సా క్షి, తిరుపతి:
తిరుమల కాలిబాటలో ఉన్న జింకల పార్కును తరలించనున్నారు. జింకల పార్కును అక్కడ కొనసాగించడానికి కేంద్ర జూ అథారిటీ అభ్యంతరం వ్యక్తం చేయడంతో, మరో ప్రాంతానికి తరలించనున్నట్టు తెలిసింది. అటవీ భూముల్లో దాదాపు 25 సంవత్సరాల క్రితం జింకల పార్కును టీటీడీ ఏర్పాటు చేసింది. తిరుమలకు నడిచి వెళ్లే భక్తులు కొద్ది సేపు జింకలను చూస్తూ ఇక్కడ సేదతీరుతుంటారు. వాటికి పండ్లు, ఫలహారాలు, బిస్కెట్లు అందజేస్తూ ఉంటారు. కిలోమీటరుకు 20 జింకలు మాత్రమే ఉండాలని జూ అథారిటీ నిబంధన ఉంది. టీటీ డీ ఏర్పాటు చేసిన జింకల పార్కు దాదాపు మూడు కిలోమీటర్ల విస్తీర్ణం మాత్రమే ఉంది. నిబంధనల ప్రకారం ఇందులో 50 నుంచి 60 జింకలు మాత్రమే ఉండాలి. అయితే 350 వరకు జింకలు ఉన్నట్లు సమాచారం. ఇది నిబంధనలకు విరుద్దంగా ఉండడంతో, దీనిని అక్కడ నుంచి తొలగించాలని టీటీడీకి నోటీసులు అందాయి.
జింకలను తరలించే అవకాశం?
ప్రస్తుతం జింకల పార్కు ఉన్న ప్రాంతమూ అటవీ శాఖకు చెందినదే కావడంతో, టీటీడీ కూడా అక్కడి నుంచి పార్కును తరలించడానికి సుముఖంగా ఉన్నట్లు తెలిసింది. అయితే ఎక్కడకు తరలించాలనేది ప్రశ్నార్థకం. ఈ వ్యవహారం 2010 నుంచి నడుస్తోంది. అప్పటి టీటీడీ ట్రస్టు బోర్డు చైర్మన్ డీకే.ఆదికేశవులు నాయుడు జింకల పార్కును వైఎస్‌ఆర్ జిల్లాలోని ఇడుపుల పాయకు తరలించాలని ప్రతిపాదించారు. లేదా కొన్ని జూలకు పంపించాలనే ఆలోచన కూడా చేశారు. అయితే జింకలను తరలించే సమయంలో కొన్ని మరణించే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.
సరైన ఆహారం లేక..
2010లో 270 జింకలు ఉండగా ప్రస్తుతం వీటి సంఖ్య 350కి దాటింది. వీటి నిర్వహణకు సంవత్సరానికి 25 నుంచి 30 లక్షల రూపాయల వరకు టీటీడీ ఖర్చు చేస్తున్నట్లు తెలిసింది. అయినా ఈ జింకలకు సరైన ఆహారం లేకపోవడంతో, యాత్రికులు ఇచ్చే తిండి కోసం ఆవురావురమంటూ ఉంటాయి. తినే తొందరలో ప్లాస్టిక్ కాగితాలను కూడా మింగేస్తున్నాయి. దీంతో కొన్ని అనారోగ్యం పాలవుతుండగా, మరికొన్ని మరణిస్తున్నాయి. జింకలకు సరైన ఆహార వసతి కల్పించి, యాత్రికులు ఇచ్చే చిరు తిండి తినకుండా అడ్డుకోవడానికి సిబ్బందిని కేటాయిస్తే ఇటువంటి సమస్యలుండవు. పార్కుకు అనుమతి రద్దు చేయడానికి జింకల మృతే ప్రధాన కారణమని తెలుస్తోంది. జింకలను ఇక్కడే ఉంచడం వల్ల, నడి చి వెళ్లే వారికి కొద్దిసేపు ఆటవిడుపుగా ఉంటుందని భక్తులు భావిస్తున్నారు.
జింకల పార్కు ఇక్కడే ఉండాలి
నడక మార్గంలోని జింకల పార్కును చూస్తూ, అలసట లేకుండా కొద్ది సేపు నడిచేయవచ్చు. ఇది ఇక్కడ ఉంటేనే బాగుంటుంది. టీటీడీ దగ్గర డబ్బుకు కొదవ లేదు. ఈ ప్రాంతాన్ని టీటీడీ తీసుకుని, బాగా అభివృద్ధి చేయాలి. జింకలకు మంచి ఆహారం పెట్టాలి. మరి ఎందుకు పెట్టడం లేదో తెలియడం లేదు.
- డి. వేలాయుధం, భక్తుడు, వేలూరు
ప్లాస్టిక్‌తో జింకలు మరణిస్తున్నాయి
జింకల పార్కును అక్కడ నుంచి తరలించమని ఎప్పటి నుంచో అటవీ శాఖ కోరుతోంది. వాటిని ఎక్కడకు తరలించాలనే విషయంపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ప్లాస్టిక్ కాగితాలు తినడం వల్ల జింకలు మరణిస్తున్నాయి. జింకలకు అనవసరమైన ఆహారపదార్థాలను భక్తులు ఇవ్వకుండా ఉంటే మంచిది.
- శ్రీనివాసులు డీఎఫ్‌వో టీటీడీ తిరుపతి
జిల్లాలోని ఇడుపుల పాయకు తరలించాలని లేదా కొన్ని జూలకు పంపించాలనే ఆలోచన కూడా చేశారు. జింకలను తరలించే సమయం లో కొన్ని మరణించే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. అందువల్ల వాటిని ఇక్కడే ఉండేలా చూడాలని కోరుతున్నారు.
సరైన ఆహారం లేక..
2010లో 270 జింకలు ఉండగా ప్రస్తుతం వీటి సంఖ్య 350కి దాటింది. వీటి నిర్వహణకు ఏడా దికి రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షలు టీటీడీ ఖర్చు చేస్తున్నట్లు తెలిసింది. అయినా ఈ జింకలకు సరైన ఆహారం లేకపోవడంతో యాత్రికు లు ఇచ్చే తిండికోసం ఆవురావురమంటూ ఉం టాయి. తినే తొందరలో ప్లాస్టిక్ కాగితాలను కూడా మింగేస్తున్నాయి. దీంతో కొన్ని అనారోగ్యం పాలవుతుండగా, మరికొన్ని మరణిస్తున్నా యి. జింకలకు సరైన ఆహార వసతి కల్పించి, యాత్రికులు ఇచ్చే చిరు తిండి తినకుండా అడ్డుకోవడానికి సిబ్బందిని కేటాయిస్తే ఇటువంటి సమస్యలుండవు. పార్కుకు అనుమతి రద్దు చేయడానికి జింకల మృతే ప్రధాన కారణమని తెలుస్తోంది. జింకలను ఇక్కడే ఉంచడం వల్ల, నడి చి వెళ్లే వారికి కొద్దిసేపు ఆటవిడుపుగా ఉంటుందని భక్తులు భావిస్తున్నారు.
జింకల పార్కు ఇక్కడే ఉండాలి
నడక మార్గంలోని జింకల పార్కును చూస్తూ, అలసట లేకుండా కొద్ది సేపు నడిచేయవచ్చు. ఇది ఇక్కడ ఉంటేనే బాగుం టుంది. టీటీడీ దగ్గర డబ్బుకు కొదవ లేదు. ఈ ప్రాంతాన్ని టీటీడీ తీసుకుని, బాగా అభివృద్ధి చేయాలి. జింకలకు మంచి ఆహారం పెట్టాలి. మరి ఎందుకు పెట్టడం లేదో తెలియడం లేదు.
- డి. వేలాయుధం, భక్తుడు, వేలూరు
ప్లాస్టిక్‌తో జింకలు మరణిస్తున్నాయి
జింకల పార్కును అక్కడ నుంచి తరలించమని ఎప్పటి నుంచో అటవీ శాఖ కోరుతోంది. వాటిని ఎక్కడకు తరలించాలనే విషయంపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ప్లాస్టిక్ కాగితాలు తినడం వల్ల జింకలు మరణిస్తున్నాయి. జింకలకు ఆహారపదార్థాలు భక్తులు ఇవ్వకుండా ఉంటే మంచిది.
- శ్రీనివాసులు డీఎఫ్‌వో
టీటీడీ తిరుపతి
కనువిందు.. కనుమరుగు?
Published Sat, Dec 14 2013 3:02 AM | Last Updated on Sat, Sep 2 2017 1:34 AM
Advertisement
Advertisement