బిల్ట్‌ను సందర్శించిన కార్మికశాఖ అధికారులు
Published Sat, Aug 6 2016 11:59 PM | Last Updated on Mon, Sep 4 2017 8:09 AM
మంగపేట :
కమలాపురం బిల్ట్ ఫ్యాక్టరీ పరిస్థితి, కార్మికుల సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు కార్మికశాఖ మహబూబాబాద్ అసిస్టెంట్ కమిషనర్ సరివాలు రమేష్‌బాబు, వరంగల్ అసిస్టెంట్ కమిషనర్ నూక శంకర్ శనివారం కర్మాగారాన్ని సందర్శించి కార్మికులు ఎదురుర్కొంటున్న సమస్యలను అడిగితెలుసుకున్నారు. 28 నెలలుగా ఫ్యాక్టరీ మూతపడి ఉండటంతో పాటు 15 నెలలుగా యాజమాన్యం వేతనాలు చెల్లించకపోవడం తో ఎదుర్కొంటున్న సమస్యలను కార్మికులు అధికారులకు వివరించారు. వేతనాలు లేక వైద్యం చేయించుకునే ఆర్ధిక స్థోమత లేకపోవడంతో సకాలంలో వైద్యం అందక కొంద రు, కుటుంబ సమస్యలతో అనారోగ్యంపాలవుతున్నారు. పీఎఫ్, ఎల్‌ఐసీ చెల్లించకపోవడం తో కార్మికులు జీవితాలకు భద్రత లేకుండా పోయిందన్నారు. అప్పులు చెల్లించమని బ్యాంకు అధికారులు నోటీసులు పంపిస్తున్నారని వాపోయారు.
ప్యాక్టరీ ప్రారంభ విషయంపై పలు దఫాలుగా కార్మికశాఖ అధికారులకు, ప్రభుత్వానికి వినతిపత్రం సమర్పిం చినా ఫలితం లేకుండా పోయిందన్నారు. అనంతరం బిల్ట్ ఏడీఎం కార్యాలయంలో ఏ ర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కార్మికశాఖ అధికారులు మాట్లాడుతూ ప్రస్తుత తరుణంలో బిల్ట్ పరిస్థితి, కార్మికల సమస్యలను నేరుగా తెలుసుకుని నివేదిక అందించాలని జాయింట్ కమిషనర్ భాగ్యానాయక్ ఆదేశాల మేరకు తాము రావడం జరిగిందన్నారు. తాను గత 25 ఏళ్ల క్రితం ఇదే ఫ్యాక్టరీలోని కార్మికులతో కలిసి పనిచేశానని కార్మికులబాధలు తనకు తెలుసునని రమేష్‌బాబు గుర్తు చేశారు. కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై జాయింట్ కమిషనర్‌కు నివేదిక పంపిస్తామన్నారు. సమావేశంలో జేఏసీ నా యకులు కుర్బాన్ అలీ, వడ్డెబోయిన శ్రీని వాస్, చాతరాజు చొక్కారావు, పప్పు వెంకట్ రెడ్డి, వడ్లూరి రాంచందర్, శర్మ పాల్గొరు.
Advertisement