బిల్ట్ ఫ్యాక్టరీ అటవీ ప్రాంతంలో దుప్పి మృతి
మంగపేట : మంగపేట మండలంలోని కమలాపురం బిల్ట్ ఫ్యాక్టరీ అటవీ ప్రాంతంలో బుధవారం దుప్పి మృతి చెందింది. 1977 లో సుమారు 700 ఎకరాల వరకు దట్టమైన అటవీ భూమిన అటవీ శాఖ బిల్ట్ కార్మాగారానికి అప్పగించింది. ఇందులో దు ప్పులు, జింకలు, కొండగొర్లు, ఇతర వన్యప్రాణులు జీవిస్తున్నాయి. అయితే ఇందులో వన్యప్రాణులకు రక్షణ కరువైంది. కుక్కలు అటవీ భూముల్లోకి వెళ్లి దుప్పులను చంపుతున్నా యి. బుధవారం కుక్కల దాడిలో దుప్పి మృ తి చెందినట్లు బిల్టు యాజమాన్యం స్థానిక డిప్యూటీరేంజ్ అధికారి సమాచారం అం దించగా ఆయన ఆదేశాల మేరకు మంగపే ట బీటాఫీసర్ సాంబయ్య మృతి చెందిన దుప్పిని పరిశీలించారు.అనంతరం బిల్ట్ సె క్యురిటీ సిబ్బందిచే అక్కడే దహనం చేయిం చారు. మృతి చెందిన దుప్పి వెనుక తొ డల బాగంలో కుల్లిపోయి పురుగులు పడిఉండడాన్ని బట్టి చూస్తుంటే నాలుగు రోజుల క్రిత మే అనారోగ్యం పాలై బయటకు వచ్చి పడిపోయిన దుప్పిని కుక్కలు పీక్కుతిని ఉండవచ్చనే అనుమానాలు కలుగుతున్నాయి.