bilt
-
బిల్ట్ పునరుద్ధరణ బాధ్యత రాష్ట్రానికి లేదా?
కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ ములుగు : బీజేపీ ములుగు నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో పాల్గొనేందుకు ఆదివారం మండలకేంద్రానికి కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ వచ్చారు. ఈసందర్భంగా ఆయనను బిల్ట్ కార్మికులు, బీఎంఎస్ కార్యకర్తలు కలిసి తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రం అందించారు. గత 17 నెల లు గా పెండింగ్‌లో ఉన్న వేతనాలను అందించాలన్నారు. బిల్ట్ పునరుద్ధరణకు సహకరిం చాలని కోరారు. దీనిపై స్పందించిన కేంద్రమంత్రి దత్తాత్రేయ రాష్ట్రంలోని పరిశ్రమను పునరుద్ధరించే బా ధ్యత రాష్ట్రానికి లేదా అని ప్రశ్నించారు. బిల్ట్, నిజాం షుగర్స్ ఫ్యాక్టరీలను తెరిపించేందుకు కృషి చేయాలని రాష్ట్ర ప్ర భుత్వానికి సూచించారు. కార్మికుల వేతనాలు అందేలా తాను సహకరిస్తానన్నారు. బీఎంఎస్ కార్యకర్తలు లిం గంపల్లి శ్రీనివాస్, పాకాల యాదవరెడ్డి, బాలసాని కొ మురయ్య, చుంచు శ్రీరంజన్, చిర్ర వెంకటేశ్వర్లు, రామి డి సురేశ్, కార్మికులు సుభాష్, బండారి వెంకటేశ్వర్లు, రాంప్రసాద్, భిక్షపతి, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
ఏడీఎం కార్యాలయం ముట్టడి
వేతనాలు చెల్లించాలని బిల్ట్ కార్మికుల డిమాండ్ కమలాపురం(మంగపేట) : పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ కార్మికులు బిల్ట్ పరిపాలనా భవనం(ఏడీఎం)ను శుక్రవారం ముట్టడించారు. వేతనాల చెల్లింపులో యాజమాన్యం కాలయాపన చేయడాన్ని నిరసిస్తూ బిల్ట్ కార్మికులు జేఏసీ నాయకులతో ఏడీఎం కార్యాలయంలోకి వెళ్లి బిల్ట్ డీజీఎం కేశవరెడ్డిని ఏడీఎం నుంచి బయటకు వెళ్లకుండా అడ్డుకుని నిర్బంధించారు. యాజ మాన్య వైఖరి నశించాలి, పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలంటు నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న ఎస్సై మహేందర్ సీఆర్పీఎఫ్ పోలీసులతో ఏడీఎంకు చేరుకుని సమస్యపై డీజీఎంతో మాట్లాడారు. అనంతర కార్మికులతో మాట్లాడుతూ ఏడీఎంను ముట్టడించిన విషయంతో పాటు మీ యొక్క డిమాండ్‌ను ఢిల్లీ మేనేజ్మెంట్కు తెలియజేస్తామని చెప్పారు. పలువురు కార్మికులు, జేఏసీ నాయకులు మాట్లాడుతూ ప్యాక్టరీ మూతపడి 27 నెలలు గడుస్తుందని 15 నెలల నుంచి వేతనాలు చెల్లించకపోవడంతో తాము తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని వాపోయారు. ఏ విషయమైనా డీజీఎం తేల్చి చెప్పాలను డిమాండ్ చేశారు. డీజీఎం కార్మికలుకు సర్ధిచెప్పే ప్రయత్నం ఎప్పటి నుంచో ఇదేవిదంగా వ్యవహరిసున్నారన్నారు. ఆ సమయంలో బయటకు వెళ్లే ప్రయత్నం చేయగా కార్మికులు అడ్డుకోవడంతో కొద్దిసేపు తోపులాట జరిగింది. అనంతరం ఎస్సై కార్మికులు, డీజీఎంతో మాట్లాడి పరిస్థితిని చక్కదిద్దారు. అనంతరం ఒకరోజు గడువు ఇస్తే యాజమాన్యంతో మాట్లాడుతానని చెప్పడం తో కార్మికులు నిరసన విరమించారు. జేఏసీ నాయకులపై కార్మికుల ఆగ్రహం యాజమాన్యం 15 నెలలుగా వేతనాలు చెల్లిం చకుండా ఇబ్బందులకు గురి చేస్తుంటే మీరు విద్యుత్ పన్ను విషయంతో యాజమాన్యం తరపున గడువు కోరేందుకు వెళ్లడం ఎంత వరకు సమంజసమని కార్మికులు ఆగ్రహం వెలిబుచ్చారు. దేశవ్యాప్త సమ్మె కార్యక్రమంలో పాల్గొనేందుకు జేఏసీ నాయకులు కార్మికులతో సమావేశం నిర్వహించారు. ఒక విద్యుత్ విషయం కోసం కాదని వేతనాలు, కార్మికులు పడుతున్న ఇబ్బందుల జేసీఎల్ దృష్టికి తీసుకుపోయేందుకు అలాగే కాలనీకి విద్యుత్ సరఫరాను తీసేస్తే ఎదురయ్యే ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకు పోయేందుకు వెళ్లామని చెప్పారు. ఈ క్రమంలో కార్మికులకు జేఏసీ నాయకుల మద్య మాటల యుద్దం చోటు చేసుకుంది. డీజీఎం ఏడీఎం కార్యాలయంలోకి రావడంతో గమనించిన కార్మికులు వేతనాలు చెల్లించడంలో యాజమాన్యం స్పందించక పో వ డంపై డీజీఎంను నిలదీశారు. ఈ సందర్బంగా పలు విషయాలపై జేఏసీ నాయకులను నిలదీస్తు కొందరు కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికుల సమస్యలపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ వెంకటేశ్వర్లు జేఏసీ నా యకులపై మండిపడ్డారు. ఏడీఏ కార్యాల యా న్ని ముట్టడించారనే విషయం తెలుసుకున్న మీడియాను లోపలికి రానీయకుండా సెక్యూరి టీ సిబ్బంది అడ్డుకున్నారు. వెంటనే డీజీఎంతో మాట్లాడి విలేకరులను లోపలికి అనుమతించాలని డిమాండ్ చేయడంతో రెండు గంటల తర్వాత అనుమతించారు. -
బిల్ట్‌ను సందర్శించిన కార్మికశాఖ అధికారులు
మంగపేట : కమలాపురం బిల్ట్ ఫ్యాక్టరీ పరిస్థితి, కార్మికుల సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు కార్మికశాఖ మహబూబాబాద్ అసిస్టెంట్ కమిషనర్ సరివాలు రమేష్‌బాబు, వరంగల్ అసిస్టెంట్ కమిషనర్ నూక శంకర్ శనివారం కర్మాగారాన్ని సందర్శించి కార్మికులు ఎదురుర్కొంటున్న సమస్యలను అడిగితెలుసుకున్నారు. 28 నెలలుగా ఫ్యాక్టరీ మూతపడి ఉండటంతో పాటు 15 నెలలుగా యాజమాన్యం వేతనాలు చెల్లించకపోవడం తో ఎదుర్కొంటున్న సమస్యలను కార్మికులు అధికారులకు వివరించారు. వేతనాలు లేక వైద్యం చేయించుకునే ఆర్ధిక స్థోమత లేకపోవడంతో సకాలంలో వైద్యం అందక కొంద రు, కుటుంబ సమస్యలతో అనారోగ్యంపాలవుతున్నారు. పీఎఫ్, ఎల్ఐసీ చెల్లించకపోవడం తో కార్మికులు జీవితాలకు భద్రత లేకుండా పోయిందన్నారు. అప్పులు చెల్లించమని బ్యాంకు అధికారులు నోటీసులు పంపిస్తున్నారని వాపోయారు. ప్యాక్టరీ ప్రారంభ విషయంపై పలు దఫాలుగా కార్మికశాఖ అధికారులకు, ప్రభుత్వానికి వినతిపత్రం సమర్పిం చినా ఫలితం లేకుండా పోయిందన్నారు. అనంతరం బిల్ట్ ఏడీఎం కార్యాలయంలో ఏ ర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కార్మికశాఖ అధికారులు మాట్లాడుతూ ప్రస్తుత తరుణంలో బిల్ట్ పరిస్థితి, కార్మికల సమస్యలను నేరుగా తెలుసుకుని నివేదిక అందించాలని జాయింట్ కమిషనర్ భాగ్యానాయక్ ఆదేశాల మేరకు తాము రావడం జరిగిందన్నారు. తాను గత 25 ఏళ్ల క్రితం ఇదే ఫ్యాక్టరీలోని కార్మికులతో కలిసి పనిచేశానని కార్మికులబాధలు తనకు తెలుసునని రమేష్‌బాబు గుర్తు చేశారు. కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై జాయింట్ కమిషనర్‌కు నివేదిక పంపిస్తామన్నారు. సమావేశంలో జేఏసీ నా యకులు కుర్బాన్ అలీ, వడ్డెబోయిన శ్రీని వాస్, చాతరాజు చొక్కారావు, పప్పు వెంకట్ రెడ్డి, వడ్లూరి రాంచందర్, శర్మ పాల్గొరు. -

బిల్ట్ ఫ్యాక్టరీ అటవీ ప్రాంతంలో దుప్పి మృతి
మంగపేట : మంగపేట మండలంలోని కమలాపురం బిల్ట్ ఫ్యాక్టరీ అటవీ ప్రాంతంలో బుధవారం దుప్పి మృతి చెందింది. 1977 లో సుమారు 700 ఎకరాల వరకు దట్టమైన అటవీ భూమిన అటవీ శాఖ బిల్ట్ కార్మాగారానికి అప్పగించింది. ఇందులో దు ప్పులు, జింకలు, కొండగొర్లు, ఇతర వన్యప్రాణులు జీవిస్తున్నాయి. అయితే ఇందులో వన్యప్రాణులకు రక్షణ కరువైంది. కుక్కలు అటవీ భూముల్లోకి వెళ్లి దుప్పులను చంపుతున్నా యి. బుధవారం కుక్కల దాడిలో దుప్పి మృ తి చెందినట్లు బిల్టు యాజమాన్యం స్థానిక డిప్యూటీరేంజ్ అధికారి సమాచారం అం దించగా ఆయన ఆదేశాల మేరకు మంగపే ట బీటాఫీసర్ సాంబయ్య మృతి చెందిన దుప్పిని పరిశీలించారు.అనంతరం బిల్ట్ సె క్యురిటీ సిబ్బందిచే అక్కడే దహనం చేయిం చారు. మృతి చెందిన దుప్పి వెనుక తొ డల బాగంలో కుల్లిపోయి పురుగులు పడిఉండడాన్ని బట్టి చూస్తుంటే నాలుగు రోజుల క్రిత మే అనారోగ్యం పాలై బయటకు వచ్చి పడిపోయిన దుప్పిని కుక్కలు పీక్కుతిని ఉండవచ్చనే అనుమానాలు కలుగుతున్నాయి. -
కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం
బిల్ట్ కార్మికుల భారీ ర్యాలీ వారి కుటుంబాల్లో పండుగ వాతావరణం మంగపేట : మూతపడిన బిల్ట్ ఫ్యాక్టరీ పునరుద్ధరణకు ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో ఏడాదిన్నరగా పోరాడుతున్న కార్మికులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. బిల్ట్ ప్రధాన గేటు ఎదుట సీఎం కేసీఆర్ చిత్ర పటానికి సోమవారం క్షీరాభిషేకం చేశారు. అనంతరం కేసీఆర్ చిత్రపటాలతో భారీ ర్యా లీ నిర్వహించి టపాసులు కాల్చారు. అనంతరం అంబేద్కర్ చిత్రపటానికి జేఏసీ నాయకులు పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కార్మికుల సంక్షేమమే ధ్యే యంగా జిల్లాలోనే అతిపెద్ద పరిశ్రమ అయిన బిల్ట్ ఫ్యాక్టరీని పునఃప్రారంభిస్తున్న కేసీఆర్ గొప్పతనం చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తుందని అన్నారు. తమ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, పరిష్కారానికి కృషి చేసిన డిప్యూటీ సీఎం కడియం శ్రీహరికి కార్మికులు ఎంతో రుణపడి ఉంటారని చెప్పారు. కార్యక్రమంలో బిల్ట్ జేఏసీ నాయకులు వడ్డెబోయిన శ్రీనివాసులు, పుసునూరి గణపతి, వడ్లూరి రాంచందర్, చాతరాజు చొక్కారావు, డీవీపీ రాజు, మేడ లక్ష్మీనారాయణ, వంగేటి వెంకట్‌రెడ్డి, కుర్బాన్‌అలీ, పప్పు వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.