యువతకు పెద్దపీట వేస్తాం | future depend upon youth says d.srinivas | Sakshi
Sakshi News home page

యువతకు పెద్దపీట వేస్తాం

Published Tue, Apr 29 2014 1:59 AM | Last Updated on Mon, Oct 22 2018 9:16 PM

యువతకు పెద్దపీట వేస్తాం - Sakshi

యువతకు పెద్దపీట వేస్తాం

 సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : యువత చేతిలోనే దేశభవిష్యత్ ఆధారపడి ఉందని, వారికి అన్ని రంగాల్లో ప్రాధాన్యత కల్పించేందుకు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెద్దపీట వేసిందని పీసీసీ మాజీ చీఫ్ ధర్మపురి శ్రీనివాస్ పేర్కొన్నారు.  తెలంగాణ రాష్ట్రం లో యువత అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించే వి ధంగా ప్రోత్సాహం ఉంటుందన్నారు. యూ పీఏ చైర్‌పర్సన్, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ చిత్తశుద్ధితోనే తెలంగాణ రాష్ర్టం ఏర్పడిందన్నారు.  సోనియా కాకుండా ఎవరు న్నా ‘తెలంగాణ’ ’ వచ్చేది కాదన్నారు. సో మవారం డీఎస్ నగరంలోని నిఖిల్‌సాయి హోటల్‌లో విలేకరులతో మాట్లాడారు.

తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆమె తనతో మా ట్లాడారని, తెలంగాణ ప్రజలు దేవతగా కొలుస్తున్నారని చెప్పానని అన్నారు. తనను దేవతను చెయ్యొద్దని, తల్లిగా చూస్తే చాలన్న సోనియాగాంధీ తెలంగాణలో తొలి ప్ర భుత్వం కాంగ్రెస్ ఏర్పడితే అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకోవచ్చని సూచిం చారని తెలిపారు. ఇచ్చిన మాటకు కట్టుబడిన కాంగ్రెస్‌కు తెలంగాణ ప్రజలు పట్టంకడతారని డీఎస్ ఆశాభావం వ్యక్తం చేశారు. జిల్లా ప్రజల కు సంపూర్ణ ఆరోగ్యం కోసం కోరగా తన షష్టిపూర్తి వేడుకలకు హాజరైన అప్పటి ముఖ్యమంత్రి, దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి మెడికల్ కళాశాలను గిఫ్ట్‌గా మంజూరు చేశారని అన్నారు.

ఉద్యోగ, పారిశ్రామిక రంగాల్లో యువతను అగ్రగామిగా నిలిపేం దుకు యువనేత రాహుల్‌గాంధీ బృహత్తర ప్రణాళిక రూపొందించారని స్పష్టం చేశా రు. జిల్లాలో గల్ఫ్ బాధితులు లేకుండా, యువత వలస వెళ్లకుండా ఉండేం దుకు ఉపాధి, ఉద్యోగావకాశాలు మరింత మెరుగుపరిచేందుకు కృషి చేస్తానన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథకాలతో అద్దంలా తీర్చిదిద్దుతామని అన్నా రు. యువతను పారిశ్రామికంగా ప్రోత్సహించేందుకు బ్యాంకు లింకేజీ ద్వారా రుణాలిచ్చి, సబ్సిడీ, మార్జిన్‌మనీ సమకూర్చి పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. ప్రతి మండలానికో యూ త్ భవన నిర్మాణం, జిల్లాలో 400 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన కేంద్రం ఏర్పాటు చేస్తామన్నారు.

 ప్రభుత్వ పథకాల పర్యవేక్షణకు జిల్లా లో ఓ అడ్వయిజరీ కమిటీని ఏర్పాటు చేస్తానని పేర్కొన్నారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు జిల్లా కేంద్రంలో రెండెకరాల్లో అన్ని హంగులతో స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను నిర్మిస్తామని డీఎస్ హామీ ఇచ్చారు. తెలంగాణ అమరవీరుల  కుటుంబాలను ఆదుకోవడానికి కుటుంబంలో కనీసం ఒకరికి ఉద్యోగావకాశం కల్పిస్తామని, రూ.100 కోట్లతో కార్ఫస్ ఫండ్ ఏర్పాటు చేసి రెండెకరాల్లో ప్రొఫెసర్ జయశంకర్ పేరిట ఫౌండేషన్ నెలకొల్పుతామన్నారు.  సమావేశం లో జిల్లా యువజన సంఘాల నేతలు మాణిక్యా ల శ్రీనివాస్, హరీశ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement