
న్యూయార్క్: మనుషుల్లో మాత్రమే కనిపించిన కరోనా మహమ్మారి తీవ్రత జంతువుల్లోనూ మొదలైంది. తొలి సారిగా జింకకు కరోనా వైరస్ సోకింది. అమెరికాలోని ఓహియో రాష్ట్రంలోని అడవి తెల్ల తోక జింకకు కొవిడ్-19 వైరస్ సోకిందని అమెరికా వ్యవసాయ శాఖ నివేదించింది. జింకకు కరోనా వైరస్ ఎలా సోకిందనేది ఇంకా తేలలేదని అమెరికా ప్రతినిధి లిండ్సే కోల్ తెలిపారు.
మనుషుల ద్వారా, ఇతర జింకలు, మరొక జంతు జాతుల ద్వారా వైరస్ సోకి ఉంటుందని తాము అనుమానిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ -19 ఉన్న వ్యక్తితో సన్నిహిత సంబంధాలు ఉన్న జంతువులకు కరోనా సోకిందని వైద్యనిపుణులు చెబుతున్నారు. ఒహియో స్టేట్ యూనివర్శిటీ కాలేజ్ ఆఫ్ వెటర్నరీ కొనసాగిస్తున్న అధ్యయనాలలో భాగంగా జింకకు కొవిడ్-19 వైరస్ సోకినట్లు బయటపడింది. గతంలో కుక్కలు, పిల్లులు, సింహాలు, చిరుత పులులు, గొరిల్లాలకు కరోనా వైరస్ సోకిందిజ
చదవండి: Kerala: కరోనా విజృంభణ, కీలక నిర్ణయం
US reports world's first deer with Covid-19 https://t.co/VdVw1RCoLw pic.twitter.com/gqptYB2Bvf
— The Times Of India (@timesofindia) August 28, 2021