అధికారులు స్వాధీనం చేసుకున్న జింక మాంసం, అరెస్టయిన పుష్పరాజ్, పేరళగన్
అన్నానగర్: దేవాలావలో ఆదివారం 30 కిలోల జింక మాసాన్ని అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకొని ఇద్దరిని అరెస్టు చేశారు. నీలగిరి జిల్లా కూడలూర్ తాలూకా దేవాలావా ప్రాంతంలో జింక మాంసం విక్రయిస్తున్నట్టుగా అటవీ శాఖాధికారులకు ఆదివారం సమాచారం అందింది. దీని ప్రకారం అటవీ శాఖ అధికారులు శరవణన్, లూయిష్, మిల్టన్ ప్రభు ఆ ప్రాంతానికి వెళ్లి విచారణ చేశారు. అదే ప్రాంతానికి చెందిన పుష్పరాజ్ ఇంట్లో తనిఖీ చేయగా 30కిలోల జింక మాంసం లభ్యమైంది.
దీనికి సంబంధించి పుష్పరాజ్ (56), ఇతని కుమారుడు పేరళగన్ (26)లను దేవాలావ అటవీ శాఖ కార్యాలయానికి తీసుకొచ్చి విచారణ చేశారు. ఇందులో టేన్‌టి రేంజ్ నెంబర్–1 ప్రాంతంలో జింక మృతి చెంది ఉందని, దాన్ని మాంసం కోసం ఇంటికి తీసుకెళ్లినట్లుగా నిందితులు అటవీశాఖాధికారులకు తెలిపారు. తరువాత జింక మాంసాన్ని అధికారులు స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసి వారిద్దరిని అరెస్టు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment