
కౌన్సిల్ లో ప్రతిపక్ష నేతగా షబ్బీర్
హైదరాబాద్: తెలంగాణ శాసనమండలిలోప్రతిపక్ష నేతగా షబ్బీర్ అలీని కాంగ్రెస్ అధిష్టానం నియమించింది. ఈ మేరకు కౌన్సిల్ చైర్మన్ స్వామిగౌడ్ కు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమకుమార్ రెడ్డి లేఖ రాశారు. కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జి దిగ్విజయ్ సింగ్ ఆదేశాలతో షబ్బీర్ అలీని ప్రతిపక్ష నేతగా ఎంపిక చేశామని ఉత్తమకుమార్ రెడ్డి వెల్లడించారు.
ఇప్పటివరకు సీనియర్ నాయకుడు డి. శ్రీనివాస్ కౌన్సిల్ లో విపక్షనేతగా కొనసాగారు. తనను తప్పించి షబ్బీర్ అలీని ప్రతిపక్ష నాయకుడిగా ఎంపికచేయడంతో డీఎస్ ఎలా స్పందిస్తారో చూడాలి.