
కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురిలో బీజేపీ బూత్ కార్యాలయంలో గురువారం ఉదయం ఓ మృతదేహం వేలాడుతూ కనిపించడంతో ఆ ప్రాంతంలో కలకలం రేగింది. మున్సిపల్ కార్పొరేషన్ 36వ వార్డులో జరిగిన ఈ ఘటనలో మృతుడిని కార్మికుడిగా పనిచేసే నిత్య మండల్ (42)గా గుర్తించారు. మార్నింగ్ వాక్‌కు వెళ్లిన స్ధానికులకు బూత్ కార్యాలయాంలో వేలాడదీసిన మృతదేహం కనిపించడంతో వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
మృతదేహాన్ని పోస్ట్‌మార్టంకు తరలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉత్తర బెంగాల్‌లోని సిలిగురిలో ప్రధాని నరేంద్ర మోదీ భారీ ర్యాలీ నిర్వహించిన అనంతరం ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. మరోవైపు మృతుడు బీజేపీలో చురుకుగా పనిచేసే కార్యకర్తని చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment