సీతారాం ఏచూరి మృతి పట్ల వైఎస్‌ జగన్‌ దిగ్భ్రాంతి | YS Jagan Condolence To CPM Sitaram Yechury | Sakshi
Sakshi News home page

సీతారాం ఏచూరి మృతి పట్ల వైఎస్‌ జగన్‌ దిగ్భ్రాంతి

Published Thu, Sep 12 2024 5:44 PM | Last Updated on Thu, Sep 12 2024 6:39 PM

YS Jagan Condolence To CPM Sitaram Yechury

సాక్షి, తాడేపల్లి: సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మరణంపై వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

ఏచూరి పట్ల వైఎస్‌ జగన్‌..జీవితాంతం వామపక్ష భావాలతో గడిపిన ఆయన, దేశ ప్రగతి కోసం నిర్విరామంగా చొరవ చూపారని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడలో జన్మించిన సీతారాం ఏచూరి, స్వశక్తితో జాతీయ స్థాయికి ఎదిగారని, విద్యార్థి దశ నుంచే ఆయన నాయకత్వ లక్షణాలు కనబర్చారని గుర్తు చేశారు. సీపీఎంలోనూ నాయకత్వ లక్షణాలు చూపి, పార్టీలో అత్యున్నత విధాన నిర్ణాయక పోలిట్‌బ్యూరో సభ్యుడిగానూ, పార్టీ ప్రధాన కార్యదర్శిగానూ పని చేశారు.‌ ఏచూరి మృతి, దేశ రాజకీయాల్లో తీరని లోటని అన్నారు. 

ఇది కూడా చదవండి: వామపక్ష దిగ్గజ నేత ఏచూరి రాజకీయ ప్రస్థానం ఇలా..
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement