ఏడీఎం కార్యాలయం ముట్టడి
-
వేతనాలు చెల్లించాలని బిల్ట్ కార్మికుల డిమాండ్
కమలాపురం(మంగపేట) : పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ కార్మికులు బిల్ట్ పరిపాలనా భవనం(ఏడీఎం)ను శుక్రవారం ముట్టడించారు. వేతనాల చెల్లింపులో యాజమాన్యం కాలయాపన చేయడాన్ని నిరసిస్తూ బిల్ట్ కార్మికులు జేఏసీ నాయకులతో ఏడీఎం కార్యాలయంలోకి వెళ్లి బిల్ట్ డీజీఎం కేశవరెడ్డిని ఏడీఎం నుంచి బయటకు వెళ్లకుండా అడ్డుకుని నిర్బంధించారు. యాజ మాన్య వైఖరి నశించాలి, పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలంటు నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న ఎస్సై మహేందర్ సీఆర్‌పీఎఫ్ పోలీసులతో ఏడీఎంకు చేరుకుని సమస్యపై డీజీఎంతో మాట్లాడారు. అనంతర కార్మికులతో మాట్లాడుతూ ఏడీఎంను ముట్టడించిన విషయంతో పాటు మీ యొక్క డిమాండ్‌ను ఢిల్లీ మేనేజ్‌మెంట్‌కు తెలియజేస్తామని చెప్పారు.
పలువురు కార్మికులు, జేఏసీ నాయకులు మాట్లాడుతూ ప్యాక్టరీ మూతపడి 27 నెలలు గడుస్తుందని 15 నెలల నుంచి వేతనాలు చెల్లించకపోవడంతో తాము తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని వాపోయారు. ఏ విషయమైనా డీజీఎం తేల్చి చెప్పాలను డిమాండ్ చేశారు. డీజీఎం కార్మికలుకు సర్ధిచెప్పే ప్రయత్నం ఎప్పటి నుంచో ఇదేవిదంగా వ్యవహరిసున్నారన్నారు. ఆ సమయంలో బయటకు వెళ్లే ప్రయత్నం చేయగా కార్మికులు అడ్డుకోవడంతో కొద్దిసేపు తోపులాట జరిగింది. అనంతరం ఎస్సై కార్మికులు, డీజీఎంతో మాట్లాడి పరిస్థితిని చక్కదిద్దారు. అనంతరం ఒకరోజు గడువు ఇస్తే యాజమాన్యంతో మాట్లాడుతానని చెప్పడం తో కార్మికులు నిరసన విరమించారు.
జేఏసీ నాయకులపై కార్మికుల ఆగ్రహం
యాజమాన్యం 15 నెలలుగా వేతనాలు చెల్లిం చకుండా ఇబ్బందులకు గురి చేస్తుంటే మీరు విద్యుత్ పన్ను విషయంతో యాజమాన్యం తరపున గడువు కోరేందుకు వెళ్లడం ఎంత వరకు సమంజసమని కార్మికులు ఆగ్రహం వెలిబుచ్చారు. దేశవ్యాప్త సమ్మె కార్యక్రమంలో పాల్గొనేందుకు జేఏసీ నాయకులు కార్మికులతో సమావేశం నిర్వహించారు. ఒక విద్యుత్ విషయం కోసం కాదని వేతనాలు, కార్మికులు పడుతున్న ఇబ్బందుల జేసీఎల్ దృష్టికి తీసుకుపోయేందుకు అలాగే కాలనీకి విద్యుత్ సరఫరాను తీసేస్తే ఎదురయ్యే ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకు పోయేందుకు వెళ్లామని చెప్పారు.
ఈ క్రమంలో కార్మికులకు జేఏసీ నాయకుల మద్య మాటల యుద్దం చోటు చేసుకుంది. డీజీఎం ఏడీఎం కార్యాలయంలోకి రావడంతో గమనించిన కార్మికులు వేతనాలు చెల్లించడంలో యాజమాన్యం స్పందించక పో వ డంపై డీజీఎంను నిలదీశారు. ఈ సందర్బంగా పలు విషయాలపై జేఏసీ నాయకులను నిలదీస్తు కొందరు కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికుల సమస్యలపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ వెంకటేశ్వర్లు జేఏసీ నా యకులపై మండిపడ్డారు. ఏడీఏ కార్యాల యా న్ని ముట్టడించారనే విషయం తెలుసుకున్న మీడియాను లోపలికి రానీయకుండా సెక్యూరి టీ సిబ్బంది అడ్డుకున్నారు. వెంటనే డీజీఎంతో మాట్లాడి విలేకరులను లోపలికి అనుమతించాలని డిమాండ్ చేయడంతో రెండు గంటల తర్వాత అనుమతించారు.