
మండలిలో కాంగ్రెస్ ఫ్లోర్‌లీడర్ గా డీఎస్
హైదరాబాద్: తెలంగాణ కౌన్సిల్‌లో కాంగ్రెస్ పక్షనేతగా పీసీసీ మాజీ అధ్యక్షు డు ధర్మపురి శ్రీనివాస్, ఉపనేతగా మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అసెంబ్లీ కమిటీ హాల్‌లో జరిగిన తెలంగాణ ఎమ్మెల్సీల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్, వయలార్ రవి పర్యవేక్షణలో ఈ సమావేశం జరిగింది. అయితే ఓటింగ్ నిర్వహించకపోవడంపై రాజలింగం, పొంగులేటి సుధాకర్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈనెల ఎనిమిదో తేదీ నుంచి శాసనసభ, తొమ్మిదో తేదీనుంచి శాసనమండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి.