
తిరువొత్తియూరు: తన భర్తను అతని బంధువులు కిడ్నాప్ చేసి అత్త కూతురితో బలవంతపు వివాహం చేశారని భార్య తరఫు బంధువులు గురువారం ఆందోళన చేశారు. తిరువారూర్ తాలూకా వేలాకుడికి చెందిన విశ్రాంత సైనిక అధికారి దేవరాజన్ కుమార్తె లావణ్య. ఈమె తిరుత్తరైపూండి సమీపంలోని ఆలతంపాడి పెరుమాల్ వీధికి చెందిన సెల్వరాజ్ కుమారుడు విఘ్నేష్ (27) ఇద్దరూ ప్రేమించుకున్నారు. 3 నెలల క్రితం ఇద్దరూ రిజిష్టర్ వివాహం చేసుకున్నారు. విఘ్నేష్ తన అత్త కుమార్తె వనితను ప్రేమించినట్టు తెలిసింది.
దీంతో వనిత తల్లిదండ్రులు విఘ్నేష్‌ను కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. సోమవారం వనితతో బలవంతంగా వివాహం చేయించారు. ఈ సంగతి తెలుసుకున్న లావణ్య భర్తను విడిపించాలని తిరుత్తురైపూండి పోలీసు స్టేషన్‌లో బుధవారం ఫిర్యాదు చేసింది. ఫిర్యాదుకు సంబంధించి పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. పోలీసులను ఖండిస్తూ లావణ్య, ఆమె బంధువులు తిరుత్తురై పూండి పోలీసు స్టేషన్ ముందు ఆందోళన చేశారు.
Comments
Please login to add a commentAdd a comment