బిల్ట్ కార్మికుల భారీ ర్యాలీ
వారి కుటుంబాల్లో పండుగ వాతావరణం
మంగపేట : మూతపడిన బిల్ట్ ఫ్యాక్టరీ పునరుద్ధరణకు ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో ఏడాదిన్నరగా పోరాడుతున్న కార్మికులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. బిల్ట్ ప్రధాన గేటు ఎదుట సీఎం కేసీఆర్ చిత్ర పటానికి సోమవారం క్షీరాభిషేకం చేశారు. అనంతరం కేసీఆర్ చిత్రపటాలతో భారీ ర్యా లీ నిర్వహించి టపాసులు కాల్చారు. అనంతరం అంబేద్కర్ చిత్రపటానికి జేఏసీ నాయకులు పూలమాలలు వేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కార్మికుల సంక్షేమమే ధ్యే యంగా జిల్లాలోనే అతిపెద్ద పరిశ్రమ అయిన బిల్ట్ ఫ్యాక్టరీని పునఃప్రారంభిస్తున్న కేసీఆర్ గొప్పతనం చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తుందని అన్నారు. తమ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, పరిష్కారానికి కృషి చేసిన డిప్యూటీ సీఎం కడియం శ్రీహరికి కార్మికులు ఎంతో రుణపడి ఉంటారని చెప్పారు. కార్యక్రమంలో బిల్ట్ జేఏసీ నాయకులు వడ్డెబోయిన శ్రీనివాసులు, పుసునూరి గణపతి, వడ్లూరి రాంచందర్, చాతరాజు చొక్కారావు, డీవీపీ రాజు, మేడ లక్ష్మీనారాయణ, వంగేటి వెంకట్‌రెడ్డి, కుర్బాన్‌అలీ, పప్పు వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం
Published Tue, Dec 15 2015 3:47 AM | Last Updated on Sun, Sep 3 2017 1:59 PM
Advertisement