
ముంబై: ‘నేను, నా కుటుంబం.. కాస్తా ప్రశాంతమైన జీవితం అంతే ఇంతకు మించి నేను కోరుకోవడం లేదు’ అంటూ భోజ్‌పురి స్టార్ హీరోయిన్ రాణి ఛటర్జీ సోమవారం ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ తీవ్ర ఒత్తిడితో అదివారం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సెలబ్రిటీలంతా సోషల్ మీడియాలో సుశాంత్‌కు నివాళులు అర్పిస్తున్నారు. అదే విధంగా రాణి, సుశాంత్ మృతిపై స్పందిస్తూ.. ‘‘ప్రస్తుతం నేను కోరుకుంటుంది ఒకటే.. నేను నా కుటుంబం ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఉండాలని. ఈ దశాబ్థ కాలంలో అత్యంత కలతకు గురిచేసిన సంఘటనలో సుశాంత్ మరణం ఒకటి. ఇకపై ఇలాంటి విషాద ఘటనలు జరగకూడదని ఆ దేవుడిని పార్థిస్తున్నాను’’ అంటూ ఇన్‌స్టాలో రాసుకొచ్చారు. (నవంబర్‌లో పెళ్లికి సిద్ధమైన సుశాంత్)
అంతేగాక సుశాంత్ ఫొటోను షేర్ చేస్తూ.. ‘‘ ఆయన మరణించాడన్న విషయాన్ని నమ్మలేకపోతున్న, ఆయన మరణ వార్త అబద్ధమైతే బాగుండు. WHY??????? SHUSHANT #shushantsinghrajput’’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల తను కూడా ఒత్తిడికి లోనయ్యాయని, ఆ సమయంలో క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్నానని వెల్లడించారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులు, స్నేహితుల సహయంతో మెల్లిగా ఒత్తిడి నుంచి బయటపడిగలిగానని చెప్పారు. కావున ఒత్తిడితో పోరాడుతున్న వారికి సహాయం చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. కాగా ప్రస్తుతం రాణి భోజ్‌పురి యాక్షన్ డ్రామా 'లేడీ సింఘం'లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు శక్తి కపూర్ ప్రధాన పాత్రలో కినిపించనున్నట్లు సమాచారం. (అవును... త్వరగా వెళ్లిపోయావ్ సుశాంత్..)
Comments
Please login to add a commentAdd a comment