సాక్షి, నిజామాబాద్ : టీఆర్‌ఎస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్(డీఎస్) కుమారుడు సంజయ్‌పై వస్తున్న లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో మరో కుమారుడు బీజేపీనేత ధర్మపురి అరవింద్ స్పందించారు. సంజయ్ మీద వచ్చిన ఆరోపణలు టీఆర్ఎస్ అంతర్గత వ్యవహారమని అరవింద్ అన్నారు. సంజయ్‌పై వస్తున్న ఆరోపణలు తనకు వ్యక్తిగతంగా డ్యామేజీ జరుగుతుందని అనుకోవడం లేదన్నారు. తాము విడిపోయి 20 ఏళ్లు దాటిపోయిందని అరవింద్ తెలిపారు.
'రాష్ట్రంలో వ్యవసాయ సంక్షోభం నెలకొంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఆయకట్టు రైతులు 10 రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. శ్రీరాంసాగర్ నుంచి వెంటనే సాగునీరు విడుదల చేయాలి. టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు వ్యతిరేకంగా మారిపోయింది. మంత్రి ఎక్కడ ఉన్నారో ఎందుకు నిజామాబాద్ వైపు రారో తెలియదు. షుగర్ ఫ్యాక్టరీ కోసం రైతులు ఎదురుచూస్తుంటే రైతు ప్రజా సమస్యల నుంచి దృష్టి మరల్చేందుకు ఎంపీ కవిత ఐటీ హబ్ తెర మీదకు తెస్తారు. టీఆర్ఎస్ వాళ్లు యువత చెవుల్లో ఐటీ హబ్ పేరుతో గులాబీ పువ్వులు పెడుతున్నారు. విద్యార్థుల మీద ప్రేమ ఉంటే తెలంగాణ యూనివర్సిటీని ఎందుకు అభివృద్ధి చేయరు. ఎంతమంది విద్యార్థులను ఎంపీ కవిత అమెరికా పంపారు' అని ధర్మపురి అరవింద్ పేర్కొన్నారు.
సంబంధిత వార్తలు :
ఎవరితో సహజీవనం చేయడం లేదు : డీఎస్ కుమారుడు
డీఎస్ తనయుడి లైంగిక వేధింపులు!
'లైంగిక ఆరోపణలు.. టీఆర్ఎస్ అంతర్గత వ్యవహారం'
Published Fri, Aug 3 2018 12:51 PM | Last Updated on Wed, Oct 17 2018 6:10 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment