ఈ శునకం నిజంగా హీరో! | The hero dog | Sakshi
Sakshi News home page

ఈ శునకం నిజంగా హీరో!

Published Mon, Jul 24 2017 2:07 AM | Last Updated on Wed, Oct 17 2018 4:36 PM

ఈ శునకం నిజంగా హీరో! - Sakshi

ఈ శునకం నిజంగా హీరో!

ఎవరైనా ప్రమాదంలో ఉంటే కాపాడేందుకు కాస్త వెనకాముందు ఆలోచిస్తాం. మనకేదైనా నష్టం కలుగుతుందేమోనని భయపడతాం. కానీ జంతువులకు ఇలాంటి ఆలోచనలు, భయాలు ఉండవు కదా..? అందులో శునకం లాంటి విశ్వాసంగల జీవికి అసలే ఉండవనే విషయం మరోసారి రుజువైంది. ఈ చిత్రంలో కనిపిస్తున్న శునకం ఆపదలో ఉన్న మరో మూగజీవిని కాపాడేందుకు ప్రాణాలను సైతం లెక్కచేయలేదు. అమెరికాలో జరిగిన ఈ సంఘటన ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తోంది. న్యూయార్క్‌కి చెందిన మార్క్‌ ఫ్రీలీ అనే వ్యక్తి తన పెంపుడు శునకంతో కలసి బీచ్‌లో నడుస్తున్నాడు.

ఉన్నట్టుండి ఆ పెంపుడు శునకం ఒక్కసారిగా నీటిలోకి దూకింది. ఎందుకలా దూకిందో ఫ్రీలీకి కాసేపు అర్థం కాలేదు. అయితే నీటిలో చిక్కుకుని సాయం కోసం ఎదురు చూస్తున్న ఓ జింకను కాపాడేందుకు ఆ శునకం నీటిలో దూకిందని గ్రహించాడు. వెంటనే ఆ శునకం జింక పిల్లను కాపాడే ఘటనను వీడియో తీశాడు. జింక పిల్ల మెడ భాగాన్ని ఆ శునకం నోటితో పట్టుకుని నెమ్మదిగా ఒడ్డుకు తీసుకొచ్చింది. అంతేకాదు.. జింక పిల్లకు కొన్ని సపర్యలు కూడా చేసింది. ఈలోపు ఫ్రీలీ జంతు సంరక్షణ విభాగానికి సమాచారమిచ్చి జింకను ఆస్పత్రికి తరలించే ఏర్పాటు చేశాడు. ప్రస్తుతం ఆ జింక పిల్ల కోలుకుంటోంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement