
ఘటనా స్థలంలో పోలీసుల విచారణ
సాక్షి, హైదరాబాద్: అబ్దుల్లాపూర్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జంట మృతదేహాల కలకలం చోటుచేసుకుంది. కొత్తగూడెం బ్రిడ్జ్ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతంలో ఓ యువతి, యువకుడి మృతదేహాలు లభ్యమయ్యాయి. నగ్నంగా మృతదేహాలు ఉన్నాయి. గుర్తు పట్టడానికి వీలులేకుండా శవాలు కుళ్లిన స్థితిలో ఉన్నాయి. ఏకాంతంగా ఉన్న జంటను దుండగులు హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.
ప్రాథమిక దర్యాప్తు ప్రకారం మృతులు కవాడిగూడకు చెందిన వారుగా సమాచారం. మృతి చెందిన యువకుడిని యశ్వంత్, యువతిని జ్యోతిగా గుర్తించారు యువతి ముఖం గుర్తు పట్టడానికి వీల్లేకుండా ఉంది. సంఘటన స్థలానికి కొద్దిదూరంలోనే హోండా యాక్టివాను పోలీసులు గుర్తించారు. యువతీయువకులు హత్యకు గురయ్యారా? లేక బలవన్మరణానికి పాల్పడ్డారా? మరేదైనా ప్రమాదమా? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. మూడు రోజుల క్రితం జరిగిందని అనుమానిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment