
సాక్షి, తాడేపల్లి: మాజీ మంత్రి, సీనియర్ నేత ధర్మపురి శ్రీనివాస్ మృతి పట్ల వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సంతాపం తెలిపారు. డీఎస్ మరణం దిగ్భ్రాంతి కలిగించిందని.. దివంగత మహానేత వైఎస్సార్‌తో ధర్మపురి శ్రీనివాస్‌కు ఉన్న అనుబంధం మరిచిపోలేనిదని వైఎస్ జగన్ అన్నారు. డీఎస్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. కాగా, ధర్మపురి శ్రీనివాస్ మరణం పట్ల ఆయన కుటుంబ సభ్యులకు వైఎస్ జగన్ సానుభూతి తెలిపారు.
సంబంధిత వార్త: కాంగ్రెస్ సీనియర్ నేత ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూత