ప్రేమ... ద్వేషం | I love to hate | Sakshi
Sakshi News home page

ప్రేమ... ద్వేషం

Jul 23 2015 11:27 PM | Updated on Sep 3 2017 6:02 AM

ప్రేమ... ద్వేషం

ప్రేమ... ద్వేషం

రాజ్, గీతాభగత్ జంటగా స్వీయ దర్శకత్వంలో మహేశ్ నిర్మించిన చిత్రం ‘కలయా నిజమా’. వంశీకృష్ణ స్వరపరచిన ఈ చిత్రం పాటలను నిర్మాత దామోదర్ ప్రసాద్ ఆవిష్కరించారు.

రాజ్, గీతాభగత్ జంటగా స్వీయ దర్శకత్వంలో మహేశ్ నిర్మించిన చిత్రం ‘కలయా నిజమా’. వంశీకృష్ణ స్వరపరచిన ఈ చిత్రం పాటలను నిర్మాత దామోదర్ ప్రసాద్ ఆవిష్కరించారు. ‘‘మహేశ్ ఈ కాన్సెప్ట్ నాకు చెప్పాడు. కానీ, దర్శక, నిర్మాతగా రెండు బాధ్యతలు కష్టమవుతుందేమో అన్నాను.
 
 కొన్ని రోజుల తర్వాత సినిమా పూర్తి చేశానని చెప్పాడు. ఎంతో మమకారంతో ఈ సినిమా చేశాడు’’ అని దామోదర ప్రసాద్ అన్నారు. ఈ చిత్రం ట్రైలర్ చూసి, దాసరి నారాయణరావుగారు ఇంప్రెస్ అయ్యారని దర్శకుడు రేలంగి నరసింహారావు చెప్పారు.
 
 మంచి పాటలివ్వడానికి ఆస్కారం ఉన్న కథ అని వంశీకృష్ణ తెలిపారు. ప్రేమ, ద్వేషం నేపథ్యంలో సాగే చిత్రం ఇదనీ, భార్యాభర్తల మధ్య ద్వేషం ఏర్పడితే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయనేది కథ అని మహేశ్ చెప్పారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: నవీన్ జోయెల్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement