కుక్క కోసం కోర్టుకెక్కిన జంట
పిల్లల కోసం కోర్టుకు ఎక్కిన వారిని చూశాం. అయితే తాజాగా ఓ జంట మాత్రం తాము పెంచుకున్న కుక్క కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. విషయంలోకి వెళితే ఫోటోలో కనిపిస్తున్న ఈ బుల్లి కుక్క పేరు జోయి (2). ప్రస్తుతం న్యూయార్క్లో దీని గురించే చర్చ.
ఎందుకంటే పెళ్లై విడాకులు తీసుకున్నవారు పిల్లల కస్టడీ కోసం కోర్టుకు ఎక్కుతారు. అయితే మన్హటన్లోన వాషింగ్టన్ హైట్స్కు చెందిన షానన్, త్రిషా బ్రిడ్జెట్ అనే లెస్బియన్ జంట ఈ కుక్క కస్టడీ కోసం కోర్టులో న్యాయ పోరాటానికి దిగారు. విడాకులు తీసుకుంటున్న ఈ జంట శునకం కస్టడీ కోసం కోర్టు మెట్లెక్కడం న్యూయార్క్లో ఇదే తొలిసారి అని మన్హటన్ జడ్జి మాథ్యూ కూపర్ తెలిపారు.