గుండె తరుక్కుపోయే చిత్రం.. ఇలాంటి ఒక్క చిరునవ్వు చాలు! | Israel-Hamas War: Gaza Kids Viral Photo Melts Internet - Sakshi
Sakshi News home page

గుండె తరుక్కుపోయే చిత్రం.. ఇలాంటి ఒక్క చిరునవ్వు చాలు!

Published Sat, Dec 30 2023 5:25 PM | Last Updated on Sat, Dec 30 2023 5:55 PM

Gaza Kids Viral Photo Melt Internet - Sakshi

Gaza Viral Photo: ఇక్కడి ఫొటో చూడండి..  ఓ వైపు రాకెట్ల దాడులు.. మరోవైపు బాంబు దాడులు అయినా చెక్కు చెదరని అమాయక చిరునవ్వు లోకం గురించి ఏం తెలుసని అంత ధీమా?

ఈ చిన్నారుల నవ్వు చూడండి. యుద్ధం గురించి తెలియని వయసు. ఓ తమ ప్రాంతం చిధ్రమై పోతున్నా అర్థంకాని వయసు. ఆ క్షణంలో వాళ్లకేం అక్కర్లేదు. గుండెకు హత్తుకున్న ఆ స్నేహం తప్పా. ఈ యుద్ధంలో అమ్మ తప్పిపోయి ఉండొచ్చు. నాన్న ప్రాణమే పోయి ఉండొచ్చు. యుద్ధం వీళ్లను అనాథనూ చేసి ఉండొచ్చు. దిక్కులు బిక్కటిట్లేలా వీళ్లు రోదించి ఉండొచ్చు. కానీ, ఓదార్చే చెయ్యి పక్కన ఉంది కదా అందుకే ఫొటోకు నవ్వుతూ ఫోజు ఇచ్చారేమో. 

ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం కారణంగా సామాన్యులు కడగళ్లపాలవుతున్నారు. మృతుల్లో చిన్నారులే ఎక్కువగా ఉన్నారనే నివేదికలు ప్రపంచాన్ని చలింపజేస్తోంది. యుద్ధంతో చితికిపోయి ఉన్న గాజాకు.. ఈ చిన్నారుల నవ్వులు మళ్లీ ప్రాణం పోస్తే.. యుద్ధం ఓడిపోయినట్లే కదా!. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement