అమెరికా గుడ్‌న్యూస్‌ : అదనంగా 15వేల వీసాలు | US Announces 15000 Additional Visas For Foreign Workers | Sakshi
Sakshi News home page

అమెరికా గుడ్‌న్యూస్‌ : అదనంగా 15వేల వీసాలు

Published Tue, May 29 2018 8:46 AM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM

US Announces 15000 Additional Visas For Foreign Workers - Sakshi

వాషింగ్టన్‌ : వీసాల జారీ విషయంలో కఠినతరమైన నిబంధనలు విధిస్తూ.. విదేశీయులకు చుక్కలు చూపిస్తూ వస్తున్న డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది. అదనంగా 15వేల హెచ్‌-2బీ వీసాలను విదేశీయులకు జారీచేయనున్నట్టు ప్రకటించింది. ఈ వీసాలు ఇప్పటికే 2018 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జారీ చేసిన 66వేల వీసాల కంటే అదనం. అదనపు వీసాలు జారీ చేస్తున్నట్టు డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోమ్‌ల్యాండ్‌ సెక్యురిటీ ప్రకటించింది. ఈ హెచ్‌-2బీ వీసాలను ప్రస్తుతం తాత్కాలికంగా నాన్‌-అగ్రికల్చర్‌ వర్కర్లకు జారీ చేస్తున్నారు. ఈ వీసాల ద్వారా అమెరికన్‌ వ్యాపారాలు పలు అవసరాల నేపథ్యంలో నాన్‌-అగ్రికల్చర్‌ ఉద్యోగాలను పూరించుకోవడం కోసం విదేశీయులను వారి దేశానికి రప్పించడం కోసం ఉపయోగపడుతున్నాయి.

అమెరికాన్‌ వ్యాపారాలను సంతృప్తిపరిచేంతగా, తాత్కాలిక నాన్‌-అగ్రికల్చర్‌ లేబర్‌గా పనిచేసేందుకు ప్రతిభావంతులైన, సరిపడ స్థాయిలో అమెరికన్‌ వర్కర్లు లేరని సెక్రటరీ ఆఫ్‌ హోమ్‌ల్యాండ్‌ సెక్యురిటీ కిర్స్టేజెన్ నీ నీల్సన్ చెప్పారు. సెక్రటరీ ఆఫ్‌ లేబర్‌ అలెక్సాండర్‌ అకోస్టా, కాంగ్రెస్‌ సభ్యులు, వ్యాపార యజమానులతో సమావేశమైన తర్వాత ఆమె ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టు డీహెచ్‌ఎస్‌ ప్రెస్‌కు తెలిపింది. హెచ్‌-2బీ వీసాను కూడా ఇందుకోసమే ప్రత్యేకంగా రూపొందించారు. ప్రతిభావంతులైన, సరిపడ స్థాయిలో వర్కర్లు దొరకనప్పుడు, తాత్కాలికంగా విదేశాల నుంచి అమెరికా వ్యాపారాలకు అనుగుణంగా వర్కర్లను రప్పించుకోవచ్చు. గరిష్టంగా ఈ ఏడాది ప్రథమార్థంలో 33వేల హెచ్‌-2బీ వీసాలు అందుబాటులో ఉంటాయని, మరో 33వేలు వీసాలను ద్వితీయార్థంలో జారీచేయనున్నట్టు హోమ్‌ల్యాండ్‌ సెక్యురిటీ పేర్కొంది. ఈ వారం నుంచి అర్హత కలిగిన వారు హెచ్‌-2బీ వీసాల కోసం ఫామ్‌ 1-129ను సమర్పించాలని చెప్పింది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement