రైతులు పెట్టిన విషం గుళికలు తిని దాదాపు 40 జింకలు చనిపోయాయి.
పెబ్బేరు(మహబూబ్‌నగర్): రైతులు పెట్టిన విషం గుళికలు తిని దాదాపు 40 జింకలు చనిపోయాయి. మహబూబ్‌నగర్ జిల్లా పెబ్బేరు మండలం గుమ్మడం గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కొందరు రైతులు కృష్ణా నదిలో మొక్కజొన్న సాగు చేస్తున్నారు. పంటను పురుగుల బారి నుంచి రక్షించుకునేందుకు మొదళ్ల వద్ద శుక్రవారం రాత్రి విషం గుళికలను చల్లారు. సమీపంలోని అటవీప్రాంతం నుంచి వచ్చిన జింకలు గడ్డి మేసుకుంటూ వచ్చి గడ్డితోపాటు గుళికలను కూడా తినేశాయి. దీంతో అ విష ప్రభావానికి లోనై దాదాపు నలబై జింకలు చనిపోయాయి. శనివారం ఉదయం గమనించిన రైతులు, స్థానికులు అటవీ అధికారులకు సమాచారం అందించారు.