Dharmapuri Srinivas
-
డీఎస్ చివరి కోరిక అదే.. మేము నెరవేర్చాం: సీఎం రేవంత్
సాక్షి, నిజామాబాద్: సీనియర్ నాయకుడు ధర్మపురి శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీకి ఎంతో సేవ చేశారు. ఆయన కుటుంబానికి కాంగ్రెస్ అండగా నిలబడుతుందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అలాగే, డీఎస్ కోరికను కూడా మేము నెరవేర్చాము అని తెలిపారు.కాగా, సీఎం రేవంత్ ఆదివారం నిజామాబాద్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా డీఎస్ భౌతికకాయానికి నివాళులు అర్పించారు. డీఎస్ కుమారులు అర్వింద్, సంజయ్‌లను పరామర్శించారు. అనంతరం, సీఎం రేవంత్ మాట్లాడుతూ..‘ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ అధికారంలోకి రావడానిక డీఎస్ కష్టపడ్డారు. విద్యార్థి నాయకుడి స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగిన వ్యక్తి శ్రీనివాస్. కొంత కాలం కాంగ్రెస్ పార్టీకి దూరమైన పార్లమెంట్లో డీఎస్‌ను సోనియా గాంధీ అప్యాయంగానే పలకరించేవారు.పదవులపై తనకు ఎప్పుడూ ఆశ లేదని డీఎస్ అనేవారు. చనిపోయినపుడు తనపై కాంగ్రెస్ జెండా కప్పి ఉంచాలన్నది డీఎస్ కోరిక. అందుకే ముఖ్య నాయకులను పంపి వారి కోరిక తీర్చాము. డీఎస్ కాంగ్రెస్ పార్టీకి ఎంతో సేవ చేశారు. ఆయన కుటుంబానికి కాంగ్రెస్ అండగా నిలబడుతుంది. కుటుంబ సభ్యులతో చర్చించి డీఎస్ జ్ఞాపకార్ధం ఏం చేయాలో నిర్ణయం తీసుకుంటాం. డీఎస్ మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు’ అంటూ కామెంట్స్ చేశారు. -
ధర్మపురి శ్రీనివాస్‌కు ప్రముఖుల నివాళి (ఫొటోలు)
-
డీఎస్ మృతి పట్ల వైఎస్ జగన్ సంతాపం
సాక్షి, తాడేపల్లి: మాజీ మంత్రి, సీనియర్ నేత ధర్మపురి శ్రీనివాస్ మృతి పట్ల వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంతాపం తెలిపారు. డీఎస్ మరణం దిగ్భ్రాంతి కలిగించిందని.. దివంగత మహానేత వైఎస్సార్‌తో ధర్మపురి శ్రీనివాస్‌కు ఉన్న అనుబంధం మరిచిపోలేనిదని వైఎస్ జగన్ అన్నారు. డీఎస్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. కాగా, ధర్మపురి శ్రీనివాస్ మరణం పట్ల ఆయన కుటుంబ సభ్యులకు వైఎస్ జగన్ సానుభూతి తెలిపారు.సంబంధిత వార్త: కాంగ్రెస్ సీనియర్ నేత ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూత -
ధర్మపురి శ్రీనివాస్ మృతి పట్ల ప్రముఖుల సంతాపం
ధర్మపురి శ్రీనివాస్‌కు ప్రముఖుల సంతాపం లైవ్ అప్డేట్స్.. కేసీఆర్ సంతాపం..👉ధర్మపురి శ్రీనివాస్ మరణం పట్ల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ సంతాపం ప్రకటించారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.కేటీఆర్ సంతాపం..👉రాజకీయాల్లో అజాత శత్రువు ధర్మపురి శ్రీనివాస్. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. ఆయన చనిపోవటం బాధాకరమైన విషయం. శ్రీనివాస్ భౌతికకాయానికి నివాళులు అర్పించిన కేటీఆర్, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి👉ధర్మపురి శ్రీనివాస్ పార్థివ దేహానికి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే దానం నాగేందర్సీఎం రేవంత్ సంతాపం.. 👉ధర్మపురి శ్రీనివాస్ పట్ల సీఎం రేవంత్ సంతాపం ప్రకటించారు. ఉమ్మడి రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షునిగా పని చేసిన డీఎస్ కాంగ్రెస్ పార్టీలో కీలక పాత్ర పోషించారని గుర్తు చేసుకున్నారు. సుదీర్ఘ కాలం కాంగ్రెస్ పార్టీకి ఆయన విశిష్ట సేవలను అందించారని అభిప్రాయపడ్డారు. సామాన్య స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదిగిన డీఎస్ రాజకీయ నేతలెందరికో ఆదర్శంగా నిలిచారని స్మరించుకున్నారు. తెలంగాణ ఉద్యమ సందర్భంలోనూ, కాంగ్రెస్ రాజకీయ ప్రస్థానంలో ఆయన తన ప్రత్యేక ముద్రను చాటుకున్నారని గుర్తు చేసుకున్నారు. ధర్మపురి శ్రీనివాస్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థించారు. ఆయన కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంతాపం..👉 ఈరోజు చాలా బాధాకరమైన రోజు. శ్రీనివాస్‌కు కాంగ్రెస్ అంటే ప్రాణం. మాలాంటి ఎంతోమంది ఎదుగుదలకి ధర్మపురి శ్రీనివాసే కారణం. డీఎస్ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తన్నాం. 👉కాంగ్రెస్ నేతల నివాళులు..కాంగ్రెస్ పార్టీ భావజాలాన్ని తెలుగు రాష్ట్రాల్లో విస్తరింపజేసిన కీలక నేతల్లో డి.శ్రీనివాస్ ఒకరని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. డీఎస్ మృతి పట్ల వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి, సంతాపం తెలియజేస్తున్నట్లు ప్రకటించారు. పీసీసీ అధ్యక్షుడిగా డీఎస్ సేవలు గుర్తు చేసుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్, వారి కుటుంబసభ్యులకు భగవంతుడి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. వీరితో పాటు డీఎస్ మృతిపట్ల మంత్రులు తుమ్మల నాగేశ్వర రావు, సీతక్క, జూపల్లి కృష్ణారావు, వి.హనుమంతరావు తదితరులు సంతాపం వ్యక్తం చేశారు. డీఎస్ పార్థివదేహానికి నివాళులు అర్పించారు.శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి డి.శ్రీనివాస్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని, డీఎస్ గొప్ప నాయకునిగా ఎదిగారని కొనియాడారు. సామాన్య స్థాయి నుంచి పీసీసీ అధ్యక్షుడు, మంత్రిగా పని చేసే స్థాయికి ఆయన ఎదిగారని గుర్తు చేశారు. డీఎస్ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించాలని భగవంతుడిని ప్రార్టిస్తున్నట్లు సుఖేందర్ రెడ్డి తెలిపారు.👉కిషన్ రెడ్డి సంతాపం..ధర్మపురి శ్రీనివాస్ సుదీర్ఘ రాజకీయ జీవితంలో ప్రజాసేవకు అంకితమయ్యారు. 2004-2009లో అసెంబ్లీలో వారందించిన ప్రోత్సాహం మరువలేనిది.శ్రీనివాస్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. బీజేపీ ఎంపీ అరవింద్, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.👉డీఎస్ మృతి బాధాకరం: డీకే అరుణడీఎస్ తనయుడు ప్రస్తుత నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, వారి కుటుంబ సభ్యులను ఫోన్లో పరామర్శించి ఓదార్చిన డీకే అరుణ. మంత్రిగా, పీసీసీ చీఫ్‌గా, ఎంపీగా డీఎస్ చేసిన సేవలు మరువలేనివి. శ్రీనివాస్ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తున్నాను. 👉డీ శ్రీనివాస్ మృతి పట్ల ఏపీ సీఎం చంద్రబాబు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. అలాగే, నారా లోకేష్ కూడా సంతాపం ప్రకటించారు. 👉తెలంగాణలో కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూశారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో శనివారం తెల్లవారుజామున మూడు గంటలకు ఆయన తుది శ్వాస విడిచినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇక, గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. గుండెపోటుతో చనిపోయారు. -
రాజకీయాల్లో అందరివాడు ఆత్మీయుడు డీఎస్ (ఫొటోలు)
-
కాంగ్రెస్ సీనియర్ నేత ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూత
హైదరాబాద్, సాక్షి: కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్(76) కన్నుమూశారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో తెల్లవారుజామున 3 గంటలకు ఆయన తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. గుండెపోటుతో చనిపోయినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన డీఎస్.. 1948 సెప్టెంబర్ 27న జన్మించారు. కాంగ్రెస్ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారు. ఉమ్మడి ఏపీలో మంత్రిగా, పీసీసీ చీఫ్‌గా పని చేశారు. 1989, 1999, 2004లో ఎమ్మెల్యేగా గెలిచారాయన. 2004, 2009 ఎన్నికల సమయంలో పీసీపీ చీఫ్‌గా ఉన్నారు. వైఎస్సార్ హయాంలో మంత్రిగా ఈయన పని చేశారు. రాష్ట్ర విభజన తర్వాత బీఆర్ఎస్లో చేరిన డీఎస్.. రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. కొద్ది రోజుల పాటు ప్రభుత్వ సలహాదారుగా బాధ్యతలు నిర్వహించారు, ఆ తర్వాత రాజ్యసభకు వెళ్లారు. అనంతరం మళ్లీ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అనారోగ్యం కారణంగానే ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారాయన. డీఎస్ కుటుంబండీఎస్కు భార్యా, ఇద్దరు కుమారులు ఉన్నారు. వారిలో చిన్న కుమారుడు ధర్మపురి అర్వింద్ బీజేపీ తరఫున నిజామాబాద్ ఎంపీగా గెలిచారు. పెద్ద కుమారుడు సంజయ్ గతంలో నిజామాబాద్ మేయర్ పనిచేశారు. డీఎస్ మృతితో తెలంగాణ రాజకీయ వర్గాల్లో విషాదం నెలకొంది. ఆయన మృతికి పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.రేపు అధికార లాంఛనాలతో అంత్యక్రియలుహైదరాబాద్ బంజారాహిల్స్‌లోని నివాసంలో డీఎస్ పార్థివ దేహాన్ని ఉంచారు. కడసారి చూసేందుకు డీఎస్ నివాసానికి కాంగ్రెస్ శ్రేణులు అభిమానులు చేరుకుంటున్నారు. సాయంత్రం నిజామాబాద్ ప్రగతినగర్‌లోని నివాసానికి డీఎస్ పార్థీవ దేహం తరలించనున్నారు. రేపు మధ్యాహ్నాం నిజామాబాద్‌లో డీఎస్ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మరోవైపు ఆయన అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ సర్కార్ నిర్వహించింది. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని సీఎస్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. -
చేరికల చిచ్చు.. ఒక్క రోజుకే కాంగ్రెస్‌కు డీఎస్ రాజీనామా.. అసలేమైంది?
సాక్షి, హైదరాబాద్: మాజీ రాజ్యసభ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ కుటుంబంలో చేరికల చిచ్చు చెలరేగింది. నిన్న (ఆదివారం)డీఎస్, ఆయన కుమారుడు సంజయ్ తిరిగి కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే. అయితే సొంతగూటికి చేరిన ఒక్కరోజుకే(సోమవారం) ఆ పార్టీకి రాజీనామా చేస్తునట్లు డీఎస్ ప్రకటించారు. ఈ మేరకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ఆయన లేఖ రాశారు. డీఎస్ లేఖ రాస్తున్న వీడియోను కూడా విడుదల చేశారు. రాజీనామా లేఖను ఆయన సతీమణి విజయలక్ష్మి మీడియాకు విడుదల చేశారు. డీఎస్ ఆరోగ్యం సహకరించట్లేదని, కాంగ్రెస్ వాళ్లు తమ ఇంటి వైపుకు రావొద్దని డీఎస్ భార్య విజ్ఞప్తి చేశారు. కాగా తొలుత కాంగ్రెస్ నేత అయిన డీఎస్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పీసీసీ చీఫ్‌గా పనిచేశారు. రాష్ట్ర విభజన తరువాత టీఆర్ఎస్(ప్రస్తుత బీఆర్ఎస్) పార్టీలో చేరి రాజ్యసభ ఎంపీగా ప్రాతినిథ్యం వహించారు. కొంతకాలంగా బీఆర్ఎస్కు ఆయన దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో ఆదివారం తన కొడుకు సంజయ్‌తో కలిసి గాంధీభవన్‌కు వచ్చిన డీఎస్.. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి మాణిక్‌రావ్ ఠాక్రే సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. అయితే మరుసటి రోజే కాంగ్రెస్‌కు రాజీనామా చేయడం సంచలనంగా మారింది. కాగా డీఎస్ మరో కొడుకు అర్వింద్ బీజేపీ ఎంపీగా కొనసాగుతున్నారు. కాగా ‘కొడుకు సంజయ్ కాంగ్రెస్‌లో చేరిన సందర్భంగా ఆశీస్సులు ఇవ్వడానే గాంధీభవన్‌కు వచ్చాను. కానీ తాను కూడా మళ్లీ పార్టీలో చేరినట్టుగా మీడియాలో ప్రచారం చేశారు. నేను ఎపన్పటికీ కాంగ్రెస్ వాదినే కానీ.. ప్రస్తుతం నా వయస్సు, ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా క్రీయాశీల రాజకీయాలకు దూరంగా ఉండాలనుకుంటున్నాను. పార్టీలో నా చేరికకూ, నా కుమారుడు సంజయ్ టికెట్‌కు ముడిపెట్టడం భావ్యం కాదు. నన్ను వివాదాల్లోకి లాగవద్దని విజ్ఞప్తి. కాంగ్రెస్ పార్టీలో నేను మళ్లీ చేరానని మీరు భావిస్తే ఈ లేఖను రాజీనామాగా భావించి ఆమోదించవలసిందిగా కోరుకుంటున్నాను’ అని లేఖలో పేర్కొన్నారు. -
తండ్రి కాంగ్రెస్ లో.. తనయుడు బీజేపీలో..!!
-
ఓ కుటుంబ కథా చిత్రం..
-
ఒకే వేదికపై తండ్రీకొడుకులు
సాక్షి, నిజామాబాద్ : నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ జిల్లా అభివృద్ధికి పాటుపడతారని రాజ్యసభ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఆదివారం నగరంలో నిర్వహించిన అన్నదాతల ఆశీర్వాద సభలో డీఎస్, అరవింద్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో కాపు సంఘం ప్రతినిధులు అరవింద్‌కు సన్మానం చేశారు. ఈ సందర్భంగా డీఎస్ మాట్లాడుతూ.. నిజామాబాద్ ఎంపీగా గెలిచిన అరవింద్‌కు అభినందనలు తెలిపారు. మున్నూరు కాపులను రాష్ట్ర ప్రభుత్వం అనేక రకాలుగా ఇబ్బంది పెట్టిందని ఆయన మండిపడ్డారు. అరవింద్ మాట్లాడుతూ.. ఒక రైతు బిడ్డను ఎంపీగా గెలిపించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రైతే రాజు అంటూనే.. అన్నదాతలను ఇబ్బందులకు గురిచేస్తుందని ఆరోపించారు. రైతులతో పెట్టుకోవడం వల్ల.. రాజు బిడ్డను ఇంటికి సాగనంపారని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో రైతు వ్యతిరేక పాలనే కాకుండా, పేదల వ్యతిరేక పాలన కొనసాగుతుందని విమర్శించారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి పట్టిన గతే .. రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ పట్టడం ఖాయమని అన్నారు. అయితే చాలా రోజుల తర్వాత తండ్రీకొడుకులు ఒకే వేదికను పంచుకోవడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. నిజామాబాద్ జిల్లాకు చెందిన కొందరు టీఆర్ఎస్ నేతలు తనపై కక్షగట్టారని ఆరోపించిన డీఎస్ ఆ పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు. ఆ తర్వాత డీఎస్ తిరిగి కాంగ్రెస్‌లో చేరాతరనే వార్తలు వచ్చినప్పటికీ.. అవి నిజం కాలేదు. మరోవైపు డీఎస్ తనయుడు అరవింద్ మాత్రం తండ్రి టీఆర్ఎస్లో యాక్టివ్‌గా ఉన్న సమయంలోనే బీజేపీలో చేరారు. ఈ ఎన్నికల్లో బీజేపీ నుంచి బరిలో నిలిచిన అరవింద్ కేసీఆర్ కూతురు కవితను ఓడించారు. ప్రస్తుతం రాష్ట్రంలో బలమైన శక్తిగా ఎదగాలని భావిస్తున్న బీజేపీ.. ఆ ప్రయత్నాల్లో భాగంగా డీఎస్‌ను కూడా పార్టీలో చేర్చుకుంటుందా అనే సందేహాలు తలెత్తుతున్నాయి. -
తండ్రి రాజ్యసభకు.. కొడుకు లోక్‌సభకు..
సాక్షిప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ పార్లమెంట్ స్థానంలో అరుదైన రాజకీయ పరిణామం చోటు చేసుకుంది. తండ్రీ కొడుకులిద్దరు పార్లమెంట్ సభ్యులుగా ప్రాతినిధ్యం వహించనున్నారు. ఇప్పటికే రాజ్యసభ సభ్యులుగా సీనియర్ నేత ధర్మపురి శ్రీనివాస్ కొనసాగుతుండగా, ఈ ఎన్నికల్లో ఆయన కుమారుడు అర్వింద్ ధర్మపురి కూడా ఎంపీగా విజయం సాధించారు. కాగా డి శ్రీనివాస్ టీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండగా, అర్వింద్ బీజేపీ సభ్యులుగా కొనసాగనున్నారు. -
భూపతిరెడ్డికి అంత సీన్ లేదు
నిజామాబాద్ : టీఆర్ఎస్ అసమ్మతి ఎమ్మెల్సీ భూపతిరెడ్డికి అంత సీన్ లేదని నిజామాబాద్ రూరల్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ వ్యాఖ్యానించారు. విలేకరులతో మాట్లాడుతూ..తనకు ప్రజా మద్ధతు మెండుగా ఉందని వ్యాఖ్యానించారు. రాజ్యసభ సభ్యుడు డి. శ్రీనివాస్, భూపతిరెడ్డి ఇద్దరూ ఒక్కటయ్యారని, అందులో భాగంగానే కుట్రలకు తెరలేపారని అన్నారు. భూపతిరెడ్డి వ్యాఖ్యల్ని ఖండిస్తున్నానని చెప్పారు. వీరి వ్యవహారాన్ని మొదట్లో కేసీఆర్ దృష్టికి ఎప్పుడూ తీసుకెళ్లలేదని, ఇద్దరూ కలిసి కుమ్మక్కై ఇప్పుడు తనను ఓడించడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. డీఎస్ ఢిల్లీలో కూర్చుని పార్టీని బెదిరిస్తుంటారని ఎద్దేవా చేశారు. భూపతిరెడ్డి చేసే ఆరోపణలు నిరాధారమని, నిజామాబాద్ రూరల్ ఎన్నికల్లో తానే గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. -
రాజీనామా చేయను.. మీరే సస్పెండ్ చేయండి
సాక్షి, నిజామాబాద్: తాను టీఆర్ఎస్కు రాజీనామా చేయనని, కావాలంటే సస్పెండ్ చేయాలని టీఆర్ఎస్ అధిష్టానాన్ని రాజ్యసభ ఎంపీ డీ శ్రీనివాస్ డిమాండ్ చేశారు. నిజామాబాద్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ‘నేను రాజీనామా చేసి పార్టీని వదిలి వెళ్తే మీరు చేసిన ఆరోపణలు నిజమని ఒప్పుకున్నట్లు అవుతుంది. నన్ను సస్పెండ్ చేయడం చేతకాకపోతే తీర్మానాన్ని వెనక్కు తీసుకోవాలని సూచించారు. తనను రాజకీయంగా దెబ్బ తీశారని, నా కుటుంబాన్ని రోడ్డుకు ఈడ్చారు. లేనిపోనివన్నీ కల్పించి జిల్లా యంత్రాంగంపై ఒత్తిడి తెచ్చి నా కుమారుడు సంజయ్‌పై కేసు పెట్టించార’ని ఆరోపించారు. హైకోర్టు 41ఏ నోటీసు ఇచ్చినా ఆ ఆర్డర్లు పట్టించుకోకుండా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారని విమర్శించారు. ఇందులో ప్రభుత్వం ఎంత ఆసక్తి తీసుకుందో అందరికీ అర్ధమవుతోందని, తనపై నిరాధార ఆరోపణలు చేశారని ధ్వజమెత్తారు. తాను ఎలాంటి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు చేశానో స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు. ఎప్పుడు ఎక్కడ పార్టీని బలహీన పరిచానో నిరూపించాలని కోరారు. తాను బీజేపీకి ఎలా ఉపయోగపడ్డానో, బీజేపీకి తన సహచరులను ఎవరిని పంపానో చూపించాలని పేర్కొన్నారు. తాను టీఆర్ఎస్లో ఉండటం టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులకు, ఎంపీ కవితకు ఇష్టం లేకపోతే దయచేసి తనను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలన్నారు. ఇంకా మాట్లాడుతూ.. ‘ఈ రోజుల్లో ఎదిగిన కుమారులు స్వతంత్రంగా జీవిత నిర్ణయాలు తీసుకుంటున్నారు. నా ఇంట్లోనే కాదు అందరి ఇళ్లల్లోనూ జరిగేది కూడా అదే. నా రెండో కుమారుడు అరవింద్ బీజేపీలో చేరడం అతని స్వీయ నిర్ణయం. నా ప్రమేయం లేదు అయినా నేను ఏమీ చేయలేని పరిస్థితి. కేసీఆర్‌కి ముందే రెండుసార్లు చెప్పాను. నా కుమారుడు అరవింద్ మోడీ అభిమాని అని. గతంలోనే కాలినడకన వెళ్లి బీజేపీలో చేరే ప్రయత్నం చేశాడు. నా 50 ఏళ్ల రాజకీయ జీవితంలో క్రమశిక్షణతో మెలిగాను. పార్టీని మోసం చేయడం నాకు తెలియదు. తెలంగాణ పట్ల నాకు ఉన్న ప్రేమ నిబద్దతను ఎవరూ ప్రశ్నించలేరు. అలాంటి నాపై లేనిపోని అభాండాలు మోపి నన్నో పార్టీ వ్యతిరేకిగా ముద్ర వేశారు. మనసులో ఏదో పెట్టుకొని నిరాధారమైన, నిజాయితీ లేని ఆరోపణలు చేస్తూ నన్ను రాజకీయంగా దెబ్బ తీయాలని చూస్తున్నా’ ని వ్యాఖ్యానించారు. నాపై చర్యల విషయంలో టీఆర్ఎస్కు డెడ్‌లైన్ ఇవ్వను కానీ సమయం, సందర్భాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటానని.. ఈ విషయంలో చాలా సీరియస్‌గా ఉన్నానని తెలిపారు. సస్పెండ్ చేయాలి లేదా తీర్మానం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
సంజయ్ కేసు.. హైకోర్టులో డీఎస్ పిటిషన్
హైదరాబాద్: నర్సింగ్ విద్యార్థినిలపై లైంగిక వేధింపుల కేసులో తన కుమారుడు సంజయ్‌ని అరెస్ట్ చేసి పోలీసు రిమాండ్ విధించడాన్ని సవాల్ చేస్తూ రాజ్యసభ సభ్యుడు డీ శ్రీనివాస్ గురువారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన కుమారుడిని ఏపీ పోలీస్ మాన్యువల్ ప్రకారం కేసు నమోదు చేసి రిమాండ్ చేశారు..తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఐదు సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఇప్పటి వరకు పోలీసు మాన్యువల్ తయారు చేయలేదని పేర్కొన్నారు. నిజామాబాద్ మాజీ మేయర్ సంజయ్‌పై పెట్టిన కేసులు చెల్లవని హైకోర్టులో డీఎస్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌ను స్వీకరించిన న్యాయస్థానం తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది. -
డీఎస్ తనయుడి చుట్టూ బిగుస్తున్న ఉచ్చు
-
అజ్ఞాతంలోకి సంజయ్.. పోలీసుల గాలింపు
సాక్షి, నిజామాబాద్: సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు డీ శ్రీనివాస్ తనయుడు సంజయ్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. లైంగిక వేధింపుల కేసులో అతన్ని అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధమైంది. విద్యార్థినుల ఫిర్యాదుతో ధర్మపురి సంజయ్‌పై నిర్భయ చట్టం కింద కేసు నమోదు అయ్యింది. సంజయ్ తమను లైంగికంగా వేధిస్తున్నాడంటూ శాంకరీ నర్సింగ్ కళాశాల విద్యార్థినులు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేసు నమోదుకాగా, అరెస్ట్ చేయడానికి శుక్రవారం సాయంత్రం పోలీసులు సంజయ్ ఇంటికి వెళ్లారు. అయితే సంజయ్ అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. దీంతో పోలీసులు గాలింపు చేపట్టారు. (శాంకరి కాలేజీ వేరే వాళ్లకు ఇచ్చాం) సంజయ్ తమను లైంగికంగా వేధిస్తున్నాడంటూ 11 మంది నర్సింగ్ విద్యార్థినులు గురువారం తెలంగాణ హోం శాఖా మంత్రి నాయిని నర్సింహారెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో నాయిని సూచన మేరకు ఈ ఉదయం నిజామాబాద్ సీపీని కలిసి విద్యార్థులు మరోసారి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దీంతో సంజయ్‌పై నిర్భయ యాక్ట్ కింద కేసును పోలీసులు నమోదు చేశారు. సంజయ్‌ను ఏ క్షణంలోనైనా పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉంది. అయితే తాను ఎవరినీ వేధించలేదంటూ సంజయ్ ఆ ఆరోపణలను ఖండించిన విషయం విదితమే. విద్యార్థినులపై సంజయ్ లైంగిక వేధింపులు పాల్పడటంపై మహిళా సంఘాలు భగ్గమంటున్నాయి. తక్షణమే సంజయ్‌ను అరెస్ట్ చేయాలనీ, శాంకరి నర్సింగ్ కాలేజీ మూసివేయాలని విద్యార్థులు, మహిళా సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. ఈ వ్యవహారంపై విచారణ జరపాలని హోంమంత్రి నాయిని డీజీపీని ఆదేశించారు కూడా. 'అది టీఆర్ఎస్ అంతర్గత వ్యవహారం' -
'లైంగిక ఆరోపణలు.. టీఆర్ఎస్ అంతర్గత వ్యవహారం'
సాక్షి, నిజామాబాద్ : టీఆర్ఎస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్(డీఎస్) కుమారుడు సంజయ్‌పై వస్తున్న లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో మరో కుమారుడు బీజేపీనేత ధర్మపురి అరవింద్ స్పందించారు. సంజయ్ మీద వచ్చిన ఆరోపణలు టీఆర్ఎస్ అంతర్గత వ్యవహారమని అరవింద్ అన్నారు. సంజయ్‌పై వస్తున్న ఆరోపణలు తనకు వ్యక్తిగతంగా డ్యామేజీ జరుగుతుందని అనుకోవడం లేదన్నారు. తాము విడిపోయి 20 ఏళ్లు దాటిపోయిందని అరవింద్ తెలిపారు. 'రాష్ట్రంలో వ్యవసాయ సంక్షోభం నెలకొంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఆయకట్టు రైతులు 10 రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. శ్రీరాంసాగర్ నుంచి వెంటనే సాగునీరు విడుదల చేయాలి. టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు వ్యతిరేకంగా మారిపోయింది. మంత్రి ఎక్కడ ఉన్నారో ఎందుకు నిజామాబాద్ వైపు రారో తెలియదు. షుగర్ ఫ్యాక్టరీ కోసం రైతులు ఎదురుచూస్తుంటే రైతు ప్రజా సమస్యల నుంచి దృష్టి మరల్చేందుకు ఎంపీ కవిత ఐటీ హబ్ తెర మీదకు తెస్తారు. టీఆర్ఎస్ వాళ్లు యువత చెవుల్లో ఐటీ హబ్ పేరుతో గులాబీ పువ్వులు పెడుతున్నారు. విద్యార్థుల మీద ప్రేమ ఉంటే తెలంగాణ యూనివర్సిటీని ఎందుకు అభివృద్ధి చేయరు. ఎంతమంది విద్యార్థులను ఎంపీ కవిత అమెరికా పంపారు' అని ధర్మపురి అరవింద్ పేర్కొన్నారు. సంబంధిత వార్తలు : ఎవరితో సహజీవనం చేయడం లేదు : డీఎస్ కుమారుడు డీఎస్ తనయుడి లైంగిక వేధింపులు! -
ఎవరితోనూ సహజీవనం చేయడం లేదు
సాక్షి, నిజామాబాద్ : తనపై వస్తున్న లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో టీఆర్ఎస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్(డీఎస్) కుమారుడు సంజయ్ స్పందించారు. 'నాపై వస్తున్న ఆరోపణల్లో వాస్తవాలు లేవు. శాంకరి నర్సింగ్ కాలేజీ వేరే వాళ్లకు ఇచ్చాము. అక్కడికి నేను వెళ్ళలేదు. అడ్మిషన్లతో నాకు ఎలాంటి సంబంధం లేదు. ఆ కాలేజీలో ఎవరు చదువుతున్నారో కూడా తెలియదు. నాకు భార్య పిల్లలు ఉన్నారు. ఎవరితో సహజీవనం చేయడం లేదు. ఎవరో విద్యార్థినులతో అలా చెప్పించారు. రాజకీయంగా దెబ్బ తీయడానికే ఇవన్నీ జరుగుతున్నట్టు అనిపిస్తుంది. ఎవరో తెలియదు కానీ మా ఫ్యామిలీని టార్గెట్ చేశారు. ఎన్నికలు వస్తున్న సందర్భంగా ఇలాంటివి జరుగుతున్నాయి. రాజకీయ దురుద్దేశంతోనే ఇలా చేస్తున్నారు' అని ధర్మపురి సంజయ్ పేర్కొన్నారు. కాగా, డీఎస్ తనయుడు తమను లైంగికంగా వేధిస్తున్నాడంటూ శాంకరి నర్సింగ్ కాలేజీ విద్యార్థులు హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డికి గురువారం ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఆరు నెలలుగా తమను సంజయ్ లైంగికంగా వేధిస్తున్నాడని 11 మంది విద్యార్థులు ఫిర్యాదులో పేర్కొన్నారు. తనకు చెందిన శాంకరి కాలేజీలో చదువుతున్న విద్యార్థినులపై సంజయ్ లైంగిక వేధింపులు పాల్పడటంపై మహిళా సంఘాలు భగ్గమంటున్నాయి. తక్షణమే సంజయ్‌ను అరెస్ట్ చేయాలనీ, శాంకరి నర్సింగ్ కాలేజీ మూసివేయాలని విద్యార్థులు, మహిళా సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. ఈ వ్యవహారంపై విచారణ జరపాలని హోంమంత్రి నాయిని డీజీపీని ఆదేశించారు. -
విద్యార్థినులపై డీఎస్ తనయుడి లైంగిక వేధింపులు!
-
విద్యార్థినులపై డీఎస్ తనయుడి లైంగిక వేధింపులు!
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్(డీఎస్) కుమారుడు సంజయ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. డీఎస్ తనయుడు తమను లైంగికంగా వేధిస్తున్నాడంటూ శాంకరి నర్సింగ్ కాలేజీ విద్యార్థులు హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డికి గురువారం ఫిర్యాదు చేశారు. ఆరు నెలలుగా తమను సంజయ్ లైంగికంగా వేధిస్తున్నాడని 11 మంది విద్యార్థులు ఫిర్యాదులో పేర్కొన్నారు. తనకు చెందిన శాంకరి కాలేజీలో చదువుతున్న విద్యార్థినులపై సంజయ్ లైంగిక వేధింపులు పాల్పడటంపై మహిళా సంఘాలు భగ్గమంటున్నాయి. తక్షణమే సంజయ్‌ను అరెస్ట్ చేయాలనీ, శాంకరి నర్సింగ్ కాలేజీ మూసివేయాలని విద్యార్థులు, మహిళా సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. ఈ వ్యవహారంపై విచారణ జరపాలని హోంమంత్రి నాయిని డీజీపీని ఆదేశించారు. -
టీఆర్ఎస్లో డీఎస్ ఒంటరి!
సాక్షి, హైదరాబాద్: తన కుమారుడు తీసుకున్న ఓ నిర్ణయం సీనియర్ నాయకుడు ధర్మపురి శ్రీనివాస్ (డీఎస్) క్రియాశీల రాజకీయాలపై పడిందా..? సుదీర్ఘ రాజకీయ అనుభవమున్న డీఎస్‌ను అధికార టీఆర్ఎస్లో ప్రాధాన్యం తగ్గిపోవడం వెనుక ఈ అంశమే దాగుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. రాష్ట్రం ఏర్పాటయ్యాక టీఆర్ఎస్లో చేరిన ఆయనకు రాజ్యసభ స్థానం కూడా దక్కింది. కానీ నిజామాబాద్ రాజకీయాల కారణంగా కొద్దిరోజుల్లోనే ఆయనకు పార్టీలో ప్రాధాన్యం తగ్గడం మొదలైందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. డీఎస్ తనయుడు అరవింద్ బీజేపీలో చేరడం, అదీ నిజామాబాద్ ఎంపీ టికెట్ ఇస్తామన్న హామీ తీసుకుని కాషాయ కండువా కప్పుకోవడంతో విషయం పెద్దదైందని చెబుతున్నారు. తన రాజకీయం, తన తనయుడి రాజకీయం వేర్వేరని.. తనకేం సంబంధం లేదని డీఎస్ తెలంగాణ భవన్ వేదికగా వివరణ ఇచ్చుకున్నా.. టీఆర్ఎస్ అధినాయకత్వాన్ని సంతృప్తిపర్చ లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. స్థానికంగానూ పట్టని వైనం.. ప్రస్తుతం టీఆర్ఎస్లో డీఎస్ ఒంటరి అయ్యారనే అభిప్రాయం వినిపిస్తోంది. ముఖ్యంగా నిజామాబాద్ కేంద్రంగా టీఆర్ఎస్లో ఆయన ఉనికే ప్రశ్నార్థకంగా మారిందంటున్నారు. కాంగ్రెస్‌ను వీడి డీఎస్‌తో పాటు టీఆర్ఎస్లోకి వచ్చిన కొందరు కార్పొరేటర్లు, ఎంపీపీలు, జెడ్పీటీసీలకు గుర్తింపు లేకుండా పోయిందని చెబుతున్నారు. స్థానిక అర్బన్, రూరల్ ఎమ్మెల్యేలు వారిని పట్టించుకోవడం లేదని, పార్టీ పరంగా పదవులూ ఇవ్వడం లేదని పేర్కొంటున్నారు. మరోవైపు డీఎస్‌కు అధికారుల నుంచి సహకారం లభించడం లేదని, ఏ పనీ కావడం లేదని చెబుతున్నారు. ఎంపీ ల్యాడ్స్ నుంచి ఉపాధిహామీ పథకానికి మ్యాచింగ్ గ్రాంటు ఇచ్చి ప్రతిపాదించిన పనులకు మండల పరిషత్‌లు సైతం ఆమోద తీర్మానాలు చేయడం లేదని సమాచారం. ఇక రాష్ట్ర స్థాయిలోనూ డీఎస్‌కు గుర్తింపు లేకుండా పోయిందని అంటున్నారు. డీఎస్‌తో సమ ఉజ్జీ అయిన మరో రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు(కేకే)కు టీఆర్ఎస్లో మంచి ప్రాధాన్యమే లభిస్తోంది. పార్టీ పార్లమెంటరీ నేతగా ఉన్న ఆయన సంస్థాగతంగా మరోమారు సెక్రెటరీ జన రల్‌గా నియమితులు కావడం గమనార్హం. ఎటువైపు చూపు? రాజ్యసభ సభ్యుడిగా ఉన్న డీఎస్ తన రాజకీయ భవిష్యత్‌పై కీలక నిర్ణయం తీసుకునేందుకు ఇటీవల సమాలోచనలు జరిపారన్న ప్రచారం జరిగింది. ఆయన తిరిగి కాంగ్రెస్‌కు వెళతారని కొన్ని వర్గాలు పేర్కొనగా.. డీఎస్ ఆ వార్తలను ఖండించారు. తాజాగా తన తనయుడి మాదిరిగా డీఎస్ సైతం బీజేపీలోకి వెళతారన్న ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి అరవింద్ బీజేపీలో చేరక ముందే డీఎస్ చేరికపై మంతనాలు జరిగాయన్న వార్తలు వెలువడ్డాయి. దీనిపై అధికార టీఆర్ఎస్ నుంచి బలమైన ఒత్తిడి రావడంతో పార్టీ మారకుండా నిలిచిపోయారని తెలుస్తోంది. అయితే సార్వత్రిక ఎన్నికలకు ఆరేడు నెలల ముందైనా డీఎస్ ఏదో ఒక నిర్ణయం తీసుకునే అవకాశముందని అంటున్నారు. -
డీఎస్ కుమారుడి 'ప్రకటన' కలకలం..
జనమంతా మోదీ వెంట నిలవాలంటూ జాతీయస్థాయి పత్రికకు భారీ ప్రకటన రాజకీయ వర్గాల్లో ఒక్కసారిగా కలకలం డీఎస్ పార్టీ మారతారని కొన్నాళ్లుగా ప్రచారం ఆ దిశగానే ఈ ప్రకటన అంటూ చర్చలు కుమారుడి ప్రకటనతో సంబంధం లేదన్న డీఎస్ సాక్షి, నిజామాబాద్: రాజ్యసభ సభ్యుడు, టీఆర్ఎస్ ముఖ్యనేత డి.శ్రీనివాస్ పార్టీ మారతారనే ప్రచారం సాగుతున్న నేపథ్యంలో ఆయన రెండో కుమారుడు ధర్మపురి అరవింద్ మంగళవారం ఓ జాతీయస్థాయి పత్రికకు ఇచ్చిన భారీ ప్రకటన రాజకీయ వర్గాల్లో కలకలం సృష్టిస్తోంది. ఇప్పటివరకు ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్న అరవింద్ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని.. ‘‘జాతి మొత్తం మోదీ వెంటే నిలవాలి..’’ అని పేర్కొంటూ ప్రకటన ఇచ్చారు. ఇది రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే డీఎస్ ప్రధాన అనుచరుడిగా పేరున్న సంగారెడ్డి జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్‌గౌడ్ కొన్ని నెలల కిందట బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అరవింద్ తాజా ప్రకటన నేపథ్యంలోడీఎస్ కూడా పార్టీ మారతారనే వాదనకు బలం చేకూరుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాగా తాను పార్టీ మారతానని జరుగుతున్న ప్రచారాన్ని డీఎస్ ఖండించారు. అంటీముట్టనట్లుగా.. 2014 ఎన్నికల్లో నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన డీఎస్ ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత టీఆర్ఎస్లో చేరి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డిగా నియమితులయ్యారు. తర్వాత రాజ్యసభ సభ్యునిగా కేసీఆర్ అవకాశం కల్పించారు. ఎంపీ పదవిలో ఉన్నా డీఎస్.. కొంతకాలంగా టీఆర్ఎస్లో క్రియాశీలకంగా వ్యవహరించడం లేదు. ఆయన మొదటి కుమారుడు, నిజామాబాద్ మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ కూడా టీఆర్ఎస్కు దూరంగా ఉంటున్నారు. టీఆర్ఎస్ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. ఐదు నెలల క్రితం టీఆర్ఎస్ నిర్వహించిన సభ్యత్వ నమోదులో సంజయ్ తన పార్టీ సభ్యత్వాన్ని రెన్యువల్ చేయించుకోలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. టీఆర్ఎస్తో అంటీముట్టనట్లు ఉంటున్న డీఎస్, ఆయన కుటుంబీకులతో బీజేపీ రాష్ట్ర నాయకత్వం గత కొంతకాలంగా టచ్‌లో ఉంటోంది. అరవింద్ కూడా ఇటీవల ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాను కలిసినట్లు తెలుస్తోంది. ఈ విషయమై అరవింద్‌ను సంప్రదించగా.. తాను ఇచ్చిన ప్రకటనతో తన తండ్రికి ఎలాంటి సంబంధం లేదని వ్యాఖ్యానించారు. తాను ఇప్పట్లో బీజేపీలో చేరడం లేదని, అలాంటిదేమైనా ఉంటే చెబుతామని అన్నారు. పార్టీ వీడను: డి.శ్రీనివాస్ ‘‘నా కుమారుడు అరవింద్ ఇచ్చిన ప్రకటనకు నాకూ ఎలాంటి సంబంధం లేదు.. ఆ ప్రకటన అంత ప్రాధాన్య అంశమేమీ కాదు. నేను టీఆర్ఎస్ను వీడేది లేదు. కేసీఆర్ వెంటే ఉంటాను. అరవింద్ చిన్న పిల్లవాడేమీ కాదు. ఆ ప్రకటన గురించి ఆయన్నే అడగాలి. అరవింద్ కూడా బీజేపీలో చేరుతాడని అనుకోవడం లేద’ ని డీఎస్ ‘సాక్షి’తో చెప్పారు. -
కాంగ్రెస్‌ని ముంచింది ‘డిగ్గీరాజా’నే
మనసులో మాట కొమ్మినేని శ్రీనివాసరావుతో టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ తెలంగాణ విషయంలో కాంగ్రెస్ పార్టీని నిండా ముంచిన ఘనత దిగ్విజయ్ సింగ్‌కే దక్కుతుందని తెరాస సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు డి. శ్రీనివాస్ స్పష్టం చేశారు. కేసీఆర్‌తో పొత్తును డిగ్గీ రాజా వ్యతిరేకించడమే తెలంగాణలో కాంగ్రెస్‌కు తీవ్ర నష్టం కలిగించిందన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ ప్రాంతంలో అయినా సరే ప్రజల సంతోషమే కీలక విషయమైన విషయమని, వారు సంతోషంగా ఉన్నారా లేదా అనేది వచ్చే ఎన్నికల్లోనే తేలుతుందని పాలకుల విజన్ అనేది మాటల్లో కాకుండా చేతల్లో ఉంటుందని ఆ విషయంలో కేసీఆర్ అద్వితీయుడని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రాన్ని తొమ్మిదేళ్లు పాలించిన చంద్రబాబు అప్పుడు ఉండి చేసిందేమిటి, ఇప్పుడు చేయబోయేది ఏమిటి అని ఎద్దేవా చేశారు. ఓటుకు కోట్లు కేసులో రాజీ ప్రసక్తే లేదని ఈరోజుకీ ఈ విషయంలో రెండు రాష్ట్రాల్లో గొడవ రేగుతూనే ఉందంటూ డి. శ్రీనివాస్ చెబుతున్న అభిప్రాయాలు ఆయన మాటల్లోనే... కాంగ్రెస్ పార్టీలో అన్నీ అనుభవించిన తర్వాతే పక్కకు పోయారని మీపై ఒక విమర్శ? పార్టీకి సేవ చేసే పదవులు అనుభవించాను. కానీ మాట మాత్రంగా కూడా కనీసం చెప్పకుండా నా జిల్లాలో నేను తీసుకొచ్చి ఎదిగించిన అమ్మాయికి నా సీటు ఇస్తామని చెప్పడంతో చాలా గాయపడ్డాను. దీనిపై సోనియాగాంధీకే ఉత్తరం రాశాను. సమాధానం రాలేదు. ఎప్పటికైనా ఆమె పిలిపించి మాట్లాడుతుందని ఆశించాను. అది కూడా లేదు. దశాబ్దాలు పార్టీ అభివృద్ధి కోసం పాటుపడిన నాకు కనీస సమాచారం చెప్పకుండా పక్కన బెట్టడం, తర్వాతయినా సీటు ఇస్తారన్న గ్యారంటీ లేకపోవడంతో చివరకు నిర్ణయం తీసుకుని పార్టీని వదిలిపెట్టాను. ఎక్కడ తేడా వచ్చిందంటారు? దిగ్విజయ్ సింగే ప్రధాన కారణం. 2007 నుంచి దిగ్విజయ్ సింగ్ ఈ రాష్ట్రంలో చేసిన వ్యవహారాలపై రాష్ట్ర విద్యామంత్రి స్థాయిలో సోనియాగాంధీకి ఉత్తరం రాశాను. వైఎస్ అప్పటికి బతికే ఉన్నారు. అయితే నేను రాసిన ఆ ఉత్తరం దిగ్విజయ్ చేతికి వెళ్లింది. అప్పటి నుంచి నాపై వ్యతిరేకత పెంచుకున్నారు. 2014కు ముందు మళ్లీ ఇన్చార్జ్గా వచ్చాక దిగ్విజయ్ నన్ను డామేజ్ చేయాలని చూసి, పార్టీనే నాశనం చేశాడు. కాంగ్రెస్, టీఆర్ఎస్లు కలిసిపోతాయని చెప్పారు. అదీ జరగలేదు కదా? దాన్ని చెడగొట్టింది కూడా ఈ మహానుభావుడే. దిగ్విజయ్ సింగే చెడగొట్టాడు. కాంగ్రెస్, తెరాస పొత్తు అంటేనే ఆయనకు ఇష్టం ఉండేది కాదు. కేసీఆర్‌ను కలుపుకోని పోవాల్సిందే అని నేను సోనియాతో రెండు మూడుసార్లు గట్టిగా చెప్పాను. ఎందుకు జరగలేదంటే కాంగ్రెస్ పార్టీలో కోటరీ ప్రభావం ఎక్కువ. తెలంగాణ సాధించిన క్రెడిట్ మీరు ఎవరికి ఇస్తారు? తెలంగాణ అనే కాదు ఏ ఉద్యమమైనా తీసుకోండి. ఫైటర్ విల్ గెట్ ది క్రెడిట్. నాట్ ది గివర్.. పోరాడిన వాడికే పేరు వస్తుంది కానీ ఇచ్చినవాడికి రాదు. ఆ కోణంలో సోనియా గాంధీ తప్ప మరెవరున్నా తెలం గాణను ఇచ్చి ఉండేవారు కాదు. ఆమె కన్విన్స్ అయ్యారు. తెలంగాణ ఇస్తే ఫలితాలు ఎలా ఉంటాయని ఆమె పది మందిలో చర్చించేవారు. మొత్తంమీద తెలంగాణను ఇవ్వాలని ఆమె నిర్ణయించుకుంది. తెలంగాణలో కేసీఆర్ పాలన ఎలా ఉందని మీ అభిప్రాయం? తెలంగాణలో ఇప్పుడు జరుగుతున్నదీ, మీడియాలో మీరు రాస్తున్నది తేడాగానే ఉండవచ్చు. కానీ బంగారు తెలంగాణ అనే అజెండానే ధ్యేయంగా కేసీఆర్ ముందుకెళుతున్నారు. సాగునీరు, తాగునీరు ఇవి రెండూ ఆయన చేపట్టిన మేజర్ ప్రాజెక్టులు. మరో మూడు, నాలుగేళ్లలో ఈ ప్రాజెక్టులను పూర్తి చేయగలిగితే ప్రభుత్వానికి బొలెడు డబ్బులు వస్తాయి. మరోవైపు.. డబుల్ బెడ్రూం ఇళ్లు కూడా కడుతున్నారు. కానీ ప్రజలు ఆశిస్తున్న వేగంలో జరగటం లేదు. అనుకున్న బడ్జెట్లో పూర్తి చేయాలి. ఇదే సమస్య. మరో విషయం.. ఏకకాలంలో కేసీఆర్ చాలా పెద్దభారం తలకెత్తుకున్నారు. వాటన్నింటినీ సాధిస్తారనే విశ్వాసం నాకుంది. ఎందుకంటే నిబద్ధత ఉంది. రివ్యూ చేయగలరు, ఆలోచనలు ఉన్నాయి. ఆచరణాత్మకంగా ఆయన చాలా సింపుల్ మనిషి. ఒకమాటలో చెప్పాలంటే ఎన్సైక్లోపీడియా. ఆయనకు తెలియని సబ్జెక్టు లేదు. రాజశేఖరరెడ్డి జీవించి ఉంటే తెలంగాణ సాధ్యమయ్యేది కాదనడంపై మీ అభిప్రాయం? అదేమీకాదు. 2004లో తెరాసతో పొత్తు పెట్టుకున్నప్పుడే సూత్రబద్ధంగా ప్రత్యేక తెలంగాణను అంగీకరిస్తానని వైఎస్ చెప్పారు. దాని సాధ్యాసాధ్యాల గురించి కూడా చాలా కండిషన్లు పెట్టారనుకోండి. కాని ప్రాథమికంగా తెలంగాణ ఇవ్వాల్సిందే అనే ఆలోచనకయితే వచ్చారాయన. పొత్తు కుదిరాక, ఎన్నికల మ్యానిఫెస్టోలోనే వర్కింగ్ కమిటీ తీర్మానాన్నే పెట్టాం. తెలంగాణను ఇచ్చే ప్రక్రియకు కాస్త టైమ్ పట్టవచ్చు కానీ కాంగ్రెస్ కానీ, ప్రత్యేకించి సోనియా కానీ తెలంగాణ ఇవ్వాలనే ఆలోచనతోనే ఉన్నారు. తెలంగాణ ఇచ్చి కాంగ్రెస్ తన కొంప తానే ముంచుకుంది కదా? దానికి చాలా కారణాలున్నాయి. అది కూడా హైకమాండ్ చేసిన పొరపాటే. కేసీఆర్‌ను కలుపుకుని పోటీ చేసి ఉంటే 95 సీట్లు వచ్చేవి. అలాంటప్పుడు కేసీఆర్‌ను సీఎంని చేస్తే తప్పేముంది. సోనియా గాంధీతో నేరుగా ఈ విషయాన్నే చర్చించాను. కేసీఆర్ లీడర్షిప్ అడుగుతున్నారట కదా అని సోనియా అడిగారు. మీ మనసులో ప్రత్యేకించి పలానా వారికి ఇవ్వాలని ఫిక్స్ కాలేదు కదా. కేసీఆర్ మీతో బాగానే ఉంటాడు. తాను కాంగ్రెస్ సీఎంగానే ఉంటారు. తప్పేముంది అని చెప్పాను. దానికి సోనియా స్పందించలేదు. కానీ ఆమెతో అంత లోతుగా చర్చించేవాడిని. వైఎస్సార్ చనిపోయాక చాలామంది ఎమ్మెల్యేలు జగన్‌కే సీఎం పదవి ఇమ్మని చెప్పినా తీర్మానం లేకుండానే రోశయ్యకు ఇచ్చారే? అలా కాదు. వైఎస్ అంత్యక్రియలు పూర్తి కాకముందే పాలనకోసం తాత్కాలిక ముఖ్యమంత్రిని నియమించాల్సి ఉంది. ఆ రకంగా అన్ని పదవులు చేపట్టిన, సీనియర్ వ్యక్తి, అర్హత కూడా కలిగిన రోశయ్యను ఎంచుకున్నారు. అయితే ఆయన మధ్యంతర సీఎం అని చెప్పారు. అయితే ఆయను కొనసాగించాలా లేక మార్చాలా అనే విషయంపై నిర్ణయించుకోవడానికి అధిష్టానానికి ఒకటన్నర సంవత్సరం పట్టిది. కేసీఆర్, బాబు పాలనపై మీ వ్యాఖ్య? న్యాయంగా మాట్లాడితే నిజంగా తెలంగాణను కోరుకునే వాళ్లు ఇవ్వాళ రాష్ట్రాభివృద్ధి కోసం కేసీఆర్‌తో కలిసి కూర్చుని ఏం చేస్తే బాగుంటుందో పరస్పరం చర్చించుకోవాలి. నేను ఇంకా ప్రతిపక్షంలోనే ఉండి ఉంటే తప్పకుండా ఏది చేస్తే మంచో, కాదో కేసీఆర్‌తోనే చర్చించేవాడిని. తెలంగాణ సెంటిమెంటును అంత బలంగా ప్రతిష్టించిన తర్వాత తెలంగాణ అభివృద్ధికి అడ్డుగోడ వద్దు. ఈ మూడేళ్లలో అగ్ర ప్రాధాన్యతలు ఎంచుకుని ఒక విజన్‌తో పనిచేస్తున్నారు కేసీఆర్. ఇక బాబు. తన రాష్ట్ర అభివృద్ధికోసం ప్రయత్నిస్తున్నాడు. అయితే ఏపీలో జనం సంతోషంగా ఉన్నారా లేదా అనేది ఇప్పుడు కాదు. వచ్చే ఎన్నికల్లో తేలుతుంది. ఓటుకు నోటు కేసులో బాబును బ్రహ్మదేవుడు కూడా కాపాడలేడు అని కేసీఆర్ అన్నారు. మరి బాబును ఇప్పుడు ఎవరు రక్షించారు? ఈ కేసు విషయంలో రాజీపడ్డారన్నమాట అవాస్తవం. ఈరోజుకీ ఈ విషయంలో రెండు రాష్ట్రాల్లోనూ తిట్టుకుంటూనే ఉన్నారు కదా. పైగా ఓట్లను డబ్బుతో కొనాలనుకున్న వ్యక్తి ఇప్పుడు దెబ్బతినిపోయాడు కూడా. కేసు నడుస్తోంది. ఫలితాలకోసం చూడాలి. (డి. శ్రీనివాస్‌తో ఇంటర్వూ పూర్తి పాఠం కింది లింకుల్లో చూడండి) https://goo.gl/wfvLFn https://goo.gl/RFxflM -
కేసీఆర్‌కు సిపాయిగా ఉంటా : డీఎస్
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : రాజ్యసభ సభ్యునిగా తనకు అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్‌ను జీవితంలో మరచిపోలేనని, ఆయనకు రుణపడి ఉంటానని సీనియర్ నేత ధర్మపురి శ్రీనివాస్ అన్నారు. ఈ సహకారానికి జిల్లాతో పాటు రాష్ట్ర అభివృద్ధికి తనవంతు కృషిగా సిపాయిగా ఆయన వెంట నడిచేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టులు ఫౌండేషన్లకు పరిమితమయ్యాయని, అదే రెండేళ్ల సీఎం కేసీఆర్ పరిపాలనలో రాష్ట్రం లో అనేకచోట్ల ప్రాజెక్టుల నిర్మాణాలు జరుగుతున్నాయని డీఎస్ పేర్కొన్నారు. శుక్రవారం నిజామాబాద్‌లో జరిగిన సన్మాన సభలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం మిషన్ కాకతీయ, మిషన భగీరథ పథకాలతోపా టు, ప్రాజెక్టుల నిర్మాణాలను చకచకా చేపడుతుందన్నారు. తెలంగాణ అన్నిరంగాల్లో అభివృద్ధి చెందడమే ఏకైక లక్ష్యంతో సీఎం చక్కటి విజన్‌తో ముందుకు సాగుతున్నారన్నారు. సీమాంధ్ర నాయకులతోపాటు తెలంగాణలోని కొందరు కాంగ్రెస్ నాయకులే ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుపై మెతక వైఖరి అవలంభించారని, యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీకి తామిద్దరం తెలంగాణ ఏర్పాటు చేయాలని చెప్పడంతో ఆమె అనుకూలంగా వ్యవహరించారన్నారు. కేసీఆర్ నాయకత్వంలో బంగారు తెలంగాణ నిర్మాణమే తమ కర్తవ్యమన్నారు. టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్యే హన్మంత్ షిండే, ఎమ్మెల్సీలు డాక్టర్ భూపతిరెడ్డి, వి.జి.గౌడ్, జడ్పీ చైర్మన్ దఫేదార్ రాజు, నగర మేయర్ ఆకుల సుజాత పాల్గొన్నారు. ఘనస్వాగతం: రాజ్యసభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేశాక మొదటిసారిగా జిల్లాకు విచ్చేసిన డీఎస్‌కు జిల్లాలోని ఇందల్వాయి టోల్గేట్ వద్గ పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి ‘కేసీఆర్‌కు షుక్రియా ర్యాలీ’ పేరుతో నిజామాబాద్ చేరుకున్నారు. -
కేసీఆర్‌తోనే బంగారు తెలంగాణ
♦ రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ ప్రమాణ స్వీకారం అనంతరం ♦ తొలిసారి జిల్లాకు.. డీఎస్‌కు ఘన స్వాగతం ♦ వందలాది వాహనాలతో భారీ ర్యాలీ చంద్రశేఖర్‌కాలనీ : బంగారు తెలంగాణ నిర్మాణం ముఖ్యమంత్రి కేసీఆర్‌తోనే సాధ్యమని రాజ్యసభ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ పేర్కొన్నారు. చక్కటి ఆలోచనలతో ప్రణాళికబద్ధమైన విజన్‌తో తెలంగాణ అభివృద్ధి కోసం ముందుకు సాగుతున్న సీఎం అడుగు జాడల్లో అందరం కలిసికట్టుగా నడిచి జిల్లాను అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు. రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం గురువారం తొలిసారి జిల్లాకు వచ్చిన డీఎస్‌కు టీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. ‘కేసీఆర్‌కు షుక్రీయా ర్యాలీ’ పేరుతో భారీ ర్యాలీ నిర్వహించిన అనంతరం, జిల్లా కేంద్రంలో సన్మాన సభను ఏర్పాటు చేశాయి. హైదరాబాద్ నుంచి ఉదయం 8.40 గంటలకు బయల్దేరిన డీఎస్‌కు మార్గమధ్యలో మేడ్చల్, తూప్రాన్, రామాయంపేట్, కామారెడ్డి, డిచ్‌పల్లిలలో పార్టీ శ్రేణులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. జిల్లాలోని ఇందల్వాయి గేట్ వద్దకు చేరుకున్న డీఎస్‌కు జిల్లా నాయకులు, అనుచరులు ఘన స్వాగతం పలికి సత్కరించారు. అనంతరం అక్కడి నుంచి టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, డీఎస్ యువసేన కార్యకర్తలు వందలాది బైకులు, కార్లతో మాధవనగర్‌లోని శ్రీ సాయిబాబా దేవాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. డీఎస్‌కు దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ సోమయ్య నేతృత్వంలో ఆలయ అర్చకులు పూర్ణాకుంభంతో స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు చేసిన డీఎస్ అనంతరం.. ఆలయ ఆవరణలో మొక్కలు నాటారు. అక్కడి నుంచి మొదలైన భారీ ర్యాలీ బోర్గాం(పి), ఆర్యనగర్, వినాయక్‌నగర్, పులాంగ్ చౌరస్తా, ఆర్ఆర్ చౌరస్తా, బడాబజార్, ఆజాంరోడ్డు, నెహ్రూ పార్కు చౌరస్తా, గాంధీగంజ్ చౌరస్తా మీదుగా రాజీవ్‌గాంధీ ఆడిటోరియానికి చేరుకుంది. ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన సన్మాన సభలో డీఎస్‌ను ఘనంగా సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో పార్టీపరంగా తలనొప్పి వ్యవహారాలు ఉండవద్దని, ఐక్యంగా ముందుకు సాగుదామని సూచించారు. విభేదాలు, రాగ ద్వేషాలు పక్కనబెట్టి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులందరం కలసి కట్టుగా జిల్లాను రాష్ట్రంలోనే శరవేగంగా అభివృద్ధి చెందిన జిల్లాగా తీర్చిదిద్దుతామన్నారు. ప్రజలకు కేసీఆర్ ప్రభుత్వంపై అపారమైన విశ్వాసం ఉండటంతోనే ఆయనకు ప్రభుత్వాన్ని అప్పగించారని తెలిపారు. గొప్ప చరిత్ర గల కాంగ్రెస్‌లో హేమాహేమీలు, అనేక సేవలు చేసిన వారూ ఎన్నెన్నో ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేసి వదిలివేశారన్నారు. అలాంటి వారు ప్రజా శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని ప్రాజెక్టులు నిర్మిస్తే డిజైన్ల మార్పు పేరోత రాద్దాంతం చేయడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. చకచక ప్రాజెక్టుల నిర్మాణం.. సీఎం కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వం మిషన్ కాకతీయ, మిషన భగీరథ పథకాలతో ప్రాజెక్టుల నిర్మాణాలను చకచక చేపడుతోందని డీఎస్ పేర్కొన్నారు. బంగారు తెలంగాణ నిర్మాణానికి అహర్నిషలు కృషి చేస్తున్న సీఎం కేసీఆర్‌కు అండగా ఉందామన్నారు. మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. సీనియర్ నాయకుడు, జిల్లాకు పెద్దదిక్కుగా ఉన్న డీఎస్‌ను సీఎం కేసీఆర్ రాజ్యసభ సభ్యుడిగా చేశారన్నారు. విభేదాలు, కలహాలకు తావివ్వకుండా విశ్వాసంతో, అంకితభావంతో జిల్లాను అన్నిరంగాల్లో అభివృద్ధి చేద్దామన్నారు. రెండు సార్లు పీసీసీగా పని చేసిన డీఎస్ సమర్థుడైన, ఆలోచనపరడైన నాయకుడని, హుందాతనం, సహృదయం గల వ్యక్తి అని పొగడ్తలతో ముంచెత్తారు. టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సన్మాన కార్యక్రమంలో మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్యే హన్మంత్ షిండే, ఎమ్మెల్సీలు డాక్టర్ భూపతిరెడ్డి, వీజీ గౌడ్, జెడ్పీ చెర్మైన్ దఫేదార్ రాజు, మేయర్ ఆకుల సుజాత, టీఆర్ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు ఏఎస్ పోశెట్టి, ఐడీసీఎస్ మాజీ చెర్మైన్ మునిపల్లి సాయరెడ్డి, పలువురు కార్పొరేటర్లు, నేతలు రాంకిషన్‌రావు, ఆదెప్రవీణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. అంతా తానై వ్యవహరించిన సంజయ్.. ‘కేసీఆర్‌కు షుక్రీయా ర్యాలీ’ పేరుతో నిర్వహించిన స్వాగత ఏర్పాట్లను డీఎస్ తనయుడు సంజయ్ అంతా తానై నడిపించారు. మూడ్రోజుల నుంచి ఆయన నేతలు, కార్యకర్తలను సమన్వయం చేశారు. -
'కేసీఆర్ తప్ప ఎవరు సీఎం అయినా...'
నిజమాబాద్: ప్రాజెక్టుల విషయంలో కాంగ్రెస్ అధికారంలో ఉండి సాధించలేనిది సీఎం కేసీఆర్ రెండేళ్లలో సాధించారని సీనియర్ రాజకీయ నేత, రాజ్యసభ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్(డీఎస్) అన్నారు. కేసీఆర్ తప్ప ఎవరు ముఖ్యమంత్రి అయినా తెలంగాణ పని అయిపోయేదని ఆయన వ్యాఖ్యానించారు. రాజ్యసభ్య సభ్యుడిగా ఎన్నికైన తర్వాత తొలిసారిగా శుక్రవారం సొంత జిల్లాకు వచ్చిన ఆయనకు నిజామాబాద్ లోని రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డీఎస్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ వల్లే తెలంగాణ రాష్ట్రం వచ్చిందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు అమలుచేస్తోందని చెప్పారు. 2019లోనూ తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీయే అధికారంలోకి వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. కాగా, హరితహారం కార్యక్రమంలో భాగంగా డీఎస్ పలు ప్రాంతాల్లో మొక్కలు నాటారు. -
ఇందూరుకు నేడు ఎంపీ శీనన్న
♦ రాజ్యసభ సభ్యుడిగా మొదటి సారి జిల్లాకు.. ♦ ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద స్వాగత ఏర్పాట్లు ♦ కృతజ్ఞతగా ‘కేసీఆర్ అన్నకు షుక్రియా’కు ర్యాలీ ♦ ఘనస్వాగతం పలకనున్న టీఆర్ఎస్ శ్రేణులు సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : సీనియర్ రాజకీయ నేత, రాజ్యసభ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్(డీఎస్) నేడు జిల్లాకు రానున్నారు. ఇటీవలే రాజ్యసభ్య సభ్యుడిగా ఎన్నికైన ఆయన తొలిసారిగా జిల్లాకు శుక్రవారం వస్తున్నారు. హైదరాబాద్ నుంచి ఉదయం కారులో బయలుదేరనున్న డీఎస్ మధ్యాహ్నం వరకు జిల్లాకు చేరుకుంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ సందర్భంగా ఆయనకు ఇందల్వాయి టోల్‌ప్లాజా వద్ద ఘన స్వాగతం పలికేందుకు టీఆర్ఎస్ శ్రేణులు సిద్ధమయ్యాయి. ఇందూరు నుంచి అంచెలంచెలుగా పెద్దల సభకు ఎదిగిన ధర్మపురి శ్రీనివాస్ ఎంపీగా మొదటిసారి జిల్లాకు వస్తున్న సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, ఆయన అభిమానులు, అనుచరులు భారీ ఏర్పా ట్లు చేశారు. డీఎస్ తనయుడు, మాజీ నగర మేయర్ ధర్మపురి సంజయ్(జూనియర్ డీఎస్) ఆధ్వర్యంలో భారీగా స్వాగత ఏర్పాట్లు చేశారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం నుంచి భారీగా నాయకులు, కార్యకర్తలను తరలించేందుకు మాజీ డీసీఎంఎస్ చైర్మన్, టీఆర్ఎస్ జిల్లా నాయకులు మునిపల్లి సాయరెడ్డి జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలతో కలిసి గ్రామాలు తిరిగారు. మధ్యాహ్నం 12.30 గంటలకు .. హైదరాబాద్ నుంచి 12.30 గంటలకు జిల్లాకు చేరనున్న రాజ్యసభ సభ్యులు డీఎస్‌కు పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, అనుచరులు, అభిమానులు ఇందల్వాయి టోల్‌ప్లాజా వద్ద ఘన స్వాగతం పలుకుతారు. ఈ మేరకు డీఎస్ తనయుడు ధర్మపురి సంజయ్ పర్యవేక్షణలో పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికి భారీ ర్యాలీ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. డీఎస్ రాజ్యసభ సభ్యునిగా ప్రమాణస్వీకారం చేశాక మొదటిసారిగా జిల్లాకు వస్తున్న సందర్భంగా ఈ ర్యాలీలో వేలాదిగా శీనన్న అభిమానులు, పార్టీనాయకులు, కార్యకర్తలు, నగర, రూరల్ నియోజకర్గ పార్టీ నాయకులుతోపాటు జిల్లావ్యాప్తంగా ఉన్న ఆయన అనుచరులు, శ్రేయోభిలాషులు పాల్గొనేందుకు ఉత్సాహం చూపుతున్నారు. అక్కడి నుంచి కార్లతో కాన్వాయ్‌గా మాధవనగర్‌లోని శ్రీ సాయిబాబా దేవాలయం వరకు చేరుకుంటారు. మాధవనగర్ సాయిబాబా ఆలయంలో డీఎస్‌కు ఆయన అనుచరు లు ఘన స్వాగతం పలికి ‘బాబా’ వద్ద ప్రత్యేక పూజలు చేసి అనంతరం శాలువ కప్పి సన్మానిస్తారు. ఆ తర్వాత డీఎస్‌కు ఎంపీగా కల్పిం చినందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేసేందుకు పార్టీ వర్గాలు ‘కేసీఆర్ అన్నకు షుక్రియా ర్యాలీ’ని చేపట్టనున్నారు. రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో సమావేశం మాధవనగర్ నుంచి పెద్ద ఎత్తున పార్టీశ్రేణులు, నాయకులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో డీఎస్ ర్యా లీని ప్రారంభించి అక్కడి నుంచి బోర్గాం(పి), ఆర్యనగర్, వినాయక్‌నగర్, పులాంగ్ చౌరస్తా, వర్ని రోడ్డు, రాజరాజేంద్ర చౌరస్తా, బడాబజా ర్, ఆజాంరోడ్డు, నెహ్రూపార్క్ చౌరస్తా, గాంధీచౌక్, బస్టాండ్, స్టేషన్‌రోడ్డు మీదుగా రాజీవ్‌గాంధీ ఆడిటోరియం వరకు కొనసాగించేం దుకు రూట్‌మ్యాప్‌ను తయారు చేశారు. అనంతరం రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో డీఎస్‌కు అభినందనసభ ఏర్పాటు చేశారు. రాజ్యసభ స భ్యునిగా ఎన్నికైన తర్వాత తొలిసారిగా జిల్లా కేంద్రానికి వస్తున్న డీఎస్‌కు టీఆర్ఎస్ నాయకు లు, ఆయన అనుచరవర్గీయులు నగరంలోని ప్రధాన కూడళ్ల వద్ద ఘన స్వాగతం పలుకుతూ భారీ ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇదే సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని రాష్ట్రవ్యాప్తంగా హరి తహారం కార్యక్రమం ప్రారంభిస్తుండగా.. అం దులో భాగంగా శుక్రవారం రాజ్యసభ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ జిల్లాలోని ఆయా ప్రాంతా ల్లో హరితహారంలో పాల్గొని మొక్కలు నాటనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. మధ్యాహ్నం 12.30 గంటలకు ఇందల్వాయి టోల్గేట్ వద్ద, మధ్యాహ్నం 1.30 గంటలకు మాధవనగర్ సా యిబాబా మందిరం వద్ద, మధ్యాహ్నం 3 గంట లకు రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో మొక్కలు నాటుతారు. -
నేడు డీఎస్ ప్రమాణ స్వీకారం
♦ రాజ్యసభ సభ్యుడిగా ఏకగ్రీవ ఎన్నిక ♦ ఎంపీ కవిత ప్రత్యేక చొరవతో.. ♦ ఢిల్లీకి తరలివెళ్లిన అనుచరులు, అభిమానులు ♦ వచ్చే నెల 7న జిల్లాకు రాక సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : రాజ్యసభ సభ్యుడిగా ధర్మపురి శ్రీనివాస్ మం గళవారం ఢిల్లీలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. టీఆర్ఎస్ అధికార పార్టీ అభ్యర్థిగా సీఎం కేసీఆర్ డి.శ్రీనివాస్‌ను రాజ్యసభకు ఎంపిక చేసిన విషయం విధితమే. గత నెల 24 రాజ్యసభకు నోటిఫికేషన్ వెలువడగా.. 26న డీఎస్‌ను టీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ సభ్యుడిగా ప్రకటించింది. ఈ వ్యవహరంలో నిజామాబాద్ ఎంపీ కవిత కీలకంగా వ్యవహరించారు. అనంతరం డీఎస్ రాజ్యసభ సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాజ్యసభ సభ్యుడిగా పదవీ బాధ్యతలు చేపడుతున్న సందర్భంగా ఆయన ప్రమాణ స్వీకారానికి ఆయన అనుచరులు, పలువురు కార్పొరేటర్లు భారీ సంఖ్యలో ఢిల్లీకి తరలివెళ్లారు. రైళ్లల్లో ఒక రోజు ముందుగానే వెళ్లారు. సీనియర్ నేతగా అనుభవం రాజ్యసభ సభ్యుడిగా నేడు ప్రమాణ స్వీకారం చేయనున్న ధర్మపురి శ్రీనివాస్‌కు 32 ఏళ్ల రాజకీయ అనుభవం ఉంది. సుధీర్ఘ అనుభవజ్ఞుడిగా అనేక పదవులు చేపట్టిన నాయకుడిగా డీఎస్ పేర్కొందారు. ప్రస్తుతం ఢిల్లీలో రాజ్యసభ సభ్యుడిగా మొదటిసారిగా కాలుమోపనున్నారు. ఢిల్లీ పెద్దల సభలో ఓ సీనియర్ నేతగా డీఎస్‌కు అవకాశం కల్పిస్తే.. బీసీ వర్గాలకు కూడా ప్రాతినిధ్యం కల్పించినట్లు అవుతుందన్న ఎంపీ కవిత సూచన మేరకు సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్లో చేరిన డీఎస్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా ఢిల్లీ రాజకీయాల్లో చాలా కీలకంగా వ్యవహరించారు. ఇదే సమయంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం కృషి చేసిన డీఎస్, అప్పటి నుంచే కేసీఆర్‌తో సంబంధాలు మెరుగుపర్చుకున్నారు. ఈ అంశాలు కూడా డీఎస్‌కు కలిసొచ్చినట్లు చెప్తున్నారు. అంతేగాకుండా టీఆర్ఎస్ డీఎస్ చేరిన సందర్భంగా ఇచ్చిన మాట ప్రకారం మొదట ప్రభుత్వ సలహాదారుగా కేబినేట్ హోదా కల్పించిన కేసీఆర్ అనంతకం ఎంపీగా అవకాశం కల్పించారు. దీంతో సీనియర్ రాజకీయ వేత్త, బీసీ వర్గాల నేతగా డీఎస్‌కు తగిన ప్రాధాన్యం కల్పించారన్న చర్చ సాగుతోంది. వచ్చే నెల 7న డీఎస్ రాక రాజ్యసభ సభ్యుడిగా ఎంపికైన డీఎస్ ప్రమాణ స్వీకారం అనంతరం వచ్చే నెల 7న మొదటిసారిగా జిల్లాకు రానున్నారు. ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు అనుచరులు సన్నాహాలు ప్రారంభించా రు. ఇందుకు సంబంధించి అనుచరులు, కార్యకర్తలు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా సరిహద్దు ప్రారంభం నుంచి నగరంలోని డీఎస్ ఇంటి వరకు భారీగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. -
ప్రత్యేక సలహాదారు పదవికి డీఎస్ రాజీనామా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు (అంతర్రాష్ట్ర సంబంధాలు) పదవికి ధర్మపురి శ్రీనివాస్ (డీఎస్) శనివారం రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు అందజేయగా ప్రభుత్వం దాన్ని వెంటనే ఆమోదిస్తూ ఉత్తర్వులు (జీఓ ఆర్టీ నం.1206) జారీ చేసింది. రాష్ర్ట్రంలో రెండు రాజ్యసభ స్థానాలకు జరగనున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులుగా కెప్టెన్ వి. లక్ష్మీకాంతరావుతోపాటు తన పేరును పార్టీ నాయకత్వం ప్రకటించిన నేపథ్యంలో ప్రభుత్వ నామినేటెడ్ పదవిని వదులుకోవాలని డీఎస్ నిర్ణయించుకున్నారు. ఈ నెల 31న ఆయన రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్నారు. గతేడాది ఆగస్టు 21న ప్రభుత్వం అంతర్రాష్ట్ర సంబంధాల వ్యవహారాల కోసం డీఎస్‌ను ప్రత్యేక సలహాదారుగా ఏడాది పదవీకాలానికి నియమించింది. -
టీఆర్ఎస్ తోనే అభివృద్ధి సాధ్యం: డీఎస్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్తోనే హైదరాబాద్ అభివృద్ధి సాధ్యమని ప్రభుత్వ ప్రత్యేక సలహా దారు ధర్మపురి శ్రీనివాస్(డీఎస్) పేర్కొన్నారు. తెలంగాణ భవన్లో శుక్రవారం డీఎస్ విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ అభివృద్ధే ధ్యేయంగా ప్రత్యేక ప్రణాళికలతో సీఎం కేసీఆర్ ముందుకు వెళుతున్నారని వివరించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్కు పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ప్రతిపక్ష పార్టీల హామీలు శ్రుతిమించుతున్నాయని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ అభివృద్ధికి జీహెచ్ఎంసీ ఎన్నికలు అవకాశం కల్పిస్తున్నాయని.. ఈ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ను గెలిపిస్తే ప్రభుత్వ పథకాలు సరిగా అమలవుతాయని వివరించారు. గ్రేటర్లో టీఆర్ఎస్ అభ్యర్థుల ప్రచారానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోందన్నారు. కేటీఆర్ నిర్వహిస్తున్న రోడ్‌షోలకు వస్తున్న జనమే దీనికి నిదర్శనమన్నారు. -
డీఎస్‌కు కేసీఆర్ జన్మదిన శుభాకాంక్షలు
- కుటుంబ సమేతంగా డీఎస్ ఇంటికి వెళ్లిన సీఎం సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వ అంతర్రాష్ట్ర వ్యవహారాల సలహాదారు ధర్మపురి శ్రీనివాస్ (డీఎస్)కు సీఎం కేసీఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆదివారం 67వ పుట్టిన రోజు జరుపుకొన్న డీఎస్ ఇంటికి సీఎం కేసీఆర్ తన కుటుంబ సభ్యులతో కలసి వె ళ్లారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ స్వయంగా డీఎస్‌తో పుట్టిన రోజు కేక్ కట్ చేయించారు. సీఎం వెంట రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ కూడా ఉన్నారు. సీఎం కుటుంబ సభ్యులంతా డీఎస్ ఇచ్చిన విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇద్దరునేతలు కొద్ది సేపు వివిధ అంశాలపై చర్చించినట్లు డీఎస్ సన్నిహిత వర్గాలు తెలిపాయి. -
ప్రభుత్వ ప్రత్యేక సలహాదారుడిగా డీఎస్
నిజామాబాద్‌కల్చరల్ : తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక సలహాదారుడిగా ధర్మపురి శ్రీనివాస్ శుక్రవారం హైదరాబాద్ సచివాలయంలోని డీ బ్లాక్‌లో పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు జిల్లాకు చెందిన రాష్ట్ర వ్యవసాయ శా ఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్‌తోపాటు ఎమ్మెల్యేలు ఏనుగు రవీందర్‌రెడ్డి, వేమూరి ప్రశాంత్‌రెడ్డి, ఆశన్నగారి జీవన్‌రెడ్డి, ఎమ్మెల్సీ సుధాకర్‌రెడ్డి, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి, ఏఎస్ పోశెట్టిలు శ్రీని వాస్‌ను కలిసి బొకేలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే నిజామాబాద్ జెడ్పీటీసీ సభ్యురాలు పుప్పాల శోభ, ఎంపీపీ యాదగిరి, రూరల్ నియోజకవర్గ ఇన్చార్జీ డాక్టర్ భూపతిరెడ్డి, దాదాన్నగారి విఠల్‌రావు, బీరెల్లి లక్ష్మణ్‌రావు, డి. రాజేంద్రప్రసా ద్, దారం సాయిలు, మాయావార్ సాయిరాం, పాండు, డి. నారాయణరావు, ఆకుల చిన్నరాజేశ్వర్‌తోపాటు కార్పొరేటర్లు, డీఎస్‌ను కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. -
గులాబీ తీర్థంతో ‘పునర్నిర్మాణం’
డేట్లైన్ హైదరాబాద్ తనకు అంత చేసిన తల్లిలాంటి పార్టీని వదిలి వస్తున్న శ్రీనివాస్ వంటి నేతలు తెలంగాణ పునర్నిర్మాణంలో భాగం అవుతారా? పార్టీకి శిరోభారం అవుతారా? అనే దానిపై కేసీఆర్‌కు తన లెక్కలు తనకున్నాయి. వేలం వెర్రిగా చేరుతున్నవాళ్లకే అసలేమైనా లెక్కలంటూ ఉన్నాయా? అనేదే అసలు ప్రశ్న. మరి కొందరు సీనియర్ నేతలూ తెలంగాణ భవన్ బాట పట్టనున్నారని వార్త. కాంగ్రెస్ పార్టీకి కొత్త రక్తాన్ని ఎక్కించే అరుదైన అవకాశం లభిస్తోంది. ఈ మహదవకాశాన్ని అందుకోడానికి కాంగ్రెస్ సిద్ధంగా ఉందా? ధర్మపురి శ్రీనివాస్ ఒకప్పటి రిజర్వు బ్యాంకు ఉద్యోగి. సీనియర్ కాంగ్రెస్ నేత గడ్డం రాజారామ్ ప్రియ శిష్యుడు. క్రియాశీల రాజకీయాల్లోకి పూర్తిగా ప్రవేశించక ముందు నుంచే ఆయన నాకు తెలుసు. 1970 దశకం చివర్లో డాక్టర్ మర్రి చెన్నారెడ్డికి వ్యతిరేకంగా ఒక బలమైన అసమ్మతి వర్గం పని చేస్తుండేది. ఆ వర్గానికి నాయకుడైన మంత్రి రాజారామ్ ఇంట్లోనే అసమ్మతి వర్గ సమావేశాలు జరిగేవి. పొలిటికల్ రిపోర్టర్లంతా సాయంకాలం కాగానే అక్కడికి చేరే వారు. పత్రికలకు బోలెడంత మేత. వెనుకబడిన తరగతుల బల మైన నాయకుడైన రాజారాం ఇంటికి నేనూ అప్పట్లో కొన్నిసార్ల్లు అసమ్మతి రాజకీయాల రిపోర్టింగ్ పనిపై వెళ్తుండేవాడిని. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర సమితి నేతగా ఉన్న శ్రీనివాస్‌తో నాకు అక్కడే పరిచయం. అదీ పలకరింపు లకే పరిమితం. చెన్నారెడ్డి అదృష్టమనండి, అసమ్మతివర్గీయుల దురదృష్టం అనండి భారీగా వర్షం కురుస్తున్న ఓ రాత్రో లేదా తెల్లారుజామునో గానీ రాజారాం కారు ప్రమాదంలో మరణించారు. ఆ తరువాత కొద్ది కాలానికే ఎన్టీ రామారావు తెలంగాణలో పెద్ద ఎత్తున వెనుకబడిన తరగతుల మద్ద తును కూడగట్టుకోగలగడానికి ఒక ముఖ్యకారణం రాజారాం ఆకస్మిక మృతే నని అనుకోవాలి. అయనే ఉంటే వెనుకబడిన తరగతుల వారు పెద్దగా తెలుగుదేశం వెంట వెళ్లేవారు కాదని అప్పట్లో రాజకీయ పరిశీలకుల విశ్లేషణ. ఫిరాయింపులతోనే ‘పునర్నిర్మాణం’ రాజారాం మరణానంతరం శ్రీనివాస్ కాంగ్రెస్ రాజకీయాల్లో అంచెలంచె లుగా ఎదిగారు. పంచెలు మార్చినంత సులభంగా పార్టీలు మార్చేయడం చాలా మంది రాజకీయ నేతలకు వెన్నతో పెట్టిన విద్య. పదవుల కోసం కొం దరు, ‘పనుల’ కోసం ఇంకొందరు, నాలుగురాళ్లు వెనకేసుకుందామని మరి కొందరు, ‘న్యాయం’ జరగడం లేదని ఇంకా కొందరు ‘కండువాలు’ మారు స్తుంటారు. పార్టీ విధానాలో, సిద్ధాంతాలో నచ్చక పార్టీలు మారే వాళ్ళు నేడు మచ్చుకు కూడా కనిపించరు. అయితే శ్రీనివాస్ దాదాపు 30 ఏళ్లు కాం గ్రెస్లోనే కొనసాగి, మొన్ననే తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్లో చేరారు. తమకు ఇష్టమైన రాజకీయాలను ఎంచుకునే స్వేచ్ఛ ప్రతి ఒక్కరికీ ఉంటుంది. తాను ఏ రాజకీయ పార్టీలో ఉండాలో నిర్ణయించుకునే హక్కు శ్రీనివాస్‌కు లేదా? ఉంది. కానీ ఆయన కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తూ కూడా ఆ పార్టీని పల్లెత్తు మాట అనలేదు, ఆ పార్టీ నాయకురాలు సోనియా గాంధీని ఆకాశానికి ఎత్తారు. మరి ఎందుకు పార్టీ మారారు? అంటే కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో తానూ భాగస్వామిని కావడం కోసమేనని ప్రకటించారు. ఆత్మప్రబోధం మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలిపారు. శ్రీనివాస్ కాంగ్రెస్‌ను వీడడానికి, టీఆర్ఎస్ ఆయనను చేర్చుకోడానికి నిజంగా ఇదే కారణమా? ఇక్కడే మనం శ్రీనివాస్‌నూ, టీఆర్ఎస్నూ కొన్ని ప్రశ్నలు అడగాలి. ఒకటి, తెలంగాణ పునర్నిర్మాణం అంటే ఏమిటి? రెండు, కాంగ్రెస్‌లో కొనసాగుతూనో లేదా కాంగ్రెస్ రాజ కీయాల పట్ల విసుగు చెంది ఉంటే అన్ని పార్టీలకు దూరంగా ఉంటూనో శ్రీనివాస్ ఈ పునర్నిర్మాణ కార్యక్రమంలో పాల్గొనలేకపోయే వారా? మూడు, తమ పార్టీలో చేరే వారిని తప్ప ఇంకెవరినీ టీఆర్ఎస్ పార్టీ, ప్రభుత్వమూ రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగం పంచుకోనివ్వవా? అనేక దశాబ్దాల పోరాటాల ఫలితంగా తెలంగాణ రాష్ర్టం ఏర్పడితే, చివరిదశ పోరాటంలో నిర్వహించిన పాత్ర కారణంగా టీఆర్ఎస్ను ప్రజలు గెలిపిస్తే, ఆ పార్టీ, ప్రభుత్వమూ రాష్ట్ర పునర్నిర్మాణంలో మరెవరు భాగస్వాములు కారాదనేటంత హ్రస్వ దృష్టితో ఆలోచిస్తున్నాయా? అయినా తెలంగాణ పునర్నిర్మాణం ఒక్క రోజులోనో, ఒక్క ఐదేళ్ల కాలంలోనో, ఒక్క రాజకీయ పార్టీతోనో, ఒక్క ప్రభుత్వంతోనో అయ్యేంత చిన్న పని అని అధికార పార్టీ, దానిలోకి వలసపోతున్న నాయ కులు భావిస్తున్నారా? మొత్తం తెలంగాణ సమాజం నడుంబిగిస్తేనే అది సాధ్యం. అందుకూ చాలా సమయం పడుతుంది. ‘వడ్డించిన విస్తరి’పైనే కినుకా? శ్రీనివాస్ పార్టీ మారుతూ పదవుల కోసం తాను కాంగ్రెస్‌ను వీడటం లేద న్నారు. ఒక్క ముఖ్యమంత్రి పదవి తప్ప కాంగ్రెస్‌లో తాను అన్ని పదవులనూ చేపట్టాననీ చెప్పారు. కాంగ్రెస్‌ను వీడి వెళ్తూ కూడా వాస్తవాలను అంగీకరించి నందుకు ఆయన్ను అభినందించాలి. కాంగ్రెస్ పార్టీ ఒక సముద్రం. అందులో అందరికీ అన్ని వేళలా, అన్ని అవకాశాలూ రావు. ఏ పదవీ రాకపోయినా కాంగ్రెస్‌నే పట్ట్టుకుని ఉండే విధేయులు కోకొల్లలు. శ్రీనివాస్ ఆ కోవకు చెందిన వారు కారు. కాంగ్రెస్‌లో ఆయన జీవితం వడ్డించిన విస్తరి. శాసన సభ్యుడిగా ఉన్నారు, మంత్రిగా పని చేశారు. రెండుసార్లు రాష్ర్ట కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నారు. మూడుసార్ల్లు శాసన సభ ఎన్నికల్లో వరుసగా ఓడినా... సోనియా ఆయనకు శాసన మండలిలో స్థానం కల్పించడమే కాదు, కాంగ్రెస్ పక్ష నేతను చేశారు. అరుదైన అలాంటి ఆదరణ ఆయనకు దక్కింది. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఆయనకు అధినేత్రి అపాయింట్మెంట్ దొరికే దనేది జగమెరిగిన సత్యం. అటువంటి పార్టీని, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీని కష్ట కాలంలో... అదీ అవతల ఆంధ్రప్రదేశ్‌లో తీవ్రంగా నష్టపోతామని తెలిసి కూడా వదిలేసి వెళ్లిన శ్రీనివాస్ వంటి సీనియర్ నేత తరువాతి తరం రాజకీయ నాయకులకు ఏ సందేశం ఇవ్వదలచుకున్నారు? కాంగ్రెస్‌కు మహదవకాశం తనకు అంత చేసిన తల్లిలాంటి పార్టీని వదిలేసి వస్తున్న శ్రీనివాస్ వంటి నేతలు తెలంగాణ పునర్నిర్మాణంలో భాగం అవుతారా? లేక తమ పార్టీకి శిరో భారం అవుతారా? అనేది టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారికి తట్టలేదనుకుంటే అది ఆయన రాజకీయ పరిజ్ఞానాన్ని తక్కువగా అంచనా వేసినట్టే అవుతుంది. ఆయన లెక్కలు ఆయనకున్నాయి. వేలం వెర్రిగా వెళ్లి చేరుతున్నవాళ్లకే అసలేమైనా లెక్కలంటూ ఉన్నాయా? అనేదే అసలు ప్రశ్న. శ్రీనివాస్ కాంగ్రెస్ వీడే నాటికి ఆయన ఏ పదవిలోనూ లేరు. ఆయన విషయంలో గుడ్డిలో మెల్లగా చెప్పుకోవాల్సింది అదే. ఒక పార్టీ టికెట్ మీద గెలిచి, ఇంకో పార్టీలో చేరి, మంత్రి పదవి చేపట్టి కూడా నిస్సిగ్గుగా నా రాజీనామా లేఖ జేబులో ఉంది, మా ఇంట్లో అటక మీద దాచి ఉంచాను అని చెప్పుకు తిరుగుతున్న నాయకుల కంటే ఆయన చాలా నయం. ఇంకా కొం దరు సీనియర్ కాంగ్రెస్ నేతలు కూడా తెలంగాణ భవన్ బాట పట్టను న్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఒక విధంగా తెలంగాణ కాంగ్రెస్‌కు ఇదొక మంచి అవకాశం. పార్టీకి కొత్త రక్తాన్ని ఎక్కించే అరుదైన అవకాశం లభి స్తోంది. కాంగ్రెస్ ఈ మహదవకాశాన్ని అందుకోడానికి సిద్ధంగా ఉందా? దేవులపల్లి అమర్ datelinehyderabad@gmail.com -
అధికారం వచ్చాకా హామీలేనా!
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: తెలంగాణ తొలి ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా హామీలిచ్చి అధికారం చేపట్టిన కేసీఆర్, వాటిని అమలు చేయకుండా మళ్లీ హామీలతోనే కాలయాపన చేస్తున్నారని శాసనమండలిలో విపక్షనేత ధర్మపురి శ్రీనివాస్ విమర్శించారు. అధికారం చేపట్టిన తక్షణమే ఏడు గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్, పేదోడికి రెండు పడక గదులతో కూడిన ఇల్లు, రూ. లక్ష వరకు రుణమాఫీ తదితర హామీలిచ్చిన ఆయన ఏ ఒక్కటి కూడా అమలు చేయలేకపోయారని ఎద్దేవా చేశారు. అధికారంలోకి వచ్చి వంద రోజులు దాటినా, ఎన్నికల మేనిఫెస్టో జోలికి వెళ్లకుండా తెలంగాణను సింగాపూర్ చేస్తానంటే ఎలా నమ్మాలని ప్రశ్నించారు. మంగళవారం నిజామాబాద్‌లోని మున్నూరుకాపు సంఘం కల్యాణమండపంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డి. శ్రీనివాస్ మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని ప్రజలు బలంగా నమ్మినా టీఆర్ఎస్కు అధికారం కట్టబెట్టారని, ఆ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా మేనిఫెస్టోను అమలు చేయాల్సిన కేసీఆర్ కొత్త కొత్త హామీలను తెర పైకి తెచ్చి కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. క్లారిటీ లేదు ‘‘ప్రభుత్వంలో పూర్తిగా స్తబ్దత ఏర్పడింది. ఉచిత కరెంట్, రుణమాఫీ, ఎస్సీలకు భూపంపిణీ, ఫీజు రీయింబర్స్మెంట్ తదితర పథకాలపై ఇప్పటికీ క్లారిటీ లేదు. ఇంత జరుగుతున్నా, మేము ప్రభుత్వాన్ని ఇప్పుడే నిందించదలచుకోలేదు. 100 రోజులకే ఫెయిల్యూర్ అయ్యిందని అనకూడదనుకుంటున్నాం. అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, తెలంగాణ పునర్నిర్మాణం విషయంలో కాంగ్రెస్ పార్టీ నిర్మాణాత్మక సహకారాన్ని అందిస్తుంది. అభివృద్ధి పథకాల అమలు కోసం దసరా, దీపావళి వరకు వేచి చూస్తాం. అప్పటికీ కూడా వాటికి మోక్షం కలగకపోతే సర్కారును ప్రశ్నిస్తాం’’ అని డీఎస్ పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్దిపై దృష్టి సారించాల్సిన కేసీఆర్ ఉచిత కరెంట్‌పై అడిగితే ఇరిటేట్ అవుతున్నారని, మూడేళ్ల వరకు కరెంట్ జోలే లేదంటూ దాటవేస్తున్నారని ఆరోపించారు. వ్యవసాయానికి పెద్దపీట వేస్తూ దివంగత నేత డాక్టర్ వైఎస్ఆర్ జలయజ్ఞం కింద నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణానికి శ్రీకారం చుట్టారని, జిల్లాలో రెండు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను కూడా ప్రారంభించుకున్నామని డీఎస్ గుర్తు చేశారు. కొత్త ప్రభుత్వం మాత్రం రైతులకు ప్రయోజనం కలిగించే జలయజ్ఞం జోలికి వెళ్లకుండా కుంటలు, చెరువుల మరమ్మతులంటూ కొత్త పథకాలను వల్లిస్తోందన్నారు. ఎస్సీలకు భూపంపిణీ అంటూ హంగామా చేసి, జిల్లాకు 10 మందికి మాత్రమే పట్టాలిచ్చి చేతులు దులుపుకుందన్నారు. ఎస్సీలు, ముస్లింలకు ఐదు శాతం రిజర్వేషన్లు అమలు చేయడమే సాధ్యం కాలేదంటే, కొత్తగా 12 శాతం ఇస్తామనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సమగ్ర సర్వే సమర్థనీయమే అయినా, ప్రజలకు ఉపయోగపడే ముఖ్యమైన అంశాలను ప్రభుత్వం విస్మరించిందన్నారు. ప్రభుత్వం, ప్రజలకు మధ్య వారధి గా నిలిచే మీడియాను నియంత్రించాలని చూడటం మంచిది కాదన్నారు. విలేకరుల సమావేశంలో టీపీసీసీ కార్యదర్శులు నరాల రత్నాకర్, ధర్మపురి సురేందర్, నిజామాబాద్ జడ్పీటీసీ పుప్పాల శోభ, వక్ఫ్‌బోర్డు చైర్మన్ జావిద్ అక్రం, కాంగ్రెస్ నగర అధ్యక్షుడు కేశ వేణు, యూత్‌కాంగ్రెస్ నాయకుడు ఘన్‌రాజ్, కార్పోరేటర్లు కాపర్తి సుజాత, పి.లావణ్యరెడ్డి, విజయలక్ష్మి, పుప్పాల లావణ్య, చంద్రకళ, చంగుబాయి, సుగుణ, రేవతి, దారం సాయిలు, మాయవార్ సాయిరాం, ఖుద్దూస్, రఘువీర్ తదితరులు పాల్గొన్నారు. -
‘అధికార’ దుర్వినియోగం
- మున్సిపల్, పరిషత్ ఎన్నికల్లోటీఆర్‌ఎస్ దౌర్జన్యం - కాంగ్రెస్ ఎంపీటీసీలను ఇబ్బందిపెట్టారు - రాజకీయాలు మాని అభివృద్ధికి పాటుపడాలి - ‘బంగారు తెలంగాణ’కు కాంగ్రెస్ సహకారం - శాసనమండలి ప్రతిపక్ష నేత డి.శ్రీనివాస్ సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : మున్సిపల్, ఎంపీపీల ఎన్నికల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సమితి అధికార దుర్వినియోగానికి పాల్పడిందని, పలుచోట్ల ఘర్షణలను ప్రోత్సహించే విధంగా ఆ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకత్వం వ్యవహరించిందని పీసీసీ మాజీ చీఫ్, శాసనమండలి పక్షనేత ధర్మపురి శ్రీనివాస్(డీఎస్) ఆరోపించారు. ఎన్నికల సందర్భం గా ఇచ్చిన హామీలను అమలు చేయడంతో పాటు అమరుల కలలు సాకారం అయ్యే విధంగా తెలంగాణ అభివృద్ధికి పాటుపడాల్సిన నాయకత్వం దౌర్జన్యకర వాతావరణం నెల కొ ల్పడం బాధాకరమన్నా రు. ఎంపీపీ ఎన్నికల సందర్భంగా జిల్లాలోని పలుచోట్ల కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీలను అధికార పార్టీ అడుగడుగున్నా ఇబ్బందులకు గురి చేసింద ని, ఎన్నికల్లో వచ్చిన ఎంపీటీసీ స్థానాల ప్రకారం తమకు ఎంపీపీ పదవులు రాకుండా ప్రలోభపెట్టిందని ఆయ న ఆరోపించారు. శనివారం నిజామాబాద్‌లోని తన ఇంట్లో విలేకరుల సమావేశంలో డీఎస్ కాంగ్రెస్ జడ్పీటీసీ సభ్యులతో కలిసి మాట్లాడారు. తెలంగాణ కాంగ్రెస్ చలవే తెలంగాణ రాష్ర్టం కేవలం కాంగ్రెస్ పార్టీ వల్లే వచ్చిందన్నారు. తెలంగాణలో యువకుల బలిదానాలకు చలించిన సోనియాగాంధీ నిర్ణయం మేరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. అమరుల త్యాగాల కారణంగా ఏర్పడిన రాష్ట్రంలో పార్టీలకతీతంగా అందరిని కలుపుకొని అభివృద్ధికి బాటలు వేయాల్సిన టీఆర్ఎస్ అప్రజాస్వామి కంగా వ్యవహరిస్తోందన్నారు. రాష్ట్రంలో భయానక వాతావరణం నెలకొల్పిన టీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచే అవకాశమున్న ప్రతిచోట ఆటంకాలు కల్పించిందన్నారు. నిజామాబాద్, డిచ్పల్లి ఎంపీపీల ఎన్నికల విషయంలో టీఆర్ఎస్ లేనిపోని రాద్దాంతం చేసి ఎన్నికలు వాయిదా వేయించాలని కుట్రలు చేసినా... చి వరకు కాంగ్రెస్‌కే విజయం చేకూరిందన్నారు. తన నియోజకవర్గంలో ఐదు మండలాలకు గాను నాలుగు మండలాల్లో కాంగ్రెస్ ఎంపీపీలను గెలిపించిన ప్రజలు, నాయ కులు, కార్యకర్తలు, సభ్యులకు డీఎస్ కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచిన ఎంపీటీసీలను అడ్డుకుని అరాచకాలు సృష్టించినా.. అడుగడుగునా అధికార దుర్వినియోగానికి పాల్పడినా చివరకు జిల్లాలో 11 ఎంపీపీ స్థానాల్లో ప్రజలు కాంగ్రెస్‌కు విజయం చేకూర్చారన్నారు. సర్కారుకు సహకరిస్తాం బంగారు తెలంగాణ నిర్మాణం కోసం కాంగ్రెస్ పార్టీ రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వానికి సహకరిస్తుం దని డీఎస్ స్పష్టం చేశారు. ప్రభుత్వం కూడ అన్ని రాజకీయ పార్టీలను కలుపుకుని సమష్టిగా కృషి చేస్తేనే అమరుల ఆశయాలు, కలలు సాకారమవుతాయన్నారు. రాజకీయంగా తమను, తమ కార్యకర్తల ను ఎంత ఇబ్బంది పెట్టాల ని చూసినా.. ఈ రాష్ట్రాభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ కలిసి నడుస్తుందని, నిర్మాణాత్మక సహకారం అందిస్తామని పేర్కొన్నారు. శాసనసభ, శాసనమండలిలలో జానారెడ్డి, తాను గవర్నర్‌కు కృతజ్ఞతలు తెలిపే ప్రసంగం సందర్భంగా కూడ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వైఖరిని కూడ స్పష్టంగా చెప్పామని డీఎస్ తెలిపారు. జిల్లా పరిషత్‌లోను తమ పార్టీకి చెందిన జడ్పీటీసీ సభ్యులు ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ జిల్లా సమగ్రాభివృద్ధి కోసం పాలకవర్గానికి చేదోడువాదోడుగా ఉంటారన్నారు. జిల్లా పరిషత్ నిధుల తో అభివృద్ధి జరిగేలా పాలకపక్షం చూడాలని, నిధుల కేటాయింపులో పక్షపాతం లేకుండా వ్యవహరించాలని సూచించారు. పార్టీలకతీతంగా జడ్పీ నిధులు మండలాలకు కేటాయించాల ని, ఆ నిధుల్లో ఇతరుల పెత్తనం లేకుండా చూడాలన్నారు. కాంగ్రెస్ పార్టీ జడ్పీటీసీలు జిల్లా అభివృద్ధిలో నిర్మాణాత్మక పాత్ర పోషించాలన్నారు. సమావేశంలో డిచ్పల్లి, నిజామాబాద్, బోధన్, సిరికొండ, జక్రాన్‌పల్లి, మాచారెడ్డి, నవీపేట జడ్పీటీసీ సభ్యులు కూరపాటి అరుణ, పుప్పాల శోభ, అల్లె లావణ్య, అయిత సుజా, పొట్కూరి తనూజరెడ్డి, గ్యార లక్ష్మి, ఎ.శ్రీనివాస్‌తో పాటు పలువురు పాల్గొన్నారు. -
మాట తప్పుతారా
ఉద్యమ పార్టీగా ఎన్నో ఆందోళనలు చేసి, ప్రజల ఆకాంక్షకు అద్దంలా నిలిచిన టీఆర్ఎస్.. అధికార పార్టీగా మారిన తర్వాత ఆ ప్రజల నుంచే నిరసనలను ఎదుర్కొంటోంది. పంట రుణాల మాఫీపై నిబంధనలను విధించడాన్ని నిరసిస్తూ అన్నదాతలు ఆందోళన బాట పట్టారు. ఇచ్చిన హామీ అమలులో వెనుకంజ వేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. జిల్లా అంతటా నిరసనలు కొనసాగాయి. మంథనిలో టీఆర్ఎస్ నేతలే పార్టీ జెండా గద్దెను కూల్చేయడం గమనార్హం. రుణాల మాఫీకి ఎలాంటి నిబంధనలు పెట్టవద్దని, పంట రుణాలన్నింటినీ మాఫీ చేయాలని కర్షకులు విజ్ఞప్తి చేశారు. సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ / న్యూస్‌లైన్, నిజాంసాగర్: 2013 ఖరీఫ్, రబీ సీజన్లలో తీసుకున్న పంటరుణాలకే రుణ మాఫీ పథకాన్ని వర్తింప చేస్తామని ప్రభుత్వం ప్రకటించడాన్ని వ్యతిరేకిస్తూ గురువారం ఇందూరు రైతులు ఆందోళన బాట పట్టారు. జిల్లా అంతటా నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. నిబంధనలను సాకుగా చూపి రైతులకు అన్యాయం చేయవద్దని, ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి కేసీఆర్ నిలబెట్టుకోవాలని ప్రతిపక్ష పార్టీల నేతలు ధర్మపురి శ్రీనివాస్, పల్లె గంగారెడ్డి, వీజీ గౌడ్లు వేర్వేరు ప్రకటనల్లో డిమాండ్ చేశారు. పంటరుణాల మాఫీపై రైతులు ఆందోళన చెందవద్దని, రుణమాఫీపై ఇంకా ఏ నిర్ణయానికి రాలేదని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి రైతులకు విజ్ఞప్తి చేశారు. కట్టలు తెంచుకున్న కర్షకుల ఆగ్రహం రుణమాఫీలో నిబంధనలు వద్దంటూ రైతులు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ఆర్మూర్ మండలంలోని మంథనిలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఆ పార్టీ జెండా గద్దెను కూల్చి వేసి కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మంథని గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో రైతులు సమావేశమై ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాల రైతుల ఆధ్వర్యంలో శుక్రవారం ఆర్మూర్‌లో రాస్తారోకో చేయాలని తీర్మానించారు. అన్ని గ్రామాభివృద్ధి కమిటీలకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. జుక్కల్, నిజాంసాగర్ మండలాల్లో రైతులు రోడ్డెక్కి నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ధర్పల్లి, వేల్పూరు మండలం మోతె, జాన్కంపేట్‌లలో సీఎం దిష్టిబొమ్మను తగలబెట్టారు. కామారెడ్డి నియోజకవర్గంలో పలు చోట్ల రాస్తారోకోలు చేశారు. గాంధారి మండలం మాతుసంగెం గ్రామంలో గ్రామస్తులు టీఆర్ఎస్ గద్దెను కూల్చేశారు. సిరికొండ, కమ్మర్‌పల్లిలలో అఖిలపక్షం ఆధ్వర్యంలో రైతులు రాస్తారోకో చేశారు. ఎల్లారెడ్డి, తాడ్వాయి మండలాల్లో ధర్నాకు దిగారు. రెంజల్ మండలంలోని దూపల్లిలో కేసీఆర్ దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించి, దహనం చేశారు. నీల, తాడ్‌బిలోలి, రెంజల్ గ్రామాల రైతులు తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. అందరికీ రుణమాఫీ పథకాన్ని వర్తింప చేయాలని కోరుతూ అధికారులకు వినతిపత్రం సమర్పించారు. మోర్తాడ్‌లో పంట రుణాల మాఫీ విషయంలో కేసీఆర్ తీరుకు నిరసనగా రైతులు ఆందోళన చేశారు. ఎలాంటి షరతులు, నిబంధనలు లేకుండా వెంటనే పంట రుణాలు మాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ భిక్కనూరు, దోమకొండ, లింగంపల్లిలలో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. -
మండలిలో కాంగ్రెస్ ఫ్లోర్‌లీడర్ గా డీఎస్
-
మండలిలో కాంగ్రెస్ ఫ్లోర్‌లీడర్ గా డీఎస్
హైదరాబాద్: తెలంగాణ కౌన్సిల్లో కాంగ్రెస్ పక్షనేతగా పీసీసీ మాజీ అధ్యక్షు డు ధర్మపురి శ్రీనివాస్, ఉపనేతగా మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అసెంబ్లీ కమిటీ హాల్లో జరిగిన తెలంగాణ ఎమ్మెల్సీల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్, వయలార్ రవి పర్యవేక్షణలో ఈ సమావేశం జరిగింది. అయితే ఓటింగ్ నిర్వహించకపోవడంపై రాజలింగం, పొంగులేటి సుధాకర్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈనెల ఎనిమిదో తేదీ నుంచి శాసనసభ, తొమ్మిదో తేదీనుంచి శాసనమండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. -
కాంగ్రెస్ దిగ్గజాల పరాజయం
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో జరిగిన తొలి ఎన్నికలు జిల్లాలో కాంగ్రెస్‌ను ఖంగు తినిపించాయి. ఆ పార్టీ ప్రముఖులు ధర్మపురి శ్రీనివాస్(డీఎస్), మాజీ మంత్రులు మహ్మద్ షబ్బీర్ అలీ, పి.సుదర్శన్‌రెడ్డి, మాజీ స్పీకర్ సురేశ్‌రెడ్డి ఓటమి పాలయ్యారు. తెలుగుదేశం పార్టీ కుప్ప కూలింది. 2009 ఎన్నికలలో ఐదు స్థానాలు గెలుచుకున్న టీడీపీకి ఈసారి బోణీ కూడా కాలేదు. 2009, 2010 ఉప ఎన్నికలలో నిజామాబాద్ అర్బన్‌ను కైవసం చేసుకున్న బీజేపీ ఆ ఒక్క సీటును కూడా చేజార్చుకుంది. సార్వత్రిక ఎన్నిక ల ఫలితాలలో ‘కారు’ జోరు అప్రతిహతంగా కొనసాగింది. నిరాశలో కాంగ్రెస్ శ్రేణులు పీసీసీ మాజీ చీఫ్ డి.శ్రీనివాస్ 1999, 2004లో వరుసగా నిజామాబాద్ నుంచి గెలుపొందారు. ఆ తర్వాత 2009, 2010 ఉప ఎన్నికల్లో ఆయన ఓటమి చెందిన ఆయన ఈసారి విజయమే లక్ష్యంగా నిజామాబాద్ రూరల్ నుంచి పోటీ చేశారు. టీఆర్ఎస్ పార్టీ నుంచి బాజిరెడ్డి గోవర్ధన్ బరిలోకి దిగడంతో అక్కడ కూడ గట్టి పోటీ ఏర్పడి ంది. బాజిరెడ్డిపై 26,200 ఓట్ల తేడాతో ఓడిపోయారు. వరుసగా మూడోసారి ఓటమి చెందిన ఆయనకు 51,370 ఓట్లు రాగా, బాజిరెడ్డికి 77,570 ఓట్లు వచ్చాయి. 2009 లో కామారెడ్డిలో, 2010 ఉప ఎన్నికలలో ఎల్లారెడ్డిలో అపజయం పొందిన మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఈసారి మళ్లీ కామారెడ్డిలో ఓటమి పాలయ్యారు. సమీప ప్రత్యర్థి, టీఆర్ఎస్ అభ్యర్థిపై 6,583 ఓట్ల తేడాతో ఓటమి చెందారు. 1999 నుంచి వరుస విజయాలతో బోధన్ నియోజకవర్గంలో హ్యాట్రిక్ సాధించిన మాజీ మంత్రి పొద్దుటూరి సుదర్శన్‌రెడ్డికి ఈసారి ఓటమి తప్పలేదు. 2009 ఎన్నికలలో గెలిచిన ఏకైక కాంగ్రెస్ ఎమ్మెల్యేగా మంత్రి పదవి వరించగా, ఈ సారి టీఆర్ఎస్ అభ్యర్థి మహ్మద్ షకీల్ చేతిలో 15,656 ఓట్లు వెనుకబడిపోయారు. మాజీ స్పీకర్ కేఆర్ సురేష్‌రెడ్డి1989 నుంచి 2004 వరకు బాల్కొండ నుంచి నాలుగుసార్లు వరుసగా గెలుపొంది రికార్డు నెల కొల్పారు. నియోజకవర్గాల పునర్విభజనతో ఆర్మూరు బాట పట్టి, 2009లో టీడీపీ అభ్యర్థి ఏలేటి అన్నపూర్ణమ్మ చేతిలో 14 వేల పైచిలుకు ఓట్లతో ఓడిపోయారు. ఈ సా రి కూడ అర్మూరు బరిలో దిగిన సురేష్‌రెడ్డి మొదటిసారి రాజకీయాలలోకి దిగిన టీఆర్ఎస్ అభ్యర్థి ఆశన్నగారి జీవన్‌రెడ్డి చేతిలో 13,461 ఓట్ల తేడాతో ఘోర పరాజయ ం పొందడం చర్చనీయాంశంగా మారింది. సైకిల్ పంక్చర్, వాడిన కమలం సార్వత్రిక ఎన్నికలు ఇటు టీడీపీని అటు బీజేపీని కోలుకోకుండా చేశాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయం పొందింది. ఈ ఎన్నిక లకు నిజామాబాద్ రూరల్, ఆర్మూరు ఎమ్మెల్యేలు మండవ వెంకటేశ్వర్రావు, ఏలేటి అన్నపూర్ణమ్మ దూరంగా ఉండగా, కూటమిలో భాగంగా ఐదు స్థానాల్లో టీడీపీ, నా లుగు స్థానాలలో పోటీ చేసిన బీజేపీ ఒక్క స్థానాన్నీ దక్కించుకోలేకపోయాయి. 2009 ఎన్నికలలో నిజామాబాద్ రూరల్, ఆర్మూరు, కామారెడ్డి, జుక్కల్, బాన్సువా డ ను దక్కించుకున్న టీడీపీ, అంతకు ముందు జరిగిన ఎన్నికలలోనూ మూడు నుంచి ఆరు స్థానాలకు తక్కువ గెలిచిన పరిస్థితి లేదు. 2009లో ఐదుగురు ఎమ్మెల్యేలు ఆ పార్టీ నుంచి గెలిచినా, బాన్సువాడ, జుక్కల్, కామారెడ్డి ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, హన్మంత్ సింధే, గంప గోవర్ధన్ టీఆర్ఎస్లో చేరారు. ఈ సార్వత్రిక ఎన్ని కలలో పోటీ చేసిన ఆ ముగ్గురు కూడ టీఆర్ఎస్ అభ్యర్థులుగా గెలుపొందగా, టీడీపీకి జిల్లాలో ఒక్క స్థానం దక్కకపోవడం చర్చనీయాంశం అవుతోంది. కాగా 2009, 2010 ఉప ఎన్నికలలో నిజామాబాద్ అర్బన్ నుంచి బీజేపీ అభ్యర్థిగా యెండల లక్ష్మీనారాయణ గెలుపొందారు. ఈ సార్వత్రిక ఎన్నికలలో ఆయన నిజామాబాద్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడంతో ధన్పాల్ సూర్యనారాయణ గుప్తను అసెంబ్లీ అభ్యర్థిగా ప్రకటించారు. అయితే అటు లోక్‌సభ, ఇటు అసెంబ్లీ స్థానంలోను ఆ పార్టీ ఓటమి చెందింది. -
ఇందూరు మెడలో గులాబీ మాల
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : ఇందూరు ప్రజలు తెలంగాణ రాష్ట్ర సమితికి పట్టం కట్టారు. రెండు లోక్‌సభ, తొమ్మిది అసెంబ్లీ స్థానాలలో ఆ పార్టీ అభ్యర్థులకు విజయాన్ని అందించారు. జిల్లా చరిత్రలో 1952 నుంచి ఇప్పటి వరకు ఒకే పార్టీకి చెందిన ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు విజయం సాధించడం ఇదే ప్రథ మం. తెలంగాణ తొలి శాసనసభలో ఈ అరుదైన రికార్డు చిరస్థాయిగా నిలవనుంది. ఇం దూరు ప్రజల ఏకపక్ష తీర్పుతో ఈ రికార్డును సొంతం చేసుకున్న టీఆర్ఎస్ శ్రేణుల్లో సంబ రాలు అంబరాన్ని అంటాయి. కాంగ్రెస్ పార్టీ దిగ్గజాలు, మాజీ మంత్రులు ధర్మపురి శ్రీని వాస్, మహ్మద్ షబ్బీర్ అలీ, మాజీ స్పీక ర్ కేఆర్ సురేశ్ రెడ్డిలకు ఈసారి కూడా పరాజయం తప్పలేదు. మాజీ మంత్రి పొద్దుటూరి సుదర్శన్‌రెడ్డి బోధన్‌లో ఓటమిని చవిచూశారు. మాజీ విప్ ఈరవత్రి అనిల్‌కుమార్ ఘోర పరాజయం పొందారు. కవితకు, బీబీ పాటిల్ కు మద్దతు పలికిన ఓటర్లు రాజకీయ ఉద్ధండుల కేరాఫ్ నిజామాబాద్ లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత విజయం సొంతం చేసుకుంది. ఇందూరు కోడలిని జిల్లా ప్రజలు ఆదరించారు. తెలంగాణ రాష్ర్టంలో జరిగిన తొలి ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలు సర్వశక్తులొడ్డినా.. ఇందూరు ఓటర్లు మాత్రం టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూతురు, జిల్లా కోడలు కవితకే మద్దతు పలికారు. రెండుసార్లు గెలుపొందిన మధుయాష్కీ గౌడ్, బీజేపీ మాజీ శాసనసభ పక్షనేత యెండల లక్ష్మీనారాయణలు ఆమె చేతిలో ఘోర పరాజయం పొందారు. తెలంగాణ జిల్లాల్లో అత్యంత ఆసక్తికరంగా జరిగిన ఈ పోటీలో 1,67,184 మెజార్టీ సాధించారు. టీఆర్ఎస్కు పోస్టల్ బ్యాలెట్లు కలుపుకొని 4,39,307 ఓట్లు రాగా, కాంగ్రెస్‌కు 2,72,723 ఓట్లు వచ్చాయి. జహీరాబాద్ లోక్‌సభ స్థానం నుంచి రాజకీయ తెరపైకి వచ్చిన టీఆర్ఎస్ అభ్యర్థి భీంరావు బస్వంత్ రావు పాటిల్‌ను జిల్లా ప్రజలు ఆదరించారు. సిట్టింగ్ ఎంపీ సురేశ్‌కుమార్ షెట్కార్‌పై ఆయన ఘన విజయం సాధించారు. మెదక్ జిల్లా జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోకి వచ్చే జిల్లాలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుక్కల్ సెగ్మెంట్లలో ఆయనకు భారీ ఆధిక్యం లభించింది. 13వ రౌండ్ ముగిసే సరికి బీబీరావు పాటిల్ 1,21,487 ఓట్ల ఆధిక్యంతో తిరుగులేని మెజార్టీ సాధించారు. ఇందూరు కోటలో గులాబీ గుబాళింపు ఇందూరు ఇలాకాలో గులాబీ ప్రభంజనం వీచింది. ఓటెత్తిన జనం టీఆర్ఎస్కు బ్రహ్మరథం పట్టారు. మొత్తం రెండు పార్లమెంట్, తొమ్మిది అసెంబ్లీ స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులకు అధికార పీఠంపై కూర్చో బెట్టారు. ఎల్లారెడ్డి అసెంబ్లీ స్థానం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగు రవీందర్‌రెడ్డి వరుసగా మూడోసారి గెలిచి హ్యాట్రిక్ సాధించారు. 2009లో టీడీపీ నుంచి గొలుపొంది టీఆర్ఎస్లో చేరిన పోచారం శ్రీనివాస్‌రెడ్డి, గంప గోవర్ధన్, హన్మంత్ సింధేలు బాన్సువాడ, కామారెడ్డి, జుక్కల్‌ల నుంచి గెలుపొందారు. నిజామాబాద్ రూరల్ నుంచి పీసీసీ మాజీ చీఫ్ డి శ్రీనివాస్‌పై ముందుగానే గెలుపు ధీమాను వ్యక్తం చేసిన టీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ విజయం సాధించారు. నిజామాబాద్ అర్బన్, ఆర్మూరు, బాల్కొండ, బోధన్ల నుంచి బిగాల గణేశ్ గుప్త, ఆశన్నగారి జీవన్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, మహ్మద్ షకీల్‌లు తొలిసారి ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దిగ్గజాలు డి శ్రీనివాస్‌తో పాటు షబ్బీర్‌అలీ, పి సుదర్శన్‌రెడ్డి, కేఆర్ సురేశ్‌రెడ్డిలు కోలుకోలేని షాక్ కు గురయ్యారు. మాజీ విప్ ఈరవత్రి అనిల్‌కు బాల్కొండ ఓటర్లు మొండి చెయ్యిచ్చారు. -
టీఆర్ఎస్ సత్తా చాటింది
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలలో టీఆర్ఎస్ సత్తా చాటింది. ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుక్కల్ నియోజకవర్గాల్లో మొత్తం స్థానాలను కైవసం చేసుకుంది. పీసీసీ మాజీ చీఫ్ ధర్మపురి శ్రీనివాస్ (డీఎస్), మాజీ మంత్రి పొద్దుటూరి సుదర్శన్‌రెడ్డి (పీఎస్ఆర్) ప్రాతినిధ్యం వహిస్తున్న నిజామాబాద్ రూరల్, బోధన్ నియోజకవర్గాలలో జడ్పీ టీసీ స్థానాలు కాంగ్రెస్ ఖాతాలో పదిలమయ్యాయి. ఎంపీటీసీ స్థానాలలోనూ వారికి ఆధిక్యం లభించింది. మాజీ మంత్రి షబ్బీర్ అలీ కామారెడ్డి నియోజకవర్గం పరిధి లోని మొత్తం నాలుగింటిలో రెండు జడ్పీటీసీ స్థానాలు, మెజార్టీగా 33 ఎంపీటీసీ స్థానాలను కాంగ్రెస్ ఖాతాలో వేసుకున్నారు. టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధ న్కు మున్సిపాలిటీ ఎన్నికలతో పాటు ‘స్థానిక’ంలో ఎదురుదెబ్బ తగిలింది. కాగా బాల్కొండ నియోజకవర్గంలోని ఐదు జడ్పీటీసీ స్థానాలకు గాను నాలిగింట టీఆర్ఎస్ గెలవగా ఒక్కటే కాంగ్రెస్‌కు దక్కింది. ఆర్మూరు నియోజకవర్గంలో మూ డు జడ్పీటీసీ స్థానాల్లో రెండు టీఆర్ఎస్ కు దక్కాయి. ఆర్మూరు, బాల్కొండ నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న మా జీ విప్ ఈరవత్రి అనిల్, మాజీ స్పీకర్ కేఆర్ సురేశ్‌రెడ్డిలకు జడ్పీటీసీల్లో ఆధిక్యం ద క్కలేదు. జడ్పీటీసీ ఎన్నికల్లో ఖాతా తెరవకుం డా పూర్తిగా పతనమై పోయిన తెలుగుదేశం పా ర్టీ ఎంపీటీసీ సభ్యుల విషయంలోను బీజేపీ కం టె వెనుకబడి పోయింది. మున్సిపల్, ‘పరిషత్’ ఎన్నికల్లో ఆ పార్టీ ఉనికిని కోల్పోయింది. క్షణక్షణం టెన్షన్ రెండు విడతలలో జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఫలితాల లెక్కింపు మంగళవారం ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగింది. 36 జడ్పీటీసీ, 570 ఎంపీటీసీ స్థానాలకు ఏప్రిల్ 6, 11 తేదీలలో రెండు విడతలలో ఎన్నికలు జరిగాయి. 36 జడ్పీటీసీలకు 195 మంది, 570 ఎంపీటీసీ స్థానాలకు 2,819 మంది అభ్యర్థులు బరిలో నిలవగా, గ్రామీణ ప్రాంతాలలోని మొత్తం 14,15,153 మంది ఓటర్లకు గాను 10,87,821 మంది తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. ధర్పల్లి మండలం మై లార ం, పిట్లం మండలం బండపల్లి ఎంపీటీసీలకు 18న రీ-పోలింగ్ జరగనుంది. కాగా నిజామాబాద్, బోధన్, కామారెడ్డి రెవెన్యూ డివిజన్ల పరిధిలో ఉదయం మొదలైన ఓట్ల లెక్కింపు రాత్రి వరకు కొనసాగింది. 24 జడ్పీటీసీ స్థానాలను టీఆర్ఎస్, 12 జడ్పీటీసీ స్థానాలను కాంగ్రెస్ పార్టీలు గెలుచుకున్నాయి. గత ఎన్నికలలో కాంగ్రెస్‌కు 20, టీఆర్ఎస్కు 4, టీడీపీకి 12 జడ్పీటీసీ స్థానాలు దక్కగా, ఈ సారి టీడీపీకి ఒక్క స్థానం కూడ దక్కలేదు. మొదటి నుంచి టీడీపీకి కంచుకోటలా ఉన్న ఇందూరు జిల్లాలో బీటలు బారాయి. కాగా 581 ఎంపీటీసీ స్థానాలకుగాను టీఆర్ఎస్ 240, కాంగ్రెస్ 225 దక్కించుకున్నాయి. బీజేపీ 34, టీడీపీ 31, ఎంఐఎంకు రెండురాగా, 49 స్థానాల్లో స్వతంత్రులు, ఇతరులు గెలుపొందారు. ఎంపీటీసీ ఎన్నికల్లోను టీడీపీకి బీజేపీ కంటే మూడు స్థానాలు తక్కువ వచ్చాయి. -
యువతకు పెద్దపీట వేస్తాం
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : యువత చేతిలోనే దేశభవిష్యత్ ఆధారపడి ఉందని, వారికి అన్ని రంగాల్లో ప్రాధాన్యత కల్పించేందుకు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెద్దపీట వేసిందని పీసీసీ మాజీ చీఫ్ ధర్మపురి శ్రీనివాస్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం లో యువత అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించే వి ధంగా ప్రోత్సాహం ఉంటుందన్నారు. యూ పీఏ చైర్పర్సన్, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ చిత్తశుద్ధితోనే తెలంగాణ రాష్ర్టం ఏర్పడిందన్నారు. సోనియా కాకుండా ఎవరు న్నా ‘తెలంగాణ’ ’ వచ్చేది కాదన్నారు. సో మవారం డీఎస్ నగరంలోని నిఖిల్‌సాయి హోటల్లో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆమె తనతో మా ట్లాడారని, తెలంగాణ ప్రజలు దేవతగా కొలుస్తున్నారని చెప్పానని అన్నారు. తనను దేవతను చెయ్యొద్దని, తల్లిగా చూస్తే చాలన్న సోనియాగాంధీ తెలంగాణలో తొలి ప్ర భుత్వం కాంగ్రెస్ ఏర్పడితే అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకోవచ్చని సూచిం చారని తెలిపారు. ఇచ్చిన మాటకు కట్టుబడిన కాంగ్రెస్‌కు తెలంగాణ ప్రజలు పట్టంకడతారని డీఎస్ ఆశాభావం వ్యక్తం చేశారు. జిల్లా ప్రజల కు సంపూర్ణ ఆరోగ్యం కోసం కోరగా తన షష్టిపూర్తి వేడుకలకు హాజరైన అప్పటి ముఖ్యమంత్రి, దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి మెడికల్ కళాశాలను గిఫ్ట్‌గా మంజూరు చేశారని అన్నారు. ఉద్యోగ, పారిశ్రామిక రంగాల్లో యువతను అగ్రగామిగా నిలిపేం దుకు యువనేత రాహుల్‌గాంధీ బృహత్తర ప్రణాళిక రూపొందించారని స్పష్టం చేశా రు. జిల్లాలో గల్ఫ్ బాధితులు లేకుండా, యువత వలస వెళ్లకుండా ఉండేం దుకు ఉపాధి, ఉద్యోగావకాశాలు మరింత మెరుగుపరిచేందుకు కృషి చేస్తానన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథకాలతో అద్దంలా తీర్చిదిద్దుతామని అన్నా రు. యువతను పారిశ్రామికంగా ప్రోత్సహించేందుకు బ్యాంకు లింకేజీ ద్వారా రుణాలిచ్చి, సబ్సిడీ, మార్జిన్‌మనీ సమకూర్చి పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. ప్రతి మండలానికో యూ త్ భవన నిర్మాణం, జిల్లాలో 400 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన కేంద్రం ఏర్పాటు చేస్తామన్నారు. ప్రభుత్వ పథకాల పర్యవేక్షణకు జిల్లా లో ఓ అడ్వయిజరీ కమిటీని ఏర్పాటు చేస్తానని పేర్కొన్నారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు జిల్లా కేంద్రంలో రెండెకరాల్లో అన్ని హంగులతో స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను నిర్మిస్తామని డీఎస్ హామీ ఇచ్చారు. తెలంగాణ అమరవీరుల కుటుంబాలను ఆదుకోవడానికి కుటుంబంలో కనీసం ఒకరికి ఉద్యోగావకాశం కల్పిస్తామని, రూ.100 కోట్లతో కార్ఫస్ ఫండ్ ఏర్పాటు చేసి రెండెకరాల్లో ప్రొఫెసర్ జయశంకర్ పేరిట ఫౌండేషన్ నెలకొల్పుతామన్నారు. సమావేశం లో జిల్లా యువజన సంఘాల నేతలు మాణిక్యా ల శ్రీనివాస్, హరీశ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కేసీఆర్ వల్లే పొత్తు కుదర్లేదు: డీఎస్
‘సాక్షి’తో డి.శ్రీనివాస్: కాంగ్రెస్‌కు బహిరంగంగా మద్దతు ఇవ్వాలని జేఏసీని కోరడంలో ఎలాంటి వ్యూహం లేదని పీసీసీ మాజీ అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ధర్మపురి శ్రీనివాస్ స్పష్టం చేశారు. సోనియా కాకుండా ఎవరున్నా తెలంగాణ ఏర్పాటు జరిగిఉండేది కాదని జేఏసీ నాయకులే అంగీకరించారని పేర్కొన్నారు. సకలజనులసమ్మె, బలిదానాలే తెలంగాణ ఏర్పాటులో కీలకపాత్ర వహించాయని పేర్కొన్నారు. కేసీఆర్ తాను ముఖ్యమంత్రి కావడం కోసమే మాట మారుస్తున్నారని ధ్వజమెత్తారు. ‘సాక్షి’ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో డీఎస్ అభిప్రాయాలివి... పి.లింగం, ఎలక్షన్‌సెల్: కేసిఆర్ అధికారం కోసం ఆశ పడడం వల్లనే పొత్తు విఫలమైంది. పది జిల్లాలతో కూడిన తెలంగాణ ఇస్తే ఎలాంటి షరతులు లేకుండా టీఆర్ఎస్ను కాంగ్రెస్‌లో విలీనం చేస్తానని కేసీఆర్ అనేక సార్లు ప్రకటించారు. తనకు సీఎం పదవి ఇవ్వాలనీ, టీఆర్ఎస్కు ఎక్కువ సీట్లు కేటాయించాలనిషరతు పెట్టారు. ఏవైనా చిన్నచిన్న సమస్యలుంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత సవరించుకునే వీలుంటుంది. అధికారాన్ని ఆశించే ఆయన ఆంక్షల విధించారన్న వాదన చేస్తున్నారు. తెలంగాణ ద్రోహులకు, బద్ధవిరోధులకు టికెట్లు ఇచ్చారు. అధికారం కోసం దళిత సీఎం నినాదాన్ని కూడా వదిలేశారు. టీఆర్ఎస్తో పొత్తు కోసం కాంగ్రెస్ పార్టీ పాకులాడిందన్న వాదన నిజం కాదు. పొత్తు ద్వారా అనవసరమైన పోటీని నివారించవచ్చునని మాత్రమే ఆశించాం. సరైంది కాదు.. తెలంగాణ ఉద్యమకారులను అవకాశం కల్పిస్తామని ప్రకటించి వెనక్కి తగ్గడం సరైందికాదు. ముందు ప్రకటించిన నలుగురికి టికెట్లు ఇస్తేనే మంచిది. ఏఐసీసీ ప్రకటించిన తరువాత టికెట్లు ఇవ్వకపోతే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయి. ప్రజలు మమ్మల్నే నమ్ముతున్నారు... తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడక ముందునుంచే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కృషి చేసింది. అయితే మేము శాస్త్రీయంగా పనిచేశాం. సరైన వేదికలమీద ప్రయత్నాలు చేశాం. రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెస్ వల్లనే సాధ్యమయ్యిందన్న నమ్మకం ప్రజల్లో బలంగా కనిపిస్తుంది. మూడు అంశాలే కీలకం... జేఏసీ నిర్వహించినసకలజనులసమ్మె, యువకుల బలిదానాలే తెలంగాణ కలను సాకారం చేశాయి తప్ప టీఆర్ఎస్ చేసిందేమీ లేదు. సకలజనుల సమ్మెలో టీఆర్ఎస్ పాత్ర ఏమాత్రంలేదు. సమ్మె విజయవంతం కావడంతో చివరి నిమిషంలో టీఆర్ఎస్ అందులో పాల్గొంది. ప్రభుత్వ యంత్రాంగం స్థంభించిపోయేంత తీవ్రంగా జరిగిన సమ్మెతో ఈ ప్రాంత ప్రజలు, ఉద్యోగులు ఎంతగా నష్టపోయారన్నది కేంద్రం గుర్తించింది. యువత బలిదానాలకు సోనియా చలించిపోయారు. సొంత పార్టీని ధిక్కరించి ఎంపీలు లోకసభను స్థంభింపచేయడాన్ని పార్టీ సీరియస్‌గా తీసుకుంది. ఈ మూడు అంశాలే తెలంగాణ రావడానికి కారణం. సభలు, విలేకరుల సమావేశాలు పెట్టడం తప్ప టీఆర్ఎస్ తెలంగాణ సాధన దిశలో చేసిందేమీ లేదు. కేసీఆర్‌కు తెలంగాణ సాధించుకోవడం కోసం కాకుండా... అధికారాన్ని దక్కించుకుకోవడానికే ఎదురుచూశారు. వాపును చూసి బలమని... 2009 తరువాత జరిగిన ఉప ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను చూసి అది తమ బలమనుకుంటే పొరపాటు. అప్పడు కాంగ్రెస్ తెలంగాణ విషయంలో మాట నిలబెట్టుకోలేదన్న నిరసన ఉండేది. అది టీఆర్ఎస్కు అనుకూలంగా మారింది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. టీఆర్ఎస్ ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితం. మరో భాగంలో ఆ పార్టీకి బలమే లేదు. సత్తా చాటుతాం.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పెద్ద మెజారిటీతో విజయం సాధిస్తుంది. ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది. లోకసభ స్థానాలను కూడా అధికసంఖ్యలో గెలుచుకుంటుంది. పార్టీ తెలంగాణలో పటిష్టంగా ఉంది. ఒంటరిగానే సత్తా చాటుతాం. ఆ పొత్తు ప్రభావం ఉండదు... టీడీపీ, బీజేపీల మధ్య పొత్తుకు అంత ప్రాధాన్యం లేదు. పొత్తు ప్రభావం ఇక్కడ ఉండదు. గతంలోనూ వారు కలిసి పోటీ చేశారు. అప్పుడెందుకు విడిపోయారో... ఇప్పుడెందుకు కలిశారో.. తెలంగాణలో పోటీ కాంగ్రెస్, టీఆర్ఎస్ల మధ్యే ఉంటుంది. -
అమ్మను తలచి
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కేశ వేణు అధ్యక్షతన జరిగిన సభకు పీసీసీ మాజీ చీఫ్ ధర్మపురి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనతోపాటు కేంద్ర మంత్రి పోరిక బలరాం నాయక్, నిజామాబాద్, కరీంనగర్, సికింద్రాబాద్ ఎంపీలు మధు యాష్కీ, పొన్నం ప్రభాకర్, అంజన్‌కుమార్ యాదవ్, విప్, బాల్కొండ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్, మాజీ స్పీకర్ సురేశ్‌రెడ్డి, పటాన్చెరు, గజ్వేల్ ఎమ్మెల్యేలు నందీశ్వర్‌గౌడ్, నర్సారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఆకుల లలిత, అరుణతార, డీసీసీ అధ్యక్షుడు తాహెర్‌బిన్ హందాన్, మా జీ అధ్యక్షుడు గడుగు గంగాధర్‌తోపాటు పలువురు పాల్గొన్నారు. డీఎస్ సభకు దూరంగా ఉన్న మాజీ మంత్రి పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి, జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్ కామారెడ్డిలో మాజీ మంత్రి, ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ నిర్వహించిన కృతజ్ఞత సభకు హాజరు కావడం కాంగ్రెస్ పార్టీ శ్రేణులలో చర్చనీయాంశంగా మారింది. సభలో నిజామాబాద్ అర్బన్, రూరల్ నియోజకవర్గాల నుంచి భారీగా పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఉద్వేగంగా ఈ సభలో దాదాపు అందరు నేతల ప్రసంగాలు ఉద్వేగంతో కొనసాగాయి. ‘‘సోనియా తెలంగాణ ప్రజల దేవత.. తెలంగాణ ఇంటి ఇలవేల్పు సోనియా.. సోనియాకు తెలంగాణ సలాం.. అమరుల కుటుంబాలకు పాదాభివందనం.. వెయ్యిమంది అమరుల త్యాగఫలం ఈ కొత్త రాష్ట్రం.. అమరుల కుటుంబాలకు అండగా ఉంటాం.. బిడ్డలను కోల్పోయిన తల్లులకు.. బిడ్డలుగా ఉంటాం’’ అని పేర్కొన్నారు. తెలంగాణ అమరుల ప్రాణత్యాగం సోనియాగాంధీని కదిలించందన్నారు. నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల పోరాటం, ఆరాటం ఫలించి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందన్నారు. కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్ విలీనమైనా.. కాకపోయినా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ స్వీప్ చేయడం ఖాయమన్న ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఎవరి దయాదాక్షిణ్యాలతో రాలేదని, ఇచ్చింది కాంగ్రెస్సేనని పేర్కొన్నారు. పునర్నిర్మాణంలోనూ కాంగ్రెస్ కీలక భూమిక పోషిస్తుందన్నారు. తెలంగాణ రాష్ర్టం ఆవిర్భావం, ఉద్యమాలు, ఫలితాలు, సోనియాగాంధీతో జరిగిన సంప్రదింపులు, టీ-ఎంపీల చూపిన తెగువను డి.శ్రీ నివాస్ వివరించారు. చంద్రబాబు, కిరణ్‌కుమార్ రెడ్డిలపై భగ్గు టీడీపీ నేత చంద్రబాబునాయుడు, మాజీ సీఎం కిరణ్ కుమార్‌రెడ్డిలపై టీ-కాంగ్రెస్ నేతలు నిప్పులు చెరిగారు. చంద్రబాబు మొదటి నుంచి తెలంగాణకు అడ్డంకిగా మారారని, బీజేపీ ప్రభుత్వం మూడు రాష్ట్రాల ఇచ్చినప్పుడే తెలంగాణను ఇచ్చి ఉంటే తెలంగాణలో వందలాది ప్రాణత్యాగాలు జరిగేవి కాదన్నారు. దేశంలోని రాష్ట్రాలు అన్ని తిరిగి తెలంగాణ బిల్లును అడ్డుకునే ప్రయత్నం చేశారని, ఆయనకు ప్రజలు తగిన బుద్ధి చెప్పాలన్నారు. ఎన్డీఏ హయాంలో తెలంగాణను అడ్డుకున్నది చంద్రబాబేనని.. ఆ పాపం ఊరికే పోదన్నారు. సీఎం కిరణ్ కుమార్‌రెడ్డి తల్లిలాంటి కాంగ్రెస్, సోనియాలను మోసం చేసి, అన్ని విధాలా బాగుపడ్డారన్నారు. కిరణ్‌కుమార్‌రెడ్డిని తెలంగాణ ప్రజల కష్టం, శ్రమలు వెంటాడుతాయని, ఏదో ఒక రోజు తెలంగాణ అమరుల ఉసురు తాకుతుందని పేర్కొన్నారు. టీ-బిల్లు విషయంలో బీజేపీ అవకాశవాద రాజకీయాలకు పాల్పడిందని సభలో నాయకులు ధ్వజమెత్తారు. పార్లమెంట్లో బీజేపీ సీనియర్ నాయకుడు ఎల్కే అద్వానీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లు లేనేలేదు, కేవలం ఓటాన్ అకౌంట్ బిల్లు మాత్రమే ప్రవేశ పెట్టాలని పేర్కొన్న విషయమే ఇందుకు ఉదాహరణ అన్నారు. సభకు ఎంపీ షెట్కార్, మాజీ మంత్రి దూరం నిజామాబాద్‌లో నిర్వహించిన ‘కృతజ్ఞత సభ’కు మాజీ మంత్రి పి.సుదర్శన్‌రెడ్డి, ఎంపీ సురేశ్ షెట్కార్ గైర్హాజర్ కావడం, ఇదే సమయంలో కామారెడ్డిలో ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ నిర్వహించిన సభకు హాజరు కావడం కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది. సుదర్శన్‌రెడ్డి, డి.శ్రీనివాస్‌ల మధ్యన కొంతకాలంగా గ్రూపుల పోరు సాగుతున్న విషయం తెలిసిందే. వారి మధ్య విభేదాలు తాజాగా మరోసారి బహిర్గతమయ్యాయి. -
దిగ్విజయ్‌తో డీఎస్ భేటీ
* ‘రాయల తెలంగాణ’కు టీ-నేతలు ఒప్పుకోవాలన్న దిగ్విజయ్ * రాహుల్ పిలుపుతో నేడు మళ్లీ హస్తినకు డిప్యూటీ సీఎం సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ అధిష్టానం నుంచి అందిన పిలుపుతో పీసీసీ మాజీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ ఆదివారం సాయంత్రం ఆకస్మికంగా ఢిల్లీ వెళ్లారు. హస్తినలో దిగిన వెంటనే ఆయన ఆదివారం రాత్రి రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్‌తో భేటీ అయ్యారు. సుమారు 35 నిమిషాల పాటు జరిగిన ఈ భేటీలో ప్రధానంగా రాయల తెలంగాణ అంశంపై చర్చించినట్లు తెలుస్తోంది. రాష్ట్ర విభజనకు సానుకూల వాతావరణం కోసం సాగించే ప్రక్రియలో భాగంగానే రాయల తెలంగాణ అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ఈ సందర్భంగా డీఎస్‌కు దిగ్విజయ్ స్పష్టంచేసినట్లు సమాచారం. నదీ జలాల అంశం సహా రాజకీయ లబ్ధిని ఆలోచించే ఈ దిశగా నిర్ణయం తీసుకుంటున్నామని.. దీనికి తెలంగాణ నేతలు ఒప్పుకోవాలని ఆయన కోరినట్లు తెలిసింది. అయితే ఈ ప్రతిపాదనకు తనతో సహా తెలంగాణ ప్రాంతానికి చెందిన వారెవరూ అంగీకరించబోరని దిగ్విజయ్‌కు డీఎస్ స్పష్టంచేసినట్లు సమాచారం. తెలంగాణ సంస్కృతికి, సీమలోని అనంతపురం, కర్నూలు జిల్లాల సంస్కృతికి 200 ఏళ్ల వైరుధ్యం ఉందని ఆయన వివరించినట్లు చెప్తున్నారు. డీఎస్ సోమవారం ఉదయం మరికొందరు అధిష్టానం పెద్దలను కలిసి, రాయల తెలంగాణ అంశమై చర్చించనున్నారు. ఇదిలావుంటే.. మూడు రోజుల పాటు ఢిల్లీలోనే మకాం వేసి ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్ వచ్చిన ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ కూడా మళ్లీ సోమవారం ఉదయం ఢిల్లీ పయనమవుతున్నారు. ఢిల్లీలో అందుబాటులో ఉండాలంటూ ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ కార్యాలయం నుంచి పిలుపు వచ్చినందునే ఆయన హస్తిన వెళుతున్నట్లు తెలుస్తోంది. బిల్లు సాఫీగా సాగేందుకే ‘రాయల’ ఎత్తుగడ అసెంబ్లీలో తెలంగాణ బిల్లు సాఫీగా సాగేందుకే రాయల తెలంగాణ అంశాన్ని హైకమాండ్ పెద్దలు తెరపైకి తెచ్చి ఉంటారని ప్రభుత్వ విప్ రుద్రరాజు పద్మరాజు అభిప్రాయపడ్డారు. ఆయన ఆదివారం అసెంబ్లీ ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ.. ‘‘తెలంగాణ వాళ్లు 10 జిల్లాలతో కూడిన తెలంగాణ కోసం పట్టుపడుతున్నారు. సీమాంధ్ర ప్రజలు సమైక్యం కావాలని నినదిస్తున్నారే తప్ప రాయల తెలంగాణ ఎవరూ కోరుకోవటం లేదు. ప్రత్యేక సంస్కృతి కలిగిన రాయలసీమ ప్రజలు కూడా రాయల తెలంగాణ కోరుకోవటం లేదు. అసెంబ్లీలో విభజన బిల్లు సాఫీగా సాగేందుకే హైకమాండ్ పెద్దలు ఈ ఆలోచన చేస్తున్నారు’’ అని వ్యాఖ్యానించారు.