బావిలో పడిన జింకను బయటకు తీస్తున్న అగ్నిమాపక సిబ్బంది, పరిశీలిస్తున్న అధికారులు
చిత్తూరు,పలమనేరు: నీటికోసం వచ్చి మెట్లు లేని బావిలో పడిన జింకను స్థానిక అగ్ని మాపకశాఖ సిబ్బంది రక్షించారు. పట్టణ సమీపంలోని టీఎస్ అగ్రహారంలో బావిలో జింక పడిన విషయాన్ని గమనించిన గ్రామానికి చెందిన హనుమంతురెడ్డి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. 60 అడుగుల లోతు ఉన్న ఈ బావిలోకి అగ్నిమాపక సిబ్బంది దిగి జింకను సురక్షితంగా బయటకు తీసుకొచ్చి, అటవీ శాఖ అధికారులకు అప్పగించారు. జింక బావిలో పడిందని తెలుసుకున్న గ్రామస్తులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment