
అమెరికాకు చెందిన లిండా టెన్నెంట్ అనే మహిళను ఓ జింక షాక్ గురిచేసింది. ఈ ఘటన బ్రన్స్‌విక్‌లోని ఓ పెట్రోల్ పంప్ వద్ద చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. లిండా ఆఫీస్‌కు వెళ్తుండగా.. పెట్రోల్ పంప్ వద్ద తన కారును నిలిపారు. అందులో నుంచి బయటకు దిగిన తర్వాత.. అటుగా దూసుకొచ్చిన జింక ఆమె తలపై నుంచి దూకింది. దీంతో ఆమె ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. కొద్దిసేపు అలానే నిలబడిపోయారు. తన తలకు ఏమైనా అయిందా అని చూసుకున్నారు.
ఇందుకు సంబంధించిన వీడియో అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డు అయింది. దీనిని లిండా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే తనకు చిన్న గాయం మాత్రమే అయిందని.. ఎలాంటి ప్రమాదం జరగలేదని పేర్కొన్నారు. తొలుత ఎవరైనా దొంగలు తనపై దాడి చేయడానికి వచ్చారమోననని అనుకున్నానని తెలిపారు. కానీ ఒక్కసారిగి జింక తన పై నుంచి దూకడంతో భయపడ్డట్టు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment