గాజా: దక్షిణ గాజాగాపై ఇజ్రాయెల్ ట్యాంకులు, యుద్ధ విమానాలతో విరుచుకుపడుతుంది. దక్షిణ గాజా స్ట్రిప్‌లోని ప్రధాన ప్రాంతాల్లో ఇజ్రాయెల్ సైన్యం భూతల దాడులు చేస్తోంది. తాజాగా జరిపిన దాడిలో 40 మంది పౌరులు మరణించినట్లు గాజా అధికారులు తెలిపారు.
దక్షిణ గాజా స్ట్రిప్‌మీద ఇజ్రాయెల్ సైన్యం ఉపరితల, వైమానిక దాడులు కొనసాగుతున్నాయి. ఈ దాడుల్లో దక్షిణ గాజా స్ట్రిప్‌లోని ఖాన్ యునిస్,అల్ మవాసీ ప్రాంతాల మీద చేసిన దాడుల్లో గత 24 గంటల్లో 40మంది మరణించారని, మరో 60 మంది తీవ్రంగా గాయపడినట్లు గాజా సివిల్ డిఫెన్స్ అధికారి మహ్మద్ అల్ ముఘైర్ మీడియా సంస్థ ఏఎఫ్‌పీకి చెప్పారు.
సివిల్ డిఫెన్స్ ప్రతినిధి మహమూద్ బసల్ మాట్లాడుతూ..స్థానిక శిబిరాల్లో ఆశ్రయం పొందుతున్న ప్రజలకు దాడులకు ఎలాంటి హెచ్చరికలు జారీ చేయలేదని, ఫలితంగా సామాన్యులు ప్రాణాలు కోల్పోవడంతో పాటు సహాయక చర్యలకు మరింత ఇబ్బందులు తలెత్తుతున్నట్లు చెప్పారు.
గాజాపై దాడిని ఇజ్రాయెల్ సైన్యం అధికారంగా స్పందించింది. తాము ఖాన్ యునిస్‌లోని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌లో పనిచేస్తున్న హమాస్ ఉగ్రవాదులపై యుద్ధవిమానాలతో దాడి చేసినట్లు వెల్లడించింది.
గాజా స్ట్రిప్‌లోని ఉగ్రవాద సంస్థలు ఇజ్రాయెల్ ప్రాంతాలు,సైన్యానికి వ్యతిరేకంగా ఉగ్రవాద కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయని,ఫలితంగా ఈ డాడులు చేస్తున్నట్లు వెల్లడించింది.
ఇదీ చదవండి : కేజ్రీవాల్‌కు బెయిల్ వచ్చేనా?
Comments
Please login to add a commentAdd a comment