సాక్షి, నిజామాబాద్: సీనియర్ నాయకుడు ధర్మపురి శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీకి ఎంతో సేవ చేశారు. ఆయన కుటుంబానికి కాంగ్రెస్ అండగా నిలబడుతుందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అలాగే, డీఎస్ కోరికను కూడా మేము నెరవేర్చాము అని తెలిపారు.
కాగా, సీఎం రేవంత్ ఆదివారం నిజామాబాద్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా డీఎస్ భౌతికకాయానికి నివాళులు అర్పించారు. డీఎస్ కుమారులు అర్వింద్, సంజయ్‌లను పరామర్శించారు. అనంతరం, సీఎం రేవంత్ మాట్లాడుతూ..‘ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ అధికారంలోకి రావడానిక డీఎస్ కష్టపడ్డారు. విద్యార్థి నాయకుడి స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగిన వ్యక్తి శ్రీనివాస్. కొంత కాలం కాంగ్రెస్ పార్టీకి దూరమైన పార్లమెంట్‌లో డీఎస్‌ను సోనియా గాంధీ అప్యాయంగానే పలకరించేవారు.
పదవులపై తనకు ఎప్పుడూ ఆశ లేదని డీఎస్ అనేవారు. చనిపోయినపుడు తనపై కాంగ్రెస్ జెండా కప్పి ఉంచాలన్నది డీఎస్ కోరిక. అందుకే ముఖ్య నాయకులను పంపి వారి కోరిక తీర్చాము. డీఎస్ కాంగ్రెస్ పార్టీకి ఎంతో సేవ చేశారు. ఆయన కుటుంబానికి కాంగ్రెస్ అండగా నిలబడుతుంది. కుటుంబ సభ్యులతో చర్చించి డీఎస్ జ్ఞాపకార్ధం ఏం చేయాలో నిర్ణయం తీసుకుంటాం. డీఎస్ మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు’ అంటూ కామెంట్స్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment