నల్గొండ జిల్లా రాజాపేట మండలం పాముకుంట మధిర గ్రామ పంచాయతీలోని మల్లగూడెం గ్రామ శివారులో ఓ జింకపై కుక్కలు దాడికి దిగాయి.
నల్గొండ : నల్గొండ జిల్లా రాజాపేట మండలం పాముకుంట మధిర గ్రామ పంచాయతీలోని మల్లగూడెం గ్రామ శివారులో ఓ జింకపై కుక్కలు దాడికి దిగాయి. విషయం గమనించిన సమీప గ్రామప్రజలు కుక్కలను తరిమి జింకను రక్షించారు. గాయపడిన జింకకు చికిత్స చేసి అనంతరం సమాచారాన్ని అటవీశాఖ అధికారులకు తెలియజేశారు. సమీప అడవుల్లో నుంచి దాహం తీర్చుకునేందుకు జింక బయటకు వచ్చి ఉండవచ్చునని గ్రామస్తులు భావిస్తున్నారు.