
సాక్షి, కొత్తగూడ: నీళ్లు తాగేందుకు వచ్చిన వన్యప్రాణి సాంబర్ డీర్ కాళ్లను దుండగులు కిరాతకంగా నరికారు. ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం రేణ్యాతండా సమీపంలో మంగళవారం చోటుచేసుకుంది. రేణ్యాతండా, చిన్నతండా మధ్య ఉన్న చెరువులో నీళ్లు తాగడానికి సాంబర్ డీర్ రాగా, కొందరు యువకులు గట్టిగా అరిచారు. చదవండి: (పెళ్లయిన తొమ్మిది నెలలకే...)
భయపడిన జంతువు చెరువులోకి దిగి ఈదుకుంటూ కట్ట ఎక్కి పొలాల్లోకి దిగింది. అక్కడ బురదగా ఉండడంతో పరుగెత్తలేక నిలిచిపోయింది. సదరు యువకులు గొడ్డళ్లతో వెంబడిస్తూ జంతువు వెనక వైపు కాళ్లు నరికారు. రెండు కాళ్లు విరిగిన సాంబర్ జింక గట్టిగా అరవడంతో స్థానికులు పెద్దసంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. దీంతో దుండగులు పరారయ్యారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు.. వన్యప్రాణిని ట్రాక్టర్‌లో హన్మకొండలోని వనవిజ్ఞాన కేంద్రానికి తరలించి శస్త్రచికిత్స చేయించారు. చదవండి: (అడవంతా జల్లెడ!)
Comments
Please login to add a commentAdd a comment