bhupathiReddy
-
భూపతిరెడ్డికి అంత సీన్ లేదు
నిజామాబాద్ : టీఆర్ఎస్ అసమ్మతి ఎమ్మెల్సీ భూపతిరెడ్డికి అంత సీన్ లేదని నిజామాబాద్ రూరల్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ వ్యాఖ్యానించారు. విలేకరులతో మాట్లాడుతూ..తనకు ప్రజా మద్ధతు మెండుగా ఉందని వ్యాఖ్యానించారు. రాజ్యసభ సభ్యుడు డి. శ్రీనివాస్, భూపతిరెడ్డి ఇద్దరూ ఒక్కటయ్యారని, అందులో భాగంగానే కుట్రలకు తెరలేపారని అన్నారు. భూపతిరెడ్డి వ్యాఖ్యల్ని ఖండిస్తున్నానని చెప్పారు. వీరి వ్యవహారాన్ని మొదట్లో కేసీఆర్ దృష్టికి ఎప్పుడూ తీసుకెళ్లలేదని, ఇద్దరూ కలిసి కుమ్మక్కై ఇప్పుడు తనను ఓడించడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. డీఎస్ ఢిల్లీలో కూర్చుని పార్టీని బెదిరిస్తుంటారని ఎద్దేవా చేశారు. భూపతిరెడ్డి చేసే ఆరోపణలు నిరాధారమని, నిజామాబాద్ రూరల్ ఎన్నికల్లో తానే గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. -
డిప్యూటీ ఈవో కు 29 ప్లాట్లు, ఓ లాడ్జీ..
తిరుపతి : చిత్తూరు జిల్లా తిరుపతిలోని కోదండరామ స్వామి ఆలయ డిప్యూటీ ఈవో టి.భూపతిరెడ్డి ఇంటిపై మంగళవారం రెండో రోజు ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ఏసీబీ అధికారులు పెద్ద ఎత్తున అక్రమ ఆస్తులను గుర్తించినట్లు తెలిపారు. ఇప్పటివరకు భూపతిరెడ్డి ఆస్తులు 29 ప్లాట్లు, ఓ లాడ్జీ ఉన్నట్లు గుర్తించామని.. సోదాలు ఇంకా కొనసాగుతున్నట్లు ఓ అధికారి వెల్లడించారు. టీటీడీ అధికారిగా పనిచేసినప్పుడు తాను ఏ తప్పు చేయలేదని, తన కుమారులు విదేశాలలో ఉంటూ సంపాదించిందే తప్ప.. ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని భూపతిరెడ్డి చెప్పారు. తనపై ఎవరో కుట్ర పన్ని తప్పుడు ఫిర్యాదులు చేశారని ఆయన ఆరోపించారు. అక్రమ ఆస్తులు కలిగి ఉన్నారన్న సమాచారం రావడంతో సోమవారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఆయన ఇంట్లో పలు కీలకమైన ఆస్తి పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.