ఆడుకునేందుకు వెళ్లి ఊహించని ఫ్రెండ్‌తో.. | Viral Pic Of 4 Year Old Boy Come With Deer While Playing Outside | Sakshi
Sakshi News home page

ఆడుకునేందుకు వెళ్లి ఊహించని ఫ్రెండ్‌తో..

Published Fri, Jan 29 2021 9:30 PM | Last Updated on Fri, Jan 29 2021 9:39 PM

Viral Pic Of 4 Year Old Boy Come With Deer While Playing Outside - Sakshi

నాలుగేళ్ల పిల్లాడు ఆడుకునేందుకు బయటకు వెళ్లి ఊహించని ఫ్రెండ్‌తో ఇంటికి తిరిగి వచ్చాడు. ఆ చిన్నారి కొత్త స్నేహితుడ్ని చూసిన అతడి తల్లి ఒకింత ఆశ్చర్యపోయింది. వెంటనే తన మొబైల్‌ తీసుకుని స్టైల్‌గా ఉన్న ఇద్దరి ఫోటోలను తీసింది. అయితే ఆ బుడతడి కొత్త ఫ్రెండ్‌ మరెవరో కాదు జింక పిల్ల. అమెరికాలోని వర్జీనియాలో ఈ అరుదైన ఘటన జరిగింది. చదవండి: పెళ్లిలో భర్త పర్మిషన్‌తో లవర్‌ని..

వివరాలు.. విహారయాత్ర కోసం స్టెఫానీ బ్రౌన్ కుటుంబం వర్జీనియాలోని మసానుటెన్‌కు వచ్చింది. డొమినిక్ అనే నాలుగేళ్ల పిల్లాడు ఈ నెల 26న ఆడుకునేందుకు బయటకు వెళ్లాడు. కొంతసేపటికి తర్వాత తిరిగి వచ్చిన కుమారుడ్ని చూసి అతడి తల్లి స్టెఫానీ బ్రౌన్ ఆశ్చర్యపోయింది. ఆ చిన్నారితో కలిసి వచ్చిన జింక ఏ మాత్రం భయపడకుండా తలుపు పక్కన నిలబడింది. అయితే దాని తల్లి తన పిల్ల కోసం చూస్తుందని, ఆ జింక పిల్లను తిరిగి పార్కులో వదిలేయమని చెప్పింది. కాగా, కొత్త ఫ్రెండ్‌తో తన కుమారుడు చిరునవ్వులు చిందిస్తున్న ఫోటోను స్టెఫానీ బ్రౌన్ ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేయగా వైరల్‌ అయ్యింది. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు.
చదవండి: వందల సంఖ్యలో సాలీడులు.. వారి పరిస్థితి ఏంటో


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement