![Bajireddy Govardhan Slams Bhupathireddy In Nizamabad - Sakshi](/styles/webp/s3/article_images/2018/09/14/baj.jpg.webp?itok=rIpMl1A5)
బాజిరెడ్డి గోవర్థన్(పాత చిత్రం)
నిజామాబాద్ : టీఆర్‌ఎస్ అసమ్మతి ఎమ్మెల్సీ భూపతిరెడ్డికి అంత సీన్ లేదని నిజామాబాద్ రూరల్ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ వ్యాఖ్యానించారు. విలేకరులతో మాట్లాడుతూ..తనకు ప్రజా మద్ధతు మెండుగా ఉందని వ్యాఖ్యానించారు. రాజ్యసభ సభ్యుడు డి. శ్రీనివాస్, భూపతిరెడ్డి ఇద్దరూ ఒక్కటయ్యారని, అందులో భాగంగానే కుట్రలకు తెరలేపారని అన్నారు. భూపతిరెడ్డి వ్యాఖ్యల్ని ఖండిస్తున్నానని చెప్పారు.
వీరి వ్యవహారాన్ని మొదట్లో కేసీఆర్ దృష్టికి ఎప్పుడూ తీసుకెళ్లలేదని, ఇద్దరూ కలిసి కుమ్మక్కై ఇప్పుడు తనను ఓడించడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. డీఎస్ ఢిల్లీలో కూర్చుని పార్టీని బెదిరిస్తుంటారని ఎద్దేవా చేశారు. భూపతిరెడ్డి చేసే ఆరోపణలు నిరాధారమని, నిజామాబాద్ రూరల్ ఎన్నికల్లో తానే గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment