సాక్షి, హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ డీఎన్‌ఏలోనే బీసీ వ్యతిరేకత ఉందని ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ విమర్శించారు. మండల్ కమిషన్ రిజర్వే షన్లు అడ్డుకునేందుకు కమండల్ యాత్ర చేసిన చరిత్ర ఆ పార్టీకి ఉందని ధ్వజమె త్తారు. మంత్రి గంగుల కమలాకర్, ఎంపీ వద్దిరాజు రవి చంద్ర ఇళ్లపై ఈడీ, ఐటీ దాడులు జరిపించడం దుర్మార్గపు చర్యగా అభివర్ణించారు.
టీఆర్‌ఎస్ ఎల్పీ కార్యాలయంలో పార్టీ ఎమ్మెల్యేలు దానం నాగేందర్, జాజుల సురేందర్, కోరుకంటి చందర్, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్‌తో కలిసి గురువారం మీడియాతో మాట్లాడారు. మునుగోడు ఓటమిని జీర్ణించుకోలేక అమిత్ షా, బండి సంజయ్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. బీసీలపై బీజేపీ చేస్తున్న దాడులను దేశం దృష్టికి తీసుకెళ్తా మని, ఇతర పార్టీలను కలుపుకుని పోరాటం చేస్తామని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. బీసీ వ్యాపార వేత్తలను రాజకీయంగా ఎదగకుండా బీజేపీ కుట్ర చేస్తోందని సురేందర్ ఆరో పించారు. మోదీ రామగుండం పర్యటనపై నిరసనలు వ్యక్తమవుతున్న నేప థ్యంలో బీజేపీ డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతోందని చందర్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment