సాక్షి, మంచిర్యాల: తెలంగాణ రాష్ట్రంలో తొలి శాసనసభలోకి రాజ సంగా అడుగుపెట్టాలని భావిస్తున్న తాజా మాజీ శాసనసభ్యుల కోరిక తీరే పరిస్థితులు కనిపించడo లేదనే భావన వ్యక్తమవుతోంది. తాజా రాజకీయ పరిస్థితుల్లో జిల్లాలోని తాజా మాజీ ఎమ్మెల్యేల గెలుపు నల్లేరుపై నడకలాగా లేదని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. వారి పరిస్థితి ఏటికి ఎదురీదడం వలే ఉందని ఆ వర్గాలు విశ్లే షిస్తున్నాయి. పార్టీలోని అంతర్గత గ్రూపు తగాదాలు, ఎమ్మెల్యేగా పనిచే సిన సమయంలో ప్రజలకు అందుబాటులో లేరనే అపప్రద, వ్యక్తిగత వ్యతిరేకత, పార్టీపై ఉన్న అభిప్రాయం, పొత్తుల మిత్రులు కత్తులు నూరడం వంటి పరిణామాలు వారికి పంటికింద రాయిలా మారాయి. వెరసి సార్వత్రిక బరిలో ఉన్న తాజా మాజీ ఎమ్మెల్యేలు కత్తిమీద సాము చేస్తున్నారు.
గెలుపు కోసం ఆరాటం
జిల్లాలోని పది అసెంబ్లీ నియోజకవర్గాల తాజా మాజీ ఎమ్మెల్యేల్లో ఇద్దరు మినహా అందరూ ప్రస్తుత ఎన్నికల బరిలో ఉన్నారు. ఆదిలాబాద్ ఎంపీగా బరిలో ఉన్నందున బోథ్ సిట్టింగ్ ఎమ్మెల్యే గెడం నగేశ్, కుమారుడు బరిలో ఉన్నందున ఖానాపూర్ ఎమ్మెల్యే సుమన్ రాథోడ్ పోరు లో లేరు. ఎన్నికలను ఢీ కొంటున్న మిగతా ఎనిమిది మంది తాజా మాజీ ఎమ్మెల్యేలకు గెలుపు అంత ఈజీ కా దనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
తూర్పు జిల్లాలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలకు గెలుపు కోసం చెమటోడాల్సిన పరిస్థితి నెలకొంది. ఆయా స్థానా ల్లో ప్రత్యర్థులు బలంగా ఉండటం, పార్టీల్లోని ముఖ్య నా యకులు ఇతర పార్టీ కండువా కప్పుకోవడం, పొత్తుల్లో సీట్లు తమకు దక్కలేదని మిత్రపక్షం సహకరించకపోవడం వంటివి చెప్పుకోవచ్చు. మంచిర్యాల ఎమ్మెల్యేకు పార్టీలు మారడమనే పరిణామం ఇబ్బందికర ంగా మారే అవకాశాలున్నాయి. బెల్లంపల్లిలో స్వతంత్ర అభ్యర్థి బరి లో ఉండటం, కాంగ్రెస్ శ్రేణులు సహకరించకపోవడం గుండా మల్లేశ్‌కు ఇబ్బందికరంగా మారే అవకాశాలున్నా యి. సిర్పూర్‌లో కాంగ్రెస్, బీఎస్పీ అభ్యర్థులు గట్టిపోటీ ఇస్తుండటం స్థానిక శాసనసభ్యుడికి పంటికింద రాయిలా మారుతున్నాయి. చెన్నూర్ ఎమ్మెల్యే కాంగ్రెస్ అభ్యర్థి నుంచి ధీటైన పోటీని ఎదుర్కొంటున్నారు. ఆసిఫాబాద్ ఎమ్మెల్యేకు తెలంగాణవాదం ఇబ్బందిగా పరిణమించే అ వకాశాలున్నాయి.
పశ్చిమ జిల్లాలో దాదాపు అలాంటి ప రిస్థితులే నెలకొన్నాయి. ఆదిలాబాద్, ముథోల్‌లలోనూ తాజా మాజీ ఎమ్మెల్యేలకు ధీటుగా ప్రత్యర్థులు ప్రజాక్షేత్రంలోకి చొచ్చుకుపోతున్నారు. నరేంద్రమోడీ ఓట్లు సా ధించిపెడ్తారని బీజేపీ అభ్యర్థులు నమ్మకంతో ఉన్నారు. నిర్మల్‌లో సిటి ్టంగ్ ఎమ్మెల్యేకు బీఎస్పీ అభ్యర్థి ధీటైన పో టీ ఇస్తున్నారు. ఇదిలాఉండగా ఆ యా పార్టీల అగ్రనేతలు ప్రచారంలో దూసుకుపోతున్నా రు. వెరసి సిట్టింగ్ ఎమ్మెల్యేలు తిరిగి పదవి దక్కించుకునేందుకు చెమటోడ్చాల్సిన పరిస్థితి నెలకొంది.
తాజా మాజీలు గట్టెక్కేనా?
Published Mon, Apr 28 2014 1:35 AM | Last Updated on Sat, Sep 2 2017 6:36 AM
Advertisement
Advertisement