ఇందూరుకు నేడు ఎంపీ శీనన్న
♦ రాజ్యసభ సభ్యుడిగా మొదటి సారి జిల్లాకు..
♦ ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద స్వాగత ఏర్పాట్లు
♦ కృతజ్ఞతగా ‘కేసీఆర్ అన్నకు షుక్రియా’కు ర్యాలీ
♦ ఘనస్వాగతం పలకనున్న టీఆర్‌ఎస్ శ్రేణులు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : సీనియర్ రాజకీయ నేత, రాజ్యసభ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్(డీఎస్) నేడు జిల్లాకు రానున్నారు. ఇటీవలే రాజ్యసభ్య సభ్యుడిగా ఎన్నికైన ఆయన తొలిసారిగా జిల్లాకు శుక్రవారం వస్తున్నారు. హైదరాబాద్ నుంచి ఉదయం కారులో బయలుదేరనున్న డీఎస్ మధ్యాహ్నం వరకు జిల్లాకు చేరుకుంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ సందర్భంగా ఆయనకు ఇందల్వాయి టోల్‌ప్లాజా వద్ద ఘన స్వాగతం పలికేందుకు టీఆర్‌ఎస్ శ్రేణులు సిద్ధమయ్యాయి.
ఇందూరు నుంచి అంచెలంచెలుగా పెద్దల సభకు ఎదిగిన ధర్మపురి శ్రీనివాస్ ఎంపీగా మొదటిసారి జిల్లాకు వస్తున్న సందర్భంగా టీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు, ఆయన అభిమానులు, అనుచరులు భారీ ఏర్పా ట్లు చేశారు. డీఎస్ తనయుడు, మాజీ నగర మేయర్ ధర్మపురి సంజయ్(జూనియర్ డీఎస్) ఆధ్వర్యంలో భారీగా స్వాగత ఏర్పాట్లు చేశారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం నుంచి భారీగా నాయకులు, కార్యకర్తలను తరలించేందుకు మాజీ డీసీఎంఎస్ చైర్మన్, టీఆర్‌ఎస్ జిల్లా నాయకులు మునిపల్లి సాయరెడ్డి జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలతో కలిసి గ్రామాలు తిరిగారు.
మధ్యాహ్నం 12.30 గంటలకు ..
హైదరాబాద్ నుంచి 12.30 గంటలకు జిల్లాకు చేరనున్న రాజ్యసభ సభ్యులు డీఎస్‌కు పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, అనుచరులు, అభిమానులు ఇందల్వాయి టోల్‌ప్లాజా వద్ద ఘన స్వాగతం పలుకుతారు. ఈ మేరకు డీఎస్ తనయుడు ధర్మపురి సంజయ్ పర్యవేక్షణలో పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికి భారీ ర్యాలీ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. డీఎస్ రాజ్యసభ సభ్యునిగా ప్రమాణస్వీకారం చేశాక మొదటిసారిగా జిల్లాకు వస్తున్న సందర్భంగా ఈ ర్యాలీలో వేలాదిగా శీనన్న అభిమానులు, పార్టీనాయకులు, కార్యకర్తలు, నగర, రూరల్ నియోజకర్గ పార్టీ నాయకులుతోపాటు జిల్లావ్యాప్తంగా ఉన్న ఆయన అనుచరులు, శ్రేయోభిలాషులు పాల్గొనేందుకు ఉత్సాహం చూపుతున్నారు. అక్కడి నుంచి కార్లతో కాన్వాయ్‌గా మాధవనగర్‌లోని శ్రీ సాయిబాబా దేవాలయం వరకు చేరుకుంటారు. మాధవనగర్ సాయిబాబా ఆలయంలో డీఎస్‌కు ఆయన అనుచరు లు ఘన స్వాగతం పలికి ‘బాబా’ వద్ద ప్రత్యేక పూజలు చేసి అనంతరం శాలువ కప్పి సన్మానిస్తారు. ఆ తర్వాత డీఎస్‌కు ఎంపీగా కల్పిం చినందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేసేందుకు పార్టీ వర్గాలు ‘కేసీఆర్ అన్నకు షుక్రియా ర్యాలీ’ని చేపట్టనున్నారు.
రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో సమావేశం
మాధవనగర్ నుంచి పెద్ద ఎత్తున పార్టీశ్రేణులు, నాయకులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో డీఎస్ ర్యా లీని ప్రారంభించి అక్కడి నుంచి బోర్గాం(పి), ఆర్యనగర్, వినాయక్‌నగర్, పులాంగ్ చౌరస్తా, వర్ని రోడ్డు, రాజరాజేంద్ర చౌరస్తా, బడాబజా ర్, ఆజాంరోడ్డు, నెహ్రూపార్క్ చౌరస్తా, గాంధీచౌక్, బస్టాండ్, స్టేషన్‌రోడ్డు మీదుగా రాజీవ్‌గాంధీ ఆడిటోరియం వరకు కొనసాగించేం దుకు రూట్‌మ్యాప్‌ను తయారు చేశారు. అనంతరం రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో డీఎస్‌కు అభినందనసభ ఏర్పాటు చేశారు.
రాజ్యసభ స భ్యునిగా ఎన్నికైన తర్వాత తొలిసారిగా జిల్లా కేంద్రానికి వస్తున్న డీఎస్‌కు టీఆర్‌ఎస్ నాయకు లు, ఆయన అనుచరవర్గీయులు నగరంలోని ప్రధాన కూడళ్ల వద్ద ఘన స్వాగతం పలుకుతూ భారీ ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇదే సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని రాష్ట్రవ్యాప్తంగా హరి తహారం కార్యక్రమం ప్రారంభిస్తుండగా.. అం దులో భాగంగా శుక్రవారం రాజ్యసభ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ జిల్లాలోని ఆయా ప్రాంతా ల్లో హరితహారంలో పాల్గొని మొక్కలు నాటనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. మధ్యాహ్నం 12.30 గంటలకు ఇందల్‌వాయి టోల్‌గేట్ వద్ద, మధ్యాహ్నం 1.30 గంటలకు మాధవనగర్ సా యిబాబా మందిరం వద్ద, మధ్యాహ్నం 3 గంట లకు రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో మొక్కలు నాటుతారు.