మరిపెడ(వరంగల్ జిల్లా): మరిపెడ మండలం దీస్యాతండాలో శుక్రవారం విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నలగురు బాలబాలికలు సరదాగా ఈతకొడదామని దగ్గరలో ఉన్న కునాయ్‌కుంట వద్దకు వెళ్లారు. నలుగురిలో నగేష్(9) అనే బాలుడు ప్రమాదవశాత్తూ కుంటలో పడి మునిగిపోయాడు. ఈత రాకపోవడంతో చనిపోయాడు.
పక్కనున్న ముగ్గురు భయపడి ఈ విషయాన్ని గ్రామస్తులకు తెలిపారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాలుడి మృతదేహాన్ని వెలికి తీయించారు. పోస్టుమార్టం నిమిత్తం దగ్గరలో ఉన్న ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాలుడి మృతితో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.
కుంటలో పడి బాలుడి మృతి
Published Fri, Nov 18 2016 6:01 PM | Last Updated on Fri, Jul 12 2019 3:02 PM
Advertisement
Advertisement