విద్యార్థినిని కిడ్నాప్‌ చేసి వివాహం | Nursing Student Kidnapped Marriage Secretly In Tamilnadu | Sakshi
Sakshi News home page

విద్యార్థినిని కిడ్నాప్‌ చేసి వివాహం

Published Tue, May 29 2018 8:15 AM | Last Updated on Tue, May 29 2018 8:15 AM

Nursing Student Kidnapped Marriage Secretly In Tamilnadu - Sakshi

టీ.నగర్‌: చెన్నై పల్లావరం సమీపంలో నర్సింగ్‌ విద్యార్థినిని కిడ్నాప్‌ చేసి, వివాహమాడిన యువకుడిని పోలీసులు సోమవారం అరెస్టు చేసి జైలుకు పంపారు. పల్లావరం సమీపం పమ్మల్‌కు చెందిన  రాజపాండి (21). పెయిం టింగ్‌ కార్మికుడు. ఇతనికి బస్సులో వెళుతుండగా 17 ఏళ్ల యువతితో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. ఈ యువతి నర్సింగ్‌ రెం డో సంవత్సరం చదువుతోంది. వీరి ప్రేమకు యువతి తల్లిదండ్రులు వ్యతిరేకించారు. ఇది లాఉండగా రాజపాండి, నర్సింగ్‌ యువతి కొన్ని రోజుల కిందట అదృశ్యమయ్యారు.

దీని పై విద్యార్థిని తల్లిదండ్రులు పమ్మల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. యువకుడు రాజపాండి నర్సింగ్‌ విద్యార్థినిని కిడ్నాప్‌ చేసినట్టు కేసు నమోదైంది. వీరి కోసం పోలీసులు గాలిస్తుండగా ఇరువురు తేనిలో ఉన్నట్లు సమాచారం అందింది. దీంతో పోలీసులు అక్కడికి వెళ్లారు. అక్కడ యువకుడు రాజపాండి నర్సింగ్‌ విద్యార్థినిని వివాహం చేసుకున్నట్లు తెలిసింది. దీంతో ఇరువురిని పమ్మల్‌కు తీసుకువచ్చారు. మైనర్‌ బాలికను వివాహమాడినందున రాజపాండిని కోర్టులో హాజరుపరిచి జైలుకు పంపారు. దీనిపై విచారణ జరుగుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement