
తెలుగుజాతి ముద్దు బిడ్డ... తెలుగు మీడియా దిగ్గజం రామోజీ రావు మృతి తమను తీవ్రంగా కలిచివేసిందని ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ బోర్డ్ ఛైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని ఒక ప్రకటనలో తెలిపారు. తెలుగు భాష వైభవానికి రామోజీరావు చేసిన కృషి మరువలేనిదన్నారు.. ప్రతి తెలుగువాడికి రామోజీరావు జీవితం ఓ స్ఫూర్తిదాయక పాఠమని నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి అన్నారు.
రామోజీరావు ఈనాడు, ఈటీవీ సంస్థలను ఉన్నత విలువలు ఉన్న సంస్థలుగా నిలబెట్టి మనందరికి విజ్ఞానాన్ని, విలువైన సమాచారాన్ని అందించారని తెలిపారు. రామోజీరావు మరణవార్త అమెరికాలో ఉండే తెలుగువారందరిని దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. రామోజీరావు మృతి పట్ల నాట్స్ సంతాపాన్ని వెలిబుచ్చింది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని నాట్స్ సభ్యులు ప్రార్థించారు. రామోజీరావు కుటుంబ సభ్యులకు నాట్స్ ప్రగాఢ సానుభూతిని తెలిపింది.
(చదవండి: రష్యా నది నుంచి భారతీయ వైద్య విద్యార్థుల మృతదేహాలు వెలికితీత)
Comments
Please login to add a commentAdd a comment