
దొడ్డబళ్లాపురం (రామనగర): సహచరుడు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోతున్నా.. గమనించలేనంతగా సెల్ఫీ మోజులో మునిగి పోయారు వారు.. ఫలితంగా నిండు ప్రాణం నీటిపాలైంది. సహచరుడు నీటిలో మునిగిపోతున్న దృశ్యాలు కూడా వారు దిగిన సెల్ఫీల్లో స్పష్టంగా కనిపి స్తున్నాయి. ఈ దుర్ఘటన కర్ణాటకలో రామనగర జిల్లా రావగొండ్లు కొండ మీద చోటుచేసుకుంది.
బెంగళూరు జయన గర్‌లోని నేషనల్ కాలేజీలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న 25 మంది సోమవారం ఎన్‌సీసీ క్యాంప్‌లో భాగంగా రావగొండ్లు కొండకు వెళ్లారు. విరామ సమయంలో కొండమీదున్న కోనేరులో ఈతకొట్టేందుకు దిగారు. ఈతరాని విశ్వాస్ నీటిలో మునిగిపోసాగాడు. అదే సమయంలో మిగతావారు సెల్ఫీ తీసుకుంటూ ఉండిపోయారు. విశ్వాస్ నీటిలో మునిగిపోతున్న చిత్రాలు ఆ సెల్ఫీల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. కొంతసేపటికి విశ్వాస్ కనిపించకపోవడంతో హడావుడిగా కోనేరులో వెతగ్గా అతని మృతదేహం బయటపడింది.