
ఫ్లోరిడా: నైరుతి ఫ్లోరిడాలోని ఓ పైథాన్ తనకంటే బరువున్న ఓ జింకను మింగేసింది. కన్సర్వెన్సీ ఆఫ్ సౌత్ వెస్ట్ ఫ్లోరిడాకు చెందిన జాతీయ పార్కు అధికారులు ఈ ఘటనకు సంబంధించి వివరాలను వెల్లడించారు. కొలియర్-సెమీనోల్ స్టేట్ ఫారెస్ట్‌లో 15.88 కిలోల జింకను, 14.29 కిలోల పైథాన్ మింగేసింది. దీన్ని గుర్తించిన అధికారులు ఈ తతంగాన్ని మొత్తం డాక్యుమెంట్ రూపంలో పొందుపరిచారు.
పైథాన్ జంతువును మింగేసిందని గుర్తించిన అధికారులు, వెంటనే పైథాన్ పొట్టను కోశారు. చనిపోయిన జింకను బయటకు తీసి, తిరిగి పైథాన్‌కు కుట్లు వేసి దాన్ని రక్షించారు. బర్మెస్ పైథాన్‌లు సాధారణంగా భారీగా ఆహారాన్ని తీసుకుంటాయని, కానీ మరీ ఇంత పెద్ద మొత్తంలో ఆహారాన్ని తీసుకోవడాన్ని గుర్తించడం ఇదే ప్రథమమని అధికారులు తెలిపారు. హెర్పెటోలాజికల్ రివ్యూ 2018 మార్చిలో ఈ డాక్యుమెంట్‌ను పబ్లిష్ చేశారు.