
మోషమి రాయ్(ఫైల్)
నెలమంగల(దొడ్డబళ్లాపురం): ప్రేమ వివాహానికి తల్లిదండ్రులు నిరాకరించారనే మనస్తాపంతో నర్సింగ్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదివారం నెలమంగల రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పశ్చిమ బెంగాల్‌కు చెందిన మోషమి రాయ్(20) నెలమంగల తాలూకా టీ బేగూరులోని నర్సింగ్ కాలేజీలో డిప్లోమా ఇన్ నర్సింగ్ చదువుతోంది. ఆమే రాయ్ పాపన్ అనే యువకుడిని ప్రేమిస్తోంది. ఈ విషయాన్ని తన తల్లితండ్రులకు తెలియజేసింది. తమ వివాహానికి అంగీకరించాలని కోరింది. తల్లిదండ్రులు నిరాకరించడంతో మనస్తాపం చెందిన విద్యార్థిని కాలేజీ పీజీ కట్టడంలోనే ఆదివారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. నెలమంగల రూరల్ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.