
US Waives In-Person Interview: భారతీయ అమెరికా వీసా దరఖాస్తుదారులకు ఇది మంచి తీపి కబురు. విద్యార్థులు, కార్మికులతో సహా చాలా మంది అమెరికా వీసా దరఖాస్తుదారులకు వ్యక్తిగత ఇంటర్వ్యూలను రద్దు చేసినట్లు అమెరికా తెలిపింది. ఈ ఏడాది 31 వరకు విద్యార్థుల, కార్మికులు, సంస్కృతిక కళాకారులకు సంబంధించిన వివిధ రకాల వీసాల వ్యక్తిగత ఇంటర్వ్వూలను రద్దు చేస్తున్నట్లు అమెరికన్ సీనియర్ దౌత్యవేత్త ఒకరు భారతీయ కమ్యూనిటీ నాయకులకు తెలిపారు. దీనికి విద్యార్థుల(F, M, J), ఉద్యోగులు(H-1, H-2, H-3, L), సంస్కృతిక కళాకారులు , విశిష్ట ప్రతిభావంతులు(O, P, Q )లకు సంబంధించిన దరఖాస్తుదారులు ఈ వీసా వ్యక్తిగత ఇంటర్య్యూల రద్దుకు అర్హులు.
అయితే ఈ విధానం వీసా దరఖాస్తుదారులకు, వారి కుటుంబ సభ్యులకు, స్నేహితులకు ఇది చాలా ఉపయుక్తంగా ఉండటమే కాక చాలా అవరోధాలను, అడ్డంకులను తొలగిస్తుందని దక్షిణాసియా కమ్యూనిటీ నాయకుడు అజయ్ జైన్ భూటోరియా అన్నారు. భూటోరియా ఆసియా అమెరికన్లకు సంబంధించిన అంశాల్లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు సలహదారుడిగా కూడా వ్యవహరిస్తున్నారు.
ఈ మేరకు ఆయన దక్షిణ మధ్య ఆసియా సహాయ కార్యదర్శి డోనాల్ లూతో జరిగిన సమావేశం అనంతరం ఈ విషయాన్ని వెల్లడించారు. డోనాల్ లూ డిసెంబర్ 31 వరకు ఈ ఇంటర్వ్యూలను రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారని భూటోరియా చెప్పారు. అయితే ఈ వ్యక్తిగత ఇంటర్వ్యూల రద్దు విధానం వర్తించాలంటే గతంలో అమెరికాకు సంబంధించిన ఏదైన వీసా పొంది ఉండాలి. కానీ వీసా తిరస్కరణకు గురైనవారు, తగిన అర్హత లేనివారికి ఇది వర్తించదు. అయితే ప్రస్తుతం న్యూఢిల్లీలోని యూఎస్ రాయబార కార్యాలయం వెబ్‌సైట్‌లో చెన్నై, హైదరాబాద్, కోల్‌కతా, ముంబైలోని కాన్సులేట్‌లు ఈ కొత్త ఏడాదికి 20 వేలకు పైన మినహాయింపు (డ్రాప్‌బాక్స్) వీసా దఖాస్తులను ఆహ్వానించింది.
(చదవండి: ఉక్రెయిన్‌కి రూ.65 కోట్ల విరాళం ఇచ్చిన జపాన్ బిలియనీర్!)
Comments
Please login to add a commentAdd a comment