వారు తమ ఆలోచనలను అందులో పొందుపరుస్తున్నారు. కొందరైతే కొన్ని వర్గాలను, రాజకీయ పార్టీలను టార్గెట్‌గా చేసుకుంటున్నారు. మరికొందరు మహిళలు, యువతులను కించపరిచేలా వ్యవహరిస్తున్నారు. కుప్పలుకుప్పలుగా పుట్టుకువస్తున్న యూట్యూబ్ చానళ్లలో కూడా కొన్ని ఇదే పంథాలో వెళ్తున్నాయి. ఈ పరిణామాలతో అనేక మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీరి లో అతితక్కువ మంది మాత్రమే పోలీసులకు ఫిర్యా దు చేస్తున్నారు. దీన్ని అలుసుగా తీసుకుంటున్న అనేక మంది ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. అవసరమైతే సుమోటో కేసులు.. వీటన్నింటినీ గమనించిన నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ తీవ్రంగా పరిగణించారు. ప్రతి ఒక్క పోలీసు అధికారి, సిబ్బంది సోషల్‌మీడియాపై కన్నేసి ఉంచేలా సైబర్ స్పేస్ పోలీసింగ్‌కు శ్రీకారం చుట్టారు. ఇప్పటి వరకు సోషల్‌మీడియా వ్యవహారాలపై కేవలం సైబర్ క్రైమ్ ఠాణాలోనే కేసులు నమోదయ్యేవి. ఇకపై నగరంలోని అన్ని పోలీసుస్టేషన్లలో ఈ కేసులు నమోదు చేస్తారు. బాధితులు ఎవరూ ముందుకు రాకుంటే సుమోటోగా కేసులు నమోదు చేసే అధికారులు దర్యాప్తు చేపడతారు. ఈ వ్యవహారంలో పారీ్టలకు అతీతంగా చర్యలు తీసుకోవాలని ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసుల తీరుతెన్నులను ఆయనే స్వయంగా పర్యవేక్షించనున్నారు. పాస్‌పోర్టులు సైతం రద్దుకు సిఫార్సు.. సోషల్‌మీడియాలో ప్రత్యక్షమవుతున్న అభ్యంతరకరమైన, అశ్లీల, కించపరిచే పోస్టుల్లో కొన్ని ఇతర దేశాల నుంచి పోస్టు అవుతున్నాయి. వీటిని సృష్టిస్తున్న వ్యక్తుల్లో విదేశాల్లో ఉండే ఎన్ఆర్ఐలు ఉండటంతో ఇప్పటి వరకు పోలీసులు ఏమీ చేయలేకపోతున్నారు. కొన్ని కేసుల్లో మాత్రం అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాలకు లుక్ ఔట్ సర్క్యులర్ (ఎల్ఓసీ) మాత్రమే జారీ చేస్తున్నారు. దీంతో ఆ వ్యక్తులు దేశానికి వస్తేనే పట్టుకునే ఆస్కారం ఉంటోంది. ఇలాంటి వారికీ చెక్ చెప్పడానికి సీవీ ఆనంద్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ తరహా కేసుల్లో నిందితులు ఎన్నారైలు ఉంటే వారి పాస్‌పోర్టులు రద్దు చేయాల్సిందిగా ఆర్పీఓకు సిఫార్సు చేస్తారు. దీంతో ఆయా వ్యక్తులను వారు ఉంటున్న దేశాలు బలవంతంగా తిప్పి పంపడానికి ఆస్కారం ఏర్పడుతుంది. శిక్షలు పడే వరకు పర్యవేక్షణ.. యూట్యూబ్, వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్ తదితర సోషల్‌మీడియాల్లో అవాంఛనీయ పోస్టులపై కేసుల నమోదుతో సరిపెట్టవద్దని ఆనంద్ స్పష్టం చేశారు. ప్రతి కేసునూ చట్ట ప్రకారం దర్యాప్తు చేసి, నిందితులకు శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇతర సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్స్ కంటే వాట్సాప్, ట్విట్టర్ల ద్వారానే ఇలాంటివి ఎక్కువ సమస్యలు వస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. వాట్సాప్‌లో ఉండే గ్రూపులే వదంతులు విస్తరించడానికి కారణమవుతున్నా యని వివరిస్తున్నారు. ఏ సమాచారం అయినా పూర్తిగా నిర్ధారించుకోకుండా ప్రచారం, షేరింగ్ చేయవద్దని అలా చేస్తే చట్ట ప్రకారం నేరమే అవుతుందని, అభ్యంతరకర కామెంట్లు చేసినా బాధ్యులేనని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. -
కొత్త వీసాల జారీకి కువైట్ గ్రీన్ సిగ్నల్
మోర్తాడ్ (బాల్కొండ): కొత్తగా వచ్చే వలస కార్మి కులకు వీసాలు జారీ చేయాలని కువైట్ ప్రభుత్వం నిర్ణయించింది. కరోనా వైరస్ కారణంగా 2020 మార్చి నుంచి కువైట్, కార్మికులకు కొత్త వీసాల జారీని నిలిపివేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కువైట్‌లో కరోనా సెకండ్ వేవ్ కేసులు తగ్గిపోవడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఇప్పుడిప్పుడే వ్యాపార, వాణిజ్య రంగాలలో కార్యకలాపాలు ఊపందుకోవడంతో కువైట్‌లో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. కరోనా సమయంలో విదేశీ వలస కార్మికులు పెద్ద ఎత్తున స్వస్థలాలకు తరలిపోవడంతో ప్రస్తుతం కువైట్‌లో కార్మికుల కొరత ఏర్పడింది. గతంలో వీసా గడువు ఉన్నా కరోనా కారణంగా తప్పనిసరి పరిస్థితుల్లో కార్మికులను ఇంటికి పంపించిన కంపెనీలు పాత కార్మికులను మళ్లీ రావాల్సిందిగా కోరుతున్నాయి. కొత్త వీసాల జారీకి కువైట్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో అవసరం ఉన్న రంగాల్లో వలస కార్మికులను రప్పించుకోవడానికి ఆయా కంపెనీలు ప్రయత్నాలు మొదలు పెట్టాయి. కువైట్ ప్రభుత్వ నిర్ణయంపై తెలుగు రాష్ట్రాలలోని వలస కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
కరోనా వైరస్: అమెరికా వీసాలకు బ్రేక్
సాక్షి, హైదరాబాద్: కరోనా పరిస్థితుల నేపథ్యంలో మే 3 నుంచి అన్ని రకాల రోజువారీ వీసాల జారీ ప్రక్రియను రద్దు చేసినట్లు హైదరాబాద్‌లోని యూఎస్ కాన్సులేట్ జనరల్ మంగళవారం ప్రకటించింది. తదుపరి ప్రకటన చేసే వరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని తెలిపింది. అన్ని రకాల నాన్–ఇమ్మిగ్రెంట్ వీసా ఇంటర్వ్యూ అపాయింట్మెంట్లు, ఇంటర్వ్యూ మాఫీ చేసి అపాయింట్మెంట్లు సైతం రద్దు చేసినట్లు వెల్లడించింది. అమెరికా పౌరుల కోసం అన్ని రకాల రోజువారీ సేవల అపాయింట్మెంట్లను ఏప్రిల్ 27 నుంచి రద్దు చేసినట్టు తెలిపింది. అమెరికా పౌరులకు అత్యవసర సేవలు, వీసా అపాయింట్మెంట్లు కొనసాగుతాయని పేర్కొంది. షెడ్యూల్ ప్రకారం అత్యవసర అపాయింట్మెంట్లను యథాతథంగా జరుపుతామని తెలిపింది. చదవండి: 50% ప్రయాణికులతోనే ఆర్టీసీ బస్సులు -
వీసాల పునరుద్ధరణ తక్షణం అమల్లోకి
న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తి, లాక్డౌన్ నేపథ్యంలో ఎనిమిది నెలల క్రితం రద్దు చేసిన వీసాలను మళ్లీ పునరుద్ధరించాలని కేంద్ర ప్రభుత్వం గురువారం నిర్ణయించింది. ఎలక్ట్రానిక్, టూరిస్టు, మెడికల్ కేటగిరీ మినహా మిగిలిన అన్ని రకాల వీసాలను పునరుద్ధరిస్తారు. ఇది తక్షణమే అమల్లోకి వస్తుందని ప్రభుత్వం వెల్లడించింది. భారత్‌ను సందర్శించేందుకు గాను ఓవర్సీస్ సిటిజెన్ ఆఫ్ ఇండియా(ఓసీఐ), పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్(పీఐఓ) కార్డుదారులకు, ఇతర విదేశీయులకు టూరిస్టు వీసా మినహా ఇతర వీసాలు మంజూరు చేయనున్నట్లు కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. దీని ద్వారా విదేశీయులు ఇండియాకు వచ్చేందుకు మార్గం సుగమమైంది. దేశ సందర్శనకు కాకుండా వారు వ్యాపారం, సదస్సులు, ఉద్యోగాలు, విద్యాభ్యాసం, పరిశోధనల కోసం ఇండియాకు రావొచ్చు. కరోనా వైరస్ బయటపడడంతో ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి విదేశాల నుంచి జనం రాకపోకలను ప్రభుత్వం నిలిపివేసింది. అన్‌లాక్‌లో భాగంగా ఆంక్షలను క్రమంగా సడలిస్తోంది. అలాగే వీసాలు, విదేశీ ప్రయాణాలపై ఆంక్షలను ఎత్తివేస్తోంది. అందులో భాగంగా వీసాలను పునరుద్ధరించింది. ఒకవేళ వాటి గడువు తీరిపోతే మళ్లీ వీసాలు పొందవచ్చని కేంద్రం సూచించింది. విదేశీయులు భారత్‌లో వైద్య చికిత్స పొందాలని భావిస్తే మెడికల్ వీసా కోసం కొత్తగా దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంది. విదేశాల నుంచి ఇండియాకు వచ్చేవారు కేంద్ర ఆరోగ్యశాఖ జారీ చేసిన కోవిడ్ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని తెలియజేసింది. -
అమెరికా వీసాలకు అంతా రెడీ!
సాక్షి, హైదరాబాద్: అమెరికాలో చదువు కోవాలనుకునే భారత విద్యార్థులకు ఆ దేశం శుభవార్త చెప్పింది. స్టూడెంట్, అకడమిక్ ఎక్స్ఛేంజ్ విజిటర్ వీసాల దరఖాస్తు ప్రక్రియను పరిమితంగా ప్రారంభించనున్నట్టు తెలిపింది. ఈనెల 17న హైదరాబాద్‌తోపాటు ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతాల్లోని యూఎస్ ఎంబసీల్లో ఈ ప్రక్రియ మొదలుకానుందని హైదరాబాద్‌లోని కాన్సులేట్ శుక్రవారం వెల్లడించింది. ప్రస్తుత పరిస్థితుల్లో అందరూ సురక్షితంగా ఉండాలనే ఉద్దేశంతో పరిమిత స్థాయిలోనే ఈ ప్రక్రియ చేపడుతున్నట్టు వివ రించింది. శీతాకాల సెమిస్టర్ (ఫాల్ సెమిస్టర్) ప్రారంభమయ్యే సమయానికి తమ వద్ద చాలా తక్కువ అపాయింట్మెంట్లు మాత్రమే ఉన్నందున.. వాటి కోసం వచ్చే అన్ని విజ్ఞప్తు లనూ పరిగణనలోకి తీసుకోలేమని స్పష్టం చేసింది. తరగతులు ఎప్పుడు మొదలవుతాయి? అపాయింట్మెంట్ల కోసం విజ్ఞప్తులు ఎప్పుడు అందాయనే ప్రాతిపదికన వాటిని పరిశీలిస్తామని, ఈ నేపథ్యంలో దరఖాస్తు దారులు వేచి చూడాలని సూచించింది. తొలుత ఆగస్టు 12వ తేదీకి ముందు వచ్చిన అత్యవసర విద్యార్థి, ఎక్స్ఛేంజ్ విజిటర్ అభ్యర్థనలను పరిశీలించి వీసా అపాయింట్ మెంట్లను ఇస్తామని పేర్కొంది. ఆ తర్వాత అందుబాటులో ఉన్న అవకాశాలు, అవస రాన్ని బట్టి రెండు వారాల ముందు అపాయింట్మెంట్లు ఇస్తామని తెలిపింది. అమెరికాలో చదవాలనుకుంటున్న విద్యా ర్థులు, ఎక్స్ఛేంజ్ విజిటర్స్ తమ తరగతులు మొదలుకావడానికి 3 వారాల కంటే ముందు మాత్రమే అపాయింట్మెంట్ కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. అపా యిం ట్మెంట్ వివరాలను ఎప్పటికప్పుడు తమ వెబ్సైట్లో సరిచూసుకోవాలని పేర్కొంది. ఆ వీసా సర్వీసుల నిలిపివేత యథాతథం.. సాధారణ ఇమిగ్రెంట్, నాన్ ఇమిగ్రెంట్ వీసా సర్వీసుల నిలిపివేత మాత్రం యథాతథంగా కొనసాగుతుందని, వీలైనంత త్వరగానే సాధారణ వీసా సర్వీసులను మొదలుపెట్టే అవకాశాలున్నా.. దానికి సంబంధించిన తేదీని మాత్రం వెల్లడించలేమని కాన్సులేట్ తెలి పింది. గతంలో ఎమ్మార్వీ ఫీజు కట్టినవారు ఏడాదిలోగా దానిని ఇంటర్వూ్య అపాయింట్ మెంట్ షెడ్యూల్ కోసం ఉపయోగించు కోవచ్చునని స్పష్టం చేసింది. అత్యవసర ప్రయాణాలు చేయాల్సిన వారు ‘ఎమర్జెన్సీ అపాయింట్మెంట్’కోసం సూచించిన మార్గ దర్శకాలను పాటించాలని సూచించింది. ఇక హెచ్1బీ, హెచ్2బీ, హెచ్4, ఎల్, కొన్ని జే కేటగిరీల దరఖాస్తుదారులు తాము అపాయిం ట్మెంట్ పొందడానికి వీలుందో లేదో పరిశీ లించిన తర్వాత అందుకు విజ్ఞప్తి చేయాలని స్పష్టంచేసింది. అమెరికా వెళ్లేందుకు తమకు ఏ వీసా కేటగిరి సరిపోతుందని అనేది డైరెక్టరీలో సరిచూసుకోవాలని సూచించింది. కాగా, హైదరాబాద్ నుంచి దాదాపు 8వేల మంది విద్యార్థులకు అమెరికా వెళ్లే అవకాశం లభించ నుందని సమాచారం. వీసా అపాయింట్ మెంట్లు, ఇంటర్వూ్యలు ముగిసిన తర్వాత సెప్టెంబర్ 1 నుంచి వీసాల జారీకి అవకాశమున్నట్టుగా తెలుస్తోంది. -
అన్నీ విజిటింగ్ వీసాలే!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా కలకలం రేపిన ‘తబ్లిగీ జమాత్’కేసులో మరో ముందడుగు పడింది. మత ప్రార్థనల కోసం భారత్‌కు వచ్చిన 2,300 మంది విదేశీయుల్లో ఇండోనేసియన్లే అధికశాతం ఉన్నారు. వీరంతా విజిటింగ్ వీసా నిబంధనలను ఉల్లంఘించడంతో కేంద్ర హోంశాఖ వీరిని బ్లాక్‌లిస్టులో పెట్టింది. వీరికి దేశంలో 10 ఏళ్ల పాటు అనుమతి నిరాకరిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇక రాష్ట్రంలోని కరీంనగర్లో ఇండోనేసియన్లు సంచరించడం, వారిలో కరోనా పాజిటివ్ వ్యక్తులుండటంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. మార్చి 15న ఈ విషయం బయటికి తెలిసింది. వెంటనే తెలంగాణకు చెందిన ఓ సామాజిక ఉద్యమకారుడు వీరంతా విజిటింగ్ వీసాపై వచ్చారని, ఇది అక్రమమని పలువురు కేంద్ర, రాష్ట్ర అధికారులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోకపోగా ఎగతాళి చేశారు. కానీ, ఆయన పట్టు వదలకుండా మార్చి 24న ఇండోనేసియాలోని భారత దౌత్యకార్యాలయానికి సమాచారార హక్కు చట్టం కింద ఓ దరఖాస్తు పెట్టుకున్నాడు. అందులో 2019 ఆగస్టు నుంచి 2020 మార్చి 19 వరకు ఎంతమంది ఇండోనేసియన్లకు విజిటింగ్ వీసాలు ఇచ్చారో తెలపాలని కోరాడు. అక్కడ నుంచి నాలుగు రోజుల్లోనే సమాధానం వచ్చింది. ఇండోనేసియా రాజధాని జకార్తాలోని భారత దౌత్యకార్యాలయం ద్వారా 1,405 మంది ఇండోనేసియన్లకు భారత్‌లో పర్యటించేందుకు విజిటింగ్ వీసాలను మాత్రమే ఇచ్చామని, తెలంగాణ లేదా ఆంధ్రప్రదేశ్‌లో ఎలాంటి మతపరమైన కార్యకలాపాల్లో పాల్గొనేందుకు ఉద్దేశించిన మతపరమైన లేదా మిషనరీ వీసాలు ఇవ్వలేదని సమాధానంలో పేర్కొంది. ఆధారాలు చూపినా.. వద్దన్నారు! ఈ వివరాలు పట్టుకుని కూడా సదరు ఉద్యమకారుడు చాలామంది ఉన్నతాధికారులను కలిశాడు. వారు అతన్ని పట్టించుకోకపోగా.. ప్రయత్నాలు మానుకోవాలని హితవు పలికారు. విచిత్రంగా కేంద్ర హోంశాఖ దేశంలో అక్రమంగా పర్యటిస్తోన్న విదేశీయులను గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించడంతో ఏప్రిల్ మొదటివారంలో హుటాహుటిన సదరు ఉద్యమకారుడిని అధికారులు సంప్రదించి అతని వద్ద ఉన్న వివరాలను అడిగి తీసుకోవడం కొసమెరుపు. ఇందులో మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటేంటే.. దాదాపు 2 వేలకు పైగా ఇండోనేసియన్లు ఢిల్లీలోని నిజాముద్దీన్‌లో జరిగిన తబ్లిగీ జమాత్ వేడుకల్లో పాల్గొన్నట్లు సమాచారం. 1,400 మందికి మాత్రమే తాము వీసాలు జారీ చేశామని చెబుతుండగా.. మిగిలిన 600లకుపైగా వీసాలన్నీ ఆన్ అరైవల్‌గా తీసుకున్నవిగా సమాచారం. -
వీసాల మోసగాళ్ల అరెస్టు
వరంగల్ క్రైం: విదేశాల్లో ఉద్యోగాలు కల్పించేలా వీసాలు ఇప్పిస్తామని మోసం చేసి రూ.3 కోట్ల వరకు వసూలు చేసిన నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రమైన హన్మకొండ సుబేదారి పోలీసు స్టేషన్లో గురువారం ఏసీపీ జితేందర్‌రెడ్డి ఈ కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు. హైదరాబాద్‌కు చెందిన పడిగల సుమంత్, వరంగల్ ఎల్బీ నగర్‌కు చెందిన కల్వల రాహుల్ విదేశాల్లో ఉద్యోగం చేసేందుకు అవసరమైన వీసాలను ఇప్పిస్తామని నిరుద్యోగుల నుంచి డబ్బు వసూలు చేశారు. హన్మకొండ నక్కలగుట్టలో 2017లో ఫైర్ సేఫ్టీ శిక్షణ సంస్థను ఏర్పాటు చేసిన మీర్‌హౌసీర్ హుస్సేన్.. పలువురు అభ్యర్థులను సుమంత్‌కు పరిచయం చేశాడు. వారి నుంచి వీసా కోసం రూ.8 లక్షల చొప్పున తీసుకున్నారు. సుమంత్ తన కుటుంబ సభ్యులు శృతి, హేమ, సుగుణ అకౌంట్లలోకి డబ్బు వేయించుకున్నాడు. నకిలీ అగ్రిమెంట్లపై సంతకాలు చేయించగా.. ఎంత కూ వీసాలు రాకపోవడంతో మహబూబ్‌నగర్, జగిత్యాల, వేములవాడ, హైదరాబాద్ సైబర్ క్రైం, చెన్నారావుపేట, సుబేదారి, మట్టెవాడ, హన్మకొండ పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేయగా కేసులు నమోదయ్యాయి. ఈ వ్యవహారంలో ఏడుగురు సభ్యులకు గాను ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు ఏసీపీ తెలిపారు. -
వీసాల పేరిట రూ.3 కోట్లకు టోకరా
మోర్తాడ్ (బాల్కొండ): ఉపాధి నిమిత్తం ఇజ్రాయెల్‌కు పంపిస్తామని నమ్మించిన ఏజెంట్లు అమాయకులను నిండా ముంచారు. రూ.3 కోట్లకు పైగా టోకరా వేశారు. వీసాల పేరిట ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలకు చెందిన సుమారు 50 మంది నిరుద్యోగులను వంచించారు. నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం తిమ్మాపూర్‌కు చెందిన బాధితుడు రాజు స్థానిక పోలీసులను ఆశ్రయించడంతో ఇజ్రాయెల్ వీసాల మోసం వెలుగులోకి వచ్చింది. నిజామాబాద్‌లోని గాయత్రీనగర్, డిచ్పల్లి మండలం సుద్దులం గ్రామానికి చెందిన ఇద్దరు ఏజెంట్లు ఇజ్రాయెల్ వెళ్లడానికి వీసాలు ఇప్పిస్తామని అమాయకులను నమ్మించారు. ఆరు నెలల కింద ఒక్కొక్కరి నుంచి రూ.6 లక్షల చొప్పున వసూలు చేశారు. నిరుద్యోగులను ఇంటర్వ్యూల పేరిట ఢిల్లీ, బెంగళూరుకు తీసుకెళ్లి వీసాల ప్రక్రియ ప్రారంభించినట్లు నమ్మించారు. అయితే, ఆర్నెల్లు అవుతున్నా వీసాలు ఇవ్వక పోవడంతో తాము చెల్లించిన సొమ్మును వాపసు చేయాలని కోరితే భౌతిక దాడులకు పాల్పడినట్లు బాధితులు ‘సాక్షి’వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్ వీసాల పేరిట నమ్మించి మోసగించిన ఏజెంట్లపై చట్టరీత్యా చర్యలు తీసుకుని తమ డబ్బులు తమకు ఇప్పించాలని వారు కోరారు. -
వేగంగా కెనడా విద్యార్థి వీసా
టొరంటో: కెనడాలో చదవాలనుకునే భారతీయ విద్యార్థులకు ఇకపై వీసాలు మరింత వేగంగా లభించనున్నాయి. భారత్‌తోపాటు చైనా, ఫిలిప్పీన్స్, వియత్నాం దేశాలకు చెందిన విద్యార్థులకు వీసాల జారీ విధానంలో కెనడా తాజాగా తీసుకొచ్చిన మార్పులతో ఈ ప్రయోజనం కలగనుంది. ఈ నాలుగు దేశాల విద్యార్థుల కోసం స్టూడెంట్ డైరెక్ట్ స్ట్రీమ్ (ఎస్డీఎస్) పేరుతో కెనడా ఓ కొత్త వీసా పథకాన్ని ప్రారంభించింది. ఆ దేశంలో చదివేందుకు అవసమైన భాషా పరిజ్ఞానం, ఆర్థిక స్తోమత ఉన్న విద్యార్థులు ఎస్డీఎస్ కింద దరఖాస్తు చేసుకుంటే 45 రోజుల్లోపే వీసా జారీ ప్రక్రియ పూర్తవుతుంది. సాధారణ విధానంలో అయితే ప్రస్తుతం కెనడా విద్యార్థి వీసా పొందడానికి రెండు నెలల సమయం పడుతోంది. అయితే ఎస్డీఎస్ కింద దరఖాస్తు చేసుకునే విద్యార్థులు సాధారణం కన్నా కఠినమైన భాషా పరీక్షలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. గత కొన్నేళ్లుగా భారత్, చైనా, ఫిలిప్పీన్స్, వియత్నాం విద్యార్థులకు ఇంచుమించు ఎస్డీఎస్ లాంటి విధానాన్నే అమలుచేస్తున్నప్పటికీ, ఈ నాలుగు దేశాలకు ఉమ్మడిగా తాజాగా కొత్త పద్ధతిని తెచ్చినట్లు కెనడా వలసలు, శరణార్థులు, పౌరసత్వ సేవల విభాగం వెల్లడించింది. -
ఏడ్రోజుల్లో ఎన్నారై వివాహ రిజిస్ట్రేషన్
న్యూఢిల్లీ: భారత్‌లో జరిగే ఎన్నారై వివాహాలన్నీ ఏడు రోజుల్లోగా రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాల్సిందేనని కేంద్ర మహిళా, శిశుసంక్షేమ శాఖ స్పష్టం చేసింది. ఒకవేళ వారం రోజుల్లో రిజిస్టర్ చేసుకోని పక్షంలో పాస్‌పోర్టులు, వీసాలు జారీ చేసే అవకాశం ఉండదని పేర్కొంది. గతవారం కేంద్ర మహిళా శిశు సంక్షేమ మంత్రి మనేకా గాంధీ ఎన్నారై వివాహాలు కచ్చితంగా రెండ్రోజుల్లోనే రిజిస్టర్ అవ్వాలని సూచించారు. అయితే.. ఇలాంటి వివాహాల్లో మహిళలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని బుధవారం సమావేశమైన కేంద్ర మంత్రుల బృందం (రాజ్‌నాథ్ సింగ్, సుష్మా స్వరాజ్, రవిశంకర్ ప్రసాద్, మేనకా గాంధీ) సమావేశంలో దీన్ని ఏడురోజులకు పెంచాలని నిర్ణయించారు. ఎస్క్రో (వివాహం తర్వాత భార్యను తీసుకెళ్తానని మూడో వ్యక్తి సమక్షంలో పత్రము రాసుకుని ఆ తర్వాత అది చెల్లదని తప్పించుకోవడం) కేసుల్లో భార్యను వదిలేసి పారిపోయే ఎన్నారైల ఆస్తులను జప్తు చేసుకోవడంతోపాటు.. ఇలాంటి వివాహాల్లోని పలు సమస్యలను పరిష్కరించడంపైనా మంత్రివర్గ బృందం చర్చించింది. ఇందుకు నేర శిక్ష్మాస్మృతి నిబంధనలు, వివాహ చట్టం, పాస్‌పోర్ట్ చట్టాల్లో సవరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని నిర్ణయించారు. ప్రస్తుతం ఎన్నారై వివాహాల రిజిస్ట్రేషన్‌కు ఎలాంటి సమయ పరిమితి లేదు. -
అమెరికా గుడ్‌న్యూస్ : అదనంగా 15వేల వీసాలు
వాషింగ్టన్ : వీసాల జారీ విషయంలో కఠినతరమైన నిబంధనలు విధిస్తూ.. విదేశీయులకు చుక్కలు చూపిస్తూ వస్తున్న డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. అదనంగా 15వేల హెచ్-2బీ వీసాలను విదేశీయులకు జారీచేయనున్నట్టు ప్రకటించింది. ఈ వీసాలు ఇప్పటికే 2018 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జారీ చేసిన 66వేల వీసాల కంటే అదనం. అదనపు వీసాలు జారీ చేస్తున్నట్టు డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యురిటీ ప్రకటించింది. ఈ హెచ్-2బీ వీసాలను ప్రస్తుతం తాత్కాలికంగా నాన్-అగ్రికల్చర్ వర్కర్లకు జారీ చేస్తున్నారు. ఈ వీసాల ద్వారా అమెరికన్ వ్యాపారాలు పలు అవసరాల నేపథ్యంలో నాన్-అగ్రికల్చర్ ఉద్యోగాలను పూరించుకోవడం కోసం విదేశీయులను వారి దేశానికి రప్పించడం కోసం ఉపయోగపడుతున్నాయి. అమెరికాన్ వ్యాపారాలను సంతృప్తిపరిచేంతగా, తాత్కాలిక నాన్-అగ్రికల్చర్ లేబర్‌గా పనిచేసేందుకు ప్రతిభావంతులైన, సరిపడ స్థాయిలో అమెరికన్ వర్కర్లు లేరని సెక్రటరీ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యురిటీ కిర్స్టేజెన్ నీ నీల్సన్ చెప్పారు. సెక్రటరీ ఆఫ్ లేబర్ అలెక్సాండర్ అకోస్టా, కాంగ్రెస్ సభ్యులు, వ్యాపార యజమానులతో సమావేశమైన తర్వాత ఆమె ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టు డీహెచ్ఎస్ ప్రెస్‌కు తెలిపింది. హెచ్-2బీ వీసాను కూడా ఇందుకోసమే ప్రత్యేకంగా రూపొందించారు. ప్రతిభావంతులైన, సరిపడ స్థాయిలో వర్కర్లు దొరకనప్పుడు, తాత్కాలికంగా విదేశాల నుంచి అమెరికా వ్యాపారాలకు అనుగుణంగా వర్కర్లను రప్పించుకోవచ్చు. గరిష్టంగా ఈ ఏడాది ప్రథమార్థంలో 33వేల హెచ్-2బీ వీసాలు అందుబాటులో ఉంటాయని, మరో 33వేలు వీసాలను ద్వితీయార్థంలో జారీచేయనున్నట్టు హోమ్‌ల్యాండ్ సెక్యురిటీ పేర్కొంది. ఈ వారం నుంచి అర్హత కలిగిన వారు హెచ్-2బీ వీసాల కోసం ఫామ్ 1-129ను సమర్పించాలని చెప్పింది. -
వీసాలతో మోసం
మోర్తాడ్ (బాల్కొండ) : అజర్బైజాన్ దేశంలో పని పేరిట నిరుద్యోగులను ఏజెంట్లు నిండా ముంచారు. తెలంగాణ జిల్లాలకు చెందిన 60 మంది నిరుద్యోగులను అజర్‌బైజాన్‌కు పంపించిన ఏజెంట్లు పది రోజుల పాటు తిప్పి ఇంటి బాట పట్టించారు. ఒక్కో వీసా కోసం నిరుద్యోగులు రూ.1.40 లక్షల చొప్పున ఏజెంట్లకు చెల్లించారు. అజర్ బైజాన్‌లో ఉపాధి ఉందని వారిని నమ్మించిన ఏజెంట్లు ఇప్పుడు చేతులెత్తేశారు. ఆ దేశ చట్టాల ప్రకారం ఏదైనా వ్యాపారం చేయాలంటే ఆ దేశ పౌరసత్వం ఉన్న వారికే లైసెన్స్‌లను జారీ చేస్తారు. అక్కడ పని చేయాలంటే వర్క్ వీసాను పొందాల్సి ఉంది. కానీ ఏజెం ట్లు వర్క్ వీసాను కాకుండా తక్కువ ఖర్చుతో విజిట్ వీసాలను జారీ చేస్తూ తమ జేబులు నింపుకుంటున్నారు. నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం తిమ్మాపూర్‌కు చెందిన తొమ్మిది మంది జనవరి చివరి వారంలో అజర్‌బైజాన్‌కు వెళ్లి అక్కడే పది రోజుల పాటు ఉన్నారు. తిమ్మాపూర్‌కు చెందిన శేఖర్, చిన్నారెడ్డి, కొలిప్యాక శ్రీనివాస్, కొలిప్యాక అక్షయ్, మురళి, సాకలి భూమేష్‌లతో పాటు మరో ముగ్గురు అజర్బైజాన్ బాధితులే. వీరితో పాటు భీమ్‌గల్ మండలం చేంగల్, ఏర్గట్ల, జలాల్‌పూర్‌లకు చెందిన ముగ్గురు ఉన్నారు. నిజామాబాద్ పట్టణానికి చెందిన ఐదుగురు, నిర్మల్, ఆదిలాబాద్, జగిత్యాల్ జిల్లాలకు చెందిన యువకులు ఏజెంట్లకు సొమ్ము చెల్లించారు. తెలంగాణ జిల్లాల నుంచి 60 మంది ముంబైలోని ప్రధాన ఏజెంటుకు రూ.1.40 లక్షల చొప్పున మొత్తం రూ.84 లక్షల వరకు చెల్లించారు. ఇంటికి చేరిన నిరుద్యోగులతో తాము ఒక్కొక్కరికి రూ.40 వేలకు మించి ఇవ్వలేమని లేదంటే మరో దేశం పంపిస్తామ ని ఏజెంట్లు చెబుతున్నారు. దీంతో ఏజెంట్లపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయా లని బాధితులు కోరుతున్నారు. -
‘మస్కట్’ ఆశలు ఆవిరి!
సాక్షి, హైదరాబాద్: చదువు పూర్తయ్యాక గల్ఫ్ దేశాలకు వెళ్లి ఉద్యోగం చేద్దామనుకున్నవారి ఆశలపై ఒమన్ (మస్కట్) ప్రభుత్వం నీళ్లు చల్లింది. ఐటీ, ఇంజనీరింగ్, మెడికల్, మార్కెటింగ్ తదితర రంగాల్లోని 87 రకాల ఉద్యోగాలకు వీసాలను నిలిపివేసింది. ఆరు నెలల పాటు ఈ నిషేధం కొనసాగుతుందని ప్రకటించింది. దీనిని ఆదివారం నుంచే అమల్లోకి తెచ్చింది. విదేశాల నుంచి వలసలు పెరుగుతుండటం, స్వదేశంలో నిరుద్యోగులు పెరుగు తుండటంతో ఒమన్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసు కున్నట్టు చెబుతున్నారు. దీనిపై మిగతా గల్ఫ్ దేశాల్లోనూ తీవ్రంగా చర్చ జరుగుతోంది. ఒమన్ నిర్ణయం ప్రధానంగా గల్ఫ్ దేశాలకు వెళ్లే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నిరుద్యోగులకు ఆశనిపాతంగా మారుతోంది. ఉన్నత ఉద్యోగాల కోసం.. గల్ఫ్ దేశాల్లో దాదాపు ఇరవై లక్షల మంది భారతీయులు ఉన్నారు. అందులో తెలుగు రాష్ట్రాలకు చెందినవారు పెద్ద సంఖ్యలో ఉన్నారు. ముఖ్యంగా తెలంగాణకు చెందిన 4.75 లక్షల మంది గల్ఫ్‌కు వలస వెళ్లినట్లు సమగ్ర కుటుంబ సర్వే సమయంలో వెల్లడైంది. తర్వాత ఆ సంఖ్య మరింతగా పెరిగింది. యుఏఈ (యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్–దుబాయి, అబుదాబీ, షార్జా, రస్ అల్ ఖైమా, అజ్మన్, ఫుజైరా, ఉమల్‌ఖివైన్ ప్రాంతాలు)లోనే రెండు లక్షల మంది తెలంగాణవారున్నారు. వారిలో చాలా మంది భవన నిర్మాణం, ఇతర రంగాల్లో కార్మికులుగా, డ్రైవర్లు, సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తుంటారు. ఇక యూఏఈ తర్వాత ఒమన్ (మస్కట్)కు ఎక్కువ మంది తెలుగువారు ఉపాధి పొందుతున్నారు. అయితే ఒమన్ సంపన్న దేశం కావడం, పర్యాటక రంగం కీలకం కావడంతో హోటళ్లు, ఇంజనీరింగ్, మార్కెటింగ్, హెచ్ఆర్, సేల్స్ తదితర రంగాల్లో ఉపాధి అవకాశాలు ఎక్కువ. దీంతో గత పదేళ్లుగా తెలంగాణ యువత ఈ రంగాల్లో ఉద్యోగాల కోసం ఒమన్ బాట పట్టింది. స్వదేశీయులకు ప్రాధాన్యం కోసం విదేశాల నుంచి వలసలు పెరగటంతో ఒమన్‌లో ఉన్నత శ్రేణి ఉద్యోగాలకు డిమాండ్ పెరిగింది. స్థానికులకు ఉద్యోగాలు అందని పరిస్థితి తలెత్తింది. దీంతో కీలకమైన ఉద్యోగాలు స్వదేశీయులకే చెందాలని ఒమన్ యువత డిమాండ్ చేయడం మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో కీలకమైన ఉద్యోగాల్లో స్థానికులకే ప్రాధాన్యమివ్వాలని ఒమన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే ఉన్నత ఉద్యోగాలకు సంబంధించిన వీసాల జారీపై ఆరు నెలల పాటు నిషేధం విధించింది. అన్ని కంపెనీలు, రిక్రూటింగ్ ఏజెన్సీలు విధిగా స్థానిక నిరుద్యోగులతోనే ఉద్యోగాలను భర్తీ చేయాలని ఆదేశించింది. వీసాలు నిషేధించిన రంగాలివే.. నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలని, తమ దేశంలో ప్రొఫెషనల్ కోర్సులు పూర్తి చేసిన వారికి ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతోనే ఒమన్ ప్రభుత్వం వీసాలపై నిషేధం నిర్ణయం తీసుకుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వైద్యవృత్తి, మార్కెటింగ్–సేల్స్, అడ్మినిస్ట్రేషన్ అండ్ హ్యూమన్ రిసోర్సెస్, ఇన్సూరెన్స్, ఎయిర్పోర్ట్, ఇంజనీరింగ్, టెక్నికల్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, అకౌంటింగ్ అండ్ ఫైనాన్స్, ఇన్ఫర్మేషన్ అండ్ మీడియా రంగాల్లోని 87 ఉద్యోగాలకు నిషేధం వర్తించనుంది. చిన్న కంపెనీ అయినా.. ఒమానీలే ‘‘గతంలో ఎక్కడ ఉద్యోగావకాశం ఉన్నా విదేశీయులా, స్వదేశీయులా అని పట్టించుకోకుండా ఒమన్ ప్రభుత్వం వీసాలు ఇచ్చింది. కానీ కొంతకాలంగా కీలక రంగాల ఉద్యోగాల్లో ఒమనీలే ఉండాలనే డిమాండ్ తలెత్తింది. చిన్నా, పెద్దా అన్ని కంపెనీల్లో ఎక్కువ శాతం స్వదేశస్తులే ఉండేలా నిబంధనలను రూపొందించింది. పది మంది ఉద్యోగులుండే చిన్న హోటల్లో కూడా కనీసం ఆరుగురు స్వదేశస్తులు ఉంటేనే అనుమతి మంజూరు చేస్తోంది..’’ – ఒమన్‌లో ప్రైవేటు జాబ్ రిక్రూటింగ్ ఏజెన్సీ నిర్వాహకుడు ప్రకాశ్ -
అమెరికా బాటలో సింగపూర్: ఇండియన్స్ కు షాక్
-
అమెరికా బాటలో సింగపూర్: ఇండియన్స్ కు షాక్
న్యూఢిల్లీ : వీసాల జారీల్లో ఇండియన్స్ కు విదేశాలు ఝలకిస్తున్నాయి. వీసా జారీల్లో కఠినతరమైన నిబంధనలు తీసుకొస్తూ భారతీయులకు కంటిమీదు కునుకు లేకుండా చేస్తున్న అమెరికా బాటలోనే సింగపూర్ నడుస్తోంది. దేశీయ ఐటీ నిపుణులకు ఇచ్చే వీసాలను సింగపూర్ బ్లాక్ చేస్తోంది. సింగపూర్ లో వర్క్ చేసేందుకు ఐటీ నిపుణులు పొందే వీసాలను సింగపూర్ లో భారీగా తగ్గిస్తున్నట్టు తెలిసింది. వాణిజ్యపరమైన ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ సమగ్ర ఆర్థిక సహకార ఒప్పంద(సీఈసీఏ) సమీక్షను పక్కనపెడుతోంది. ప్రతిభావంతులైన స్థానికులను భారత కంపెనీలు నియమించుకోవాలంటూ అమెరికా మాదిరి ఆదేశాలు జారీచేస్తోంది. దీంతో సింగపూర్ లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న కంపెనీలు ఇతర దేశాలకు తమ ఆపరేషన్స్ ను తరలించాలని యోచిస్తున్నాయి. హెచ్‌సీఎల్ నుంచి టీసీఎస్ వరకు అన్ని కంపెనీలు సింగపూర్ కు తరలివెళ్లిన సంగతి తెలిసిందే. ఇన్ఫోసిస్, విప్రో, కాగ్నిజెంట్, ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్ లు అక్కడ కార్యకలాపాలు ప్రారంభించేశాయి. కానీ ఆ కంపెనీలకు ఈ ఏడాది ప్రారంభం నుంచి వీసా సమస్యలు ప్రారంభమయ్యాయి. వీసా జారీలు పడిపోతున్నాయి. స్థానికులను నియమించుకోవాంటూ దేశీయ కంపెనీలకు ఆదేశాలు వస్తున్నాయని నాస్కామ్ ప్రెసిడెంట్ ఆర్ చంద్రశేఖరన్ చెప్పారు. ప్రాక్టికల్ గా మన ఐటీ నిపుణులకు వీసాలను కూడా ఆపివేస్తున్నట్టు మరో ఇండస్ట్రి ఎగ్జిక్యూటివ్ కూడా పేర్కొన్నారు. నిర్ధిష్ట ఆర్థిక ప్రమాణాలుండాలంటూ ''ఎకనామిక్ నీడ్స్ టెస్ట్'' పేరుతో దేశీయ నిపుణులకు యాక్సస్ కల్పించకుండా సింగపూర్ అథారిటీలు అడ్డుకుంటున్నారని సంబంధిత వర్గాలు చెప్పాయి. సర్వీసు ట్రేడ్ నిపుణులకు ప్రపంచవ్యాప్తంగా ఆందోళనకర పరిస్థితులు తలెత్తుతున్నాయని, స్థానికులకు తొలి ఛాన్స్ ఇవ్వాలంటూ కఠినతరమైన నిబంధనలు వస్తున్నాయని పేర్కొన్నారు. ఇటీవల కాలంలో ద్వీపకల్ప దేశంలో విదేశీ నిపుణులకు అనుమతి కల్పించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న దేశం సింగపూరే. ఈ నేపథ్యంలో దిగుమతి డ్యూటీలను కట్ చేస్తూ ఉత్పత్తులను అనుమతించే విషయంపై కఠిన నిర్ణయాలు తీసుకోవాలని దేశీయ ప్రభుత్వం కూడా నిర్ణయించింది. -
అమెరికాలో ఉన్నత విద్య కలలు కల్లలు
-
విద్యానిధి.. హతవిధీ!
- వీసాలు తిరస్కరించిన అమెరికన్ కాన్సులేట్ - అమెరికాలో ఉన్నత విద్య కలలు కల్లలు - దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు నిరాశ - తాజాగా 55 మందికి వీసాలు నిరాకరణ - అంతా విద్యానిధి పథకం లబ్ధిదారులే.. - అన్ని వివరాలు సరిగా ఉన్నా కూడా నో! - బదులుగా ఆస్ట్రేలియా వైపు చూస్తున్న విద్యార్థులు - విద్యానిధి పథకం దరఖాస్తుల్లో మార్పు కోసం సంక్షేమ శాఖలకు వినతులు ఎల్బీనగర్కు చెందిన రేఖ గతేడాది బీటెక్ పూర్తి చేసింది. ఎమ్మెస్ చదివేందుకు అమెరికాలోని కన్సాస్ వర్సిటీకి దరఖాస్తు చేసుకుంది. అమెరికా వర్సిటీలో సీటు వచ్చింది.. విద్యానిధి పథకం కింద రూ.20 లక్షల ఆర్థిక సాయానికి ఎంపికైంది. కానీ అమెరికా కాన్సులేట్ రేఖ వీసాకు నిరాకరించింది. కాన్సులేట్ అధికారులు అడిగిన ప్రశ్నలకు సరిగ్గా సమాధానం చెప్పినా, అన్ని సరిగా ఉన్నా వీసా తిరస్కరించారు. ఎందుకు తిరస్కరించారనే కారణమూ చెప్పలేదు. రేఖ మాత్రమే కాదు మరో 55 మందికి ఇదే పరిస్థితి ఎదురైంది. వీసాల జారీలో అమెరికా కాన్సులేట్ అధికారులు వ్యవహరిస్తున్న తీరుతో.. రాష్ట్ర విద్యార్థుల ఆశలన్నీ అడియాసలవుతున్నాయి. సాక్షి, హైదరాబాద్: విద్యార్థుల అమెరికా కలలు కల్లలవుతున్నాయి. వీసాల జారీలో అమెరికా కఠినంగా వ్యవహరిస్తుం డడం, కావాలనే తిరస్కరిస్తుండడంతో వారి ఆశలు ఆవిరవుతున్నాయి. ఇటీవల మహాత్మాజ్యోతి బాపూలే విద్యానిధి కింద ఎంపికైన పలువురు విద్యార్థులు.. అమెరికాలో ఎమ్మెస్ చదివేందుకు వివిధ యూనివర్సిటీలకు దరఖాస్తు చేసుకున్నారు. ఆయా వర్సిటీలు సీట్లు ఇచ్చేందుకు ఓకే చెప్పినా.. అమెరికన్ కాన్సులేట్ మాత్రం వీసాల జారీకి నిరాకరించిం ది. ఇలా తిరస్కరించడానికి కాన్సులేట్ అధికారులు ఎలాం టి కారణాలూ వెల్లడించకపోవడం గమనార్హం. అటు విద్యార్థులు మాత్రం కన్నీటితో ఆందోళనలో మునిగిపోతున్నారు. విద్యానిధి లబ్ధిదారులకు షాక్! రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల్లోని పేద విద్యార్థుల కోసం ఓవర్సీస్ విద్యానిధి పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం కింద ఎంపికైన లబ్ధిదారులకు రూ.20 లక్షల వరకు ఆర్థిక సహకారాన్ని అందిస్తోంది. బీసీ కేటగిరీకి చెందిన విద్యార్థులకు గతేడాది నుంచి ఈ పథకం అందుబాటులోకి రాగా.. వారికి అమెరికాలో చదివే అవకాశాన్ని కల్పించింది. 2016–17లో రాష్ట్రవ్యాప్తంగా 300 మందికి ఆర్థిక సహకారం అందించేలా నిధులు కేటాయించినా.. పథకం అమల్లో జాప్యం, ప్రచారం పెద్దగా లేకపోవడంతో 203 దరఖాస్తులే వచ్చాయి. అందులోనూ అర్హత ఉన్న 110 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. వారిలో 90 మందికి సంబంధించి ప్రొసీడింగ్‌లను బీసీ సంక్షేమ శాఖ వెబ్సైట్లో పొందుపర్చింది. వారిలో 70 మంది అమెరికా యూనివర్సిటీలనే ఎంపిక చేసుకున్నారు. విద్యానిధి పథకానికి ఎంపికకావడంతో ఆయా విద్యార్థులు.. అమెరికా వీసా కోసం ఇంటర్వూ్యలకు వెళ్లారు. కానీ అందులో దాదాపు 55 మందికి వీసా తిరస్కరణకు గురైనట్లు సమాచారం. ఇంటర్వూ్యలో ‘ఏ కోర్సు చేయాలనుకుంటున్నావు..? ఎందుకు ఆ కోర్సు ఎంపిక చేసుకున్నావు..?’వంటి ప్రశ్నలు అడిగారని, వాటికి çసరిగానే బదులిచ్చినా వీసా తిరస్కరించారని రేఖ అనే అభ్యర్థి వాపోయింది. జీఆర్ఈ స్కోర్‌తో పాటు ఎంపిక చేసుకున్న కోర్సుకు సంబంధించి సరైన వివరాలు ఇచ్చానని, వీసా ఎందుకు రాలేదో తెలియడం లేదని మరో విద్యార్థిని ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికా వెళ్లే చాలామందికి ఇలాగే ఉద్దేశపూర్వకంగా వీసా తిరస్కరిస్తున్నారని వారు వ్యాఖ్యానించారు. ఆస్ట్రేలియా వైపు చూపు అమెరికాలో ఉన్నత విద్యకు అడ్డంకులు ఎదురవుతున్న తరుణంలో ఆస్ట్రేలియా యూనివర్సిటీల వైపు విద్యార్థులు దృష్టి సారిస్తున్నారు. ఇటీవల వీసా తిరస్కరణకు గురైన పలువురు విద్యానిధి లబ్ధిదారులు ఆస్ట్రేలియా, కెనడా వర్సిటీల్లో చదివేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆర్థిక సహకార పథకం కింద అమెరికా వర్సిటీ పేర్లు నమోదు చేసిన నేపథ్యంలో.. వాటిని మార్చాలంటూ బీసీ సంక్షేమ శాఖకు విజ్ఞప్తులు చేస్తున్నారు. దీనిపై అధికారులు సైతం సానుకూలంగా స్పందిస్తూ.. ఈ అంశంపై ప్రభుత్వానికి నివేదిస్తా మని పేర్కొంటున్నారు. మరోవైపు విద్యా నిధి పథకం కింద ఎంపికైనట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఉత్తర్వులను ఆస్ట్రేలియా యూనివర్సిటీల్లో పరిగణనలోకి తీసుకుంటున్నారని, ఫీజు చెల్లింపులకు కొంత గడువు ఇస్తున్నారని విద్యార్థులు చెబుతున్నారు. -
ఇన్ఫోసిస్, టీసీఎస్ ప్రాధాన్యం ఇక వారికేనట!
ముంబై: భారతీయ ఐటీ విద్యార్థుల ప్లేస్మెంట్ కలలు ఇక కల్లలుగానే మిగిలిపోనున్నాయి. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో భారతీయ ఐటీ కంపెనీలు అమెరికా ఉద్యోగులపై దృష్టిపెట్టనున్నట్టు నివేదికలు వెల్లడి చేస్తున్నాయి. ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం ప్రముఖ దేశీయ ఐటీ దిగ్గజాలు ఇన్ఫోసిస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఇక మీదట అమెరికాలోని ఫ్రెషర్స్ కే ప్రాధాన్యత ఇవ్వనున్నాయి. అమెరికా లోని ఇంజనీరింగ కాలేజీల్లో క్యాంపస్ రిక్రూట్మెంట్లు చేపట్టనున్నాయి. దీంతో వేలాదిమంది భారతీయ ఐటీ విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడనుందని రిపోర్ట్ చేసింది. హెచ్-1బీ, ఎల్1 వీసాల ద్వారా వ్యాపార కార్యకలాపాలు నిర్వహించి, అధిక ఆదాయం పొందుతున్న భారత ఐటీ కంపెనీలకు పెద్ద ఎదురుదెబ్బ తగలనుందనే అంచనాలతో కంపెనీలు ఇకమీదట అమెరికా వాసులకే ప్రాధాన్యత ఇవ్వనున్నాయి. ఇటీవల జెఫ సెషన్స్ చేసిన ప్రతిపాదనలను అమెరికన్ కాంగ్రెస్ ఆమోదిస్తే భారతీయ ఐటీ కంపెనీలకు శరాఘాతమే. ఇక ఈ వీసాల ద్వారా అమెరికాలో ప్రవేశించటం భారతీయ ఐటీ విద్యార్థులకు దాదాపు కష్టమైనట్లే. కాగా గత వారం, అటార్నీ జనరల్ పదవికి ట్రంప్ నామినేట్ చేసిన జెఫ్ సెషన్స్ హెచ్-1బీ , ఎల్1 వీసాల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు చర్యలు చేపట్టనున్నట్టు హెచ్చరించారు. ఒక అమెరికన్ ఉద్యోగాన్ని విదేశాల్లో తక్కువ జీతంతో పనిచేసే మరొకరితో భర్తీ చేయడం సరైనదేనని భావించడం చాలా తప్పు అని సెనేట్ జ్యుడీషియరి కమిటీ ముందు జెఫ్ తెగేసి చెప్పారు. గతంలో సెషన్స్, గ్లాసరీ , సెనేటర్ డిక్ డర్బిన్ హెచ్-1బీ, ఎల్1 వీసా సంస్కరణ బిల్లును సహ స్పాన్సర్ చేసిన సంగతి తెలిసిందే. -
మనకు ఇంగ్లిష్ రాదంటూ.. వీసాలకు కోత
న్యూజిలాండ్ భారతీయ విద్యార్థులకు వీసా నిబంధనలు కఠినతరం చేసింది. అంతేకాకుండా గడిచిన ఐదు నెలల్లో భారతీయ విద్యార్థులకు ఇస్తున్న వీసాల్లో గణనీయమైన కోత విధించింది. గత ఏడాది జూలై నుంచి అక్టోబర్ మధ్యకాలంలో భారతీయ విద్యార్థులకు 6,462 వీసాలు ఇవ్వగా, ఈ ఏడాది కేవలం 3,102 వీసాలు మాత్రమే ఇచ్చింది. మన విద్యార్థులకు ఇచ్చే స్టడీ వీసాలలో ఏకంగా సగానికిపైగా కోత పెట్టడం గమనార్హం. వీసా నిబంధనలు కఠినతరం చేయడం, కచ్చితమైన పర్యవేక్షణ ఉంచడంతో స్టడీ వీసాలు తగ్గాయని, భారత్ నుంచి చాలామంది విద్యార్థులు తగినంత డబ్బు, తగినంత ఇంగ్లిష్ పరజ్ఞానం లేకుండానే ఇక్కడి వస్తుండటంతో వారిని నిలువరించినట్టు న్యూజిలాండ్ ప్రభుత్వ రేడియో తెలిపింది. భారతీయ విద్యార్థులకు వీసాలు ఇవ్వడంలో న్యూజిలాండ్ ప్రభుత్వం విపరీత పోకడలు పోతున్నదని అక్కడి అక్లాండ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ గ్రూప్ పేర్కొంది. 16 ప్రైవేటు ఇన్స్టిట్యూట్ల సమాహారమైన ఈ సంస్థ అధికార ప్రతినిధి పాల్ చాల్మర్స్ మాట్లాడుతూ సమర్థలైన విద్యార్థుల వీసా దరఖాస్తులను కూడా ముంబైలోని న్యూజిలాండ్ రాయబార కార్యాలయం తిరస్కరిస్తున్నదని, ఇది తమ దేశంలోని విద్యాసంస్థలను దెబ్బతీయవచ్చునని వ్యాఖ్యానించారు. ఇంగ్లిష్ భాష విషయంలో నిబంధనలను ప్రభుత్వం కఠినతరం చేయడం సరైనదే కానీ, కొందరు విద్యార్థుల వీసా దరఖాస్తులను ఎందుకు తిరస్కరిస్తున్నదన్న విషయంలో స్పష్టత లేదని పేర్కొంది. -
భారతీయులకు అమెరికా వీసాలు బంద్?
వాషింగ్టన్: 23 దేశాలకు వీసాల మంజూరును నిలిపివేయాలంటూ ఒక టాప్ అమెరికన్ సెనేటర్ అమెరికా అధ్యక్షుడు ఒబామాను కోరారు. భారతదేశం, చైనా సహా 23 దేశాల పౌరులకు ఇచ్చే వలస, వలసేతర వీసాలు జారీని ఆపి వేయాలని ఒబామా అడ్మినిస్ట్రేషన్ కు సూచించారు. అక్రమ వలసదారులును తిరిగి స్వీకరించడంలో ఆయా దేశాలు సహకరించడం లేదని ఆరోపిస్తూ ఈ చర్యకు పక్రమించాయి. హంతకులు సహా, ప్రమాదకరమైన నేరస్తులను ప్రతీరోజు రిలీజ్ చేస్తున్నామని, ఆయా దేశాలు వారిని వెనక్కి రప్పించడంలో తమకు సహకరించడం లేదని రిపబ్లికన్ సెనేటర్ చుక్ గ్రాస్లీ ఆరోపించారు. ఆయన ఈమేరకు హోం ల్యాండ్ సెక్యూరిటీ కౌన్సిల్ కి లేఖ రాశారు. ఇలాంటి వారిని ప్రతి రోజు విడుదల చేస్తున్నామని హోంల్యాండ్ సెక్యూరిటీ కార్యదర్శి జె జాన్సన్ కు రాసిన ఆయన లేఖలో కోరారు. అంతకుముందు రెండేళ్లలో 6,100 మంది విడుదలైతే ఒక్క 2015 లోనే 2,166 మందిని ఇలా విడుదల చేశామని తెలిపారు. ప్రస్తుతం, 23 దేశాలు అమెరికాతో సహకరించడం లేదని గ్రాస్లీ తన లేఖలో పేర్కొన్నారు. మొత్తం 62 దేశాల వారిని అమెరికా అవియుధేలుగా గుర్తించినప్పటికీ, 23 దేశాలను పెడసరి దేశాల ఖాతాలో చేర్చింది. ముఖ్యంగా క్యూబా, చైనా, సోమాలియా, భారత్, గయానాలను మరింత మొండిదేశాలుగా తేల్చి పారేసింది. వీటిని టాప్ ఫైవ్ లిస్ట్ లో చేర్చింది. ఇమ్మిగ్రేషన్ అండ్ నేషనాలిటీ చట్టం 243(డీ) ప్రకారం ఈ దేశాల వారి రాకపై చర్యలు తీసుకోవాలని చుక్ గ్రాస్లీ కోరారు. 2001లో ఒక్క గయానా విషయంలోనే ఈ సెక్షన్ ఒకసారి మాత్రం వాడామని, దీంతో తక్షణమే గయనా దిగి వచ్చి సహకారం అందించిందని గుర్తు చేశారు. -
'డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడితే వీసా రద్దు'
హైదరాబాద్ : విదేశాలకు వెళ్లాలనుకునేవారు ఇకపై హైదరాబాద్‌లో జాగ్రత్తగా వాహనం నడపాల్సి ఉంటుంది. లేకుంటే వారి వీసా రద్దు, దరఖాస్తు తిరస్కరణకు గురవుతుంది. నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి శుక్రవారం తెలిపిన వివరాల ప్రకారం.. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడినవారి వివరాలను పోలీసులు పకడ్బందీగా సేకరించి ఉంచుకుంటారు. సదరు వ్యక్తి వీసాను రద్దు చేయటం లేదా వారి దరఖాస్తును తిరస్కరించేందుకు అవకాశాలున్నాయి. అంతేకాదు.. వారు ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నా రిజక్ట్ చేసే ప్రమాదముంది. త్వరలోనే ఈ మేరకు నిబంధనలు అమలు చేయాలంటూ ప్రభుత్వానికి నివేదిక పంపనున్నట్లు ఆయన తెలిపారు. 2011 నుంచి ఇప్పటివరకు నమోదైన 62 వేల డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో 18-30 ఏళ్ల వారు 30 వేలకు మందికి పైగా ఉన్నారని ఆయన వివరించారు. -
హెచ్1బీ వీసాలకు 2.5 లక్షల దరఖాస్తులు
ఇచ్చేవి 65 వేలు.. డ్రా ద్వారా త్వరలో ఎంపిక వాషింగ్టన్: అమెరికాలోని సంస్థల్లో పనిచేసేందుకు విదేశీ నిపుణులకిచ్చే హెచ్1బీ వీసాలకు భారీ సంఖ్యలో దరఖాస్తులు వచ్చినట్లు ఆ దేశ ఇమిగ్రేషన్ విభాగం తెలిపింది. అమెరికాలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న భారత ఐటీ సంస్థలు భారత్ నుంచి నిపుణులను రప్పించుకోవడానికి, భారత్‌లో క్యాంపస్‌లు నెలకొల్పే బహుళజాతి సంస్థలు అక్కడి తమ సిబ్బందిని అమెరికాలోని ఆఫీసులకు తీసుకువచ్చేందుకు ప్రధానంగా ఈ వీసాల కోసం దరఖాస్తు చేస్తుంటాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 65 వేల హెచ్1బీ వీసాలను మంజూరు చేయాలని అమెరికా నిర్ణయించగా, ఇప్పటివరకు 2.5 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు ఇమిగ్రేషన్ విభాగం వెల్లడించింది. అమెరికాలోనే ఉన్నత విద్య చదువుకున్నవారికి ఇచ్చే 20,000 హెచ్1బీల కోసం అంతకు రెండింతలమంది దరఖాస్తు చేసుకున్నారంది. వీటన్నింటిలో అర్హమైన వాటిని ఎంపిక చేసి, కంప్యూటరైజ్డ్ డ్రాలో ఎంపికైనవారికి త్వరలో వీసాలు మంజూరు చేస్తామని తెలిపింది. అయితే దరఖాస్తుల పరిశీలనకు సమయం పడుతుందని, అందువల్ల డ్రా ఎప్పుడు నిర్వహించేదీ ఇప్పుడే వెల్లడించలేకపోతున్నామని పేర్కొంది. -
వీసాల్లో హైదరాబాదే ముందు
హైదరాబాద్ యూఎస్ కాన్సుల్ జనరల్ మైఖేల్ ముల్లిన్స్ సాక్షి, హైదరాబాద్: వీసా కోసం దరఖాస్తు చేసుకోవడంలో దేశంలో కెల్లా హైదరాబాదే మొదటి స్థానంలో ఉందని హైదరాబాద్ యూఎస్ కాన్సూల్ జనరల్ మైఖేల్ ముల్లిన్స్ పేర్కొన్నారు. అమెరికాకు చెందిన యూఎస్ ఇండియా ఎడ్యుకేషన్ ఫౌండేషన్ (యూఎస్ఐఈఎఫ్) ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఓ హోటల్లో యూనివర్సిటీ ఫెయిర్ నిర్వహించారు. అమెరికాకు చెందిన దాదాపు 30 యూనివర్సిటీలు ఫెయిర్‌లో పాల్గొన్నాయి. వర్సిటీల ప్రతినిధులతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు నేరుగా కలుసుకునే అవకాశాన్ని కల్పించారు. ప్రవేశాలు, వీసా దరఖాస్తుల ప్రక్రియ, ఆఫర్ చేస్తున్న ప్రోగ్రాంలు, ఐఈఎల్టీఎస్, టోఫెల్, జీఆర్జీ స్కోరింగ్ తదితర అంశాలపై విద్యార్థులు సందేహాలను నివృత్తి చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ముల్లిన్స్ మాట్లాడుతూ యూజీ, గ్రాడ్యుయేట్, మాస్టర్స్‌కు అమెరికా స్వర్గధామమని చెప్పారు. అక్కడి ప్రఖ్యాతిగాంచిన యూనివర్సిటీలు, అత్యుత్తమ బోధన, పరిశోధనలతో విద్యార్థులకు మంచి భవిష్యత్ లభిస్తోందని తెలిపారు. 2014-15 విద్యా సంవత్సరంలో అమెరికాలో 1.13 లక్షల మంది ఇండియా విద్యార్థులు ఉండగా... ఈ ఏడాది ఆగస్టు నాటికి 1.49 లక్షలకు చేరుకుందని పేర్కొన్నారు. ఏడాది కాలంలోనే 32 శాతం పెరుగుదల కనిపించిందన్నారు. గతంతో పోల్చుకుంటే హైదరాబాద్ నుంచి వీసాకు దరఖాస్తు చేసుకునే వారి సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది 51 శాతం ఎగబాకిందన్నారు. -
వీసాల మోసం కేసు.. ఐదుగురు భారతీయుల అరెస్టు
న్యూయార్క్: అమెరికాలో భారీ స్థాయిలో విద్యార్థుల వీసాలు, ఆర్థిక సాయం విషయంలో మోసానికి పాల్పడిన కేసులో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సహా ఐదుగురు భారతీయులను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో సురేశ్ హీరానందనే(60), ఆయన కుమారుడు సమీర్ హీరానందనే(27), సోదరి అనితా చాబ్రియా(49), బావమరిది లలిత్చాబ్రియా(54), ఉద్యోగి సీమా షా(41) ఉన్నారు. వీరిని గురువారం మన్హటన్ ఫెడరల్ కోర్టులో హాజరు పరిచారు. అభియోగాలు రుజువైతే 5-20 ఏళ్ల శిక్ష పడొచ్చు.