
ప్రభుత్వ ప్రత్యేక సలహాదారుడిగా డీఎస్
నిజామాబాద్‌కల్చరల్ : తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక సలహాదారుడిగా ధర్మపురి శ్రీనివాస్ శుక్రవారం హైదరాబాద్ సచివాలయంలోని డీ బ్లాక్‌లో పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు జిల్లాకు చెందిన రాష్ట్ర వ్యవసాయ శా ఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్‌తోపాటు ఎమ్మెల్యేలు ఏనుగు రవీందర్‌రెడ్డి, వేమూరి ప్రశాంత్‌రెడ్డి, ఆశన్నగారి జీవన్‌రెడ్డి, ఎమ్మెల్సీ సుధాకర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి, ఏఎస్ పోశెట్టిలు శ్రీని వాస్‌ను కలిసి బొకేలు అందించి శుభాకాంక్షలు తెలిపారు.
అలాగే నిజామాబాద్ జెడ్పీటీసీ సభ్యురాలు పుప్పాల శోభ, ఎంపీపీ యాదగిరి, రూరల్ నియోజకవర్గ ఇన్‌చార్జీ డాక్టర్ భూపతిరెడ్డి, దాదాన్నగారి విఠల్‌రావు, బీరెల్లి లక్ష్మణ్‌రావు, డి. రాజేంద్రప్రసా ద్, దారం సాయిలు, మాయావార్ సాయిరాం, పాండు, డి. నారాయణరావు, ఆకుల చిన్నరాజేశ్వర్‌తోపాటు కార్పొరేటర్లు, డీఎస్‌ను కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు.