డీఎస్‌కు కేసీఆర్ జన్మదిన శుభాకాంక్షలు | KCR happy birthday to the DS | Sakshi
Sakshi News home page

డీఎస్‌కు కేసీఆర్ జన్మదిన శుభాకాంక్షలు

Published Mon, Sep 28 2015 12:54 AM | Last Updated on Wed, Jul 25 2018 2:52 PM

డీఎస్‌కు కేసీఆర్ జన్మదిన శుభాకాంక్షలు - Sakshi

డీఎస్‌కు కేసీఆర్ జన్మదిన శుభాకాంక్షలు

- కుటుంబ సమేతంగా డీఎస్ ఇంటికి వెళ్లిన సీఎం
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వ అంతర్‌రాష్ట్ర వ్యవహారాల సలహాదారు ధర్మపురి శ్రీనివాస్ (డీఎస్)కు సీఎం కేసీఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆదివారం 67వ పుట్టిన రోజు జరుపుకొన్న డీఎస్ ఇంటికి సీఎం కేసీఆర్ తన కుటుంబ సభ్యులతో కలసి వె ళ్లారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ స్వయంగా డీఎస్‌తో పుట్టిన రోజు కేక్ కట్ చేయించారు. సీఎం వెంట రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ కూడా ఉన్నారు. సీఎం కుటుంబ సభ్యులంతా డీఎస్ ఇచ్చిన విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇద్దరునేతలు కొద్ది సేపు వివిధ అంశాలపై చర్చించినట్లు డీఎస్ సన్నిహిత వర్గాలు తెలిపాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement