
సీన్ రివర్స్ అయింది...
ఈ ఫొటోలో ఎలాంటి ట్రిక్కూ లేదు. మీరు చూస్తున్నది నిజమే.
ఈ ఫొటోలో ఎలాంటి ట్రిక్కూ లేదు. మీరు చూస్తున్నది నిజమే. సాధారణంగా చిరుత ఎదురైతే ఏ జంతువైనా కాళ్లకు బుద్ధి చెప్పడం ఖాయం. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయింది. ఓ అడవి మృగాల గుంపుపై దాడికి దిగిన ఈ చిరుతను చూసి ఇతర జంతువులన్నీ పారిపోయాయి. కానీ ఈ దుప్పి మాత్రం ఊరుకోలేదు.
వెంటనే ఎదురు దాడికి దిగింది. తన కొమ్ములతో చిరుతను కుమ్మేయడానికి దూసుకెళ్లింది. దీంతో కంగుతిన్న చిరుత..వెంటనే పలాయనం చిత్తగించింది. ఈ అరుదైన దృశ్యం కెన్యాలోని మసాయ్ మారా నేషనల్ రిజర్వ్ పార్కులో కనిపించింది. ఈ దృశ్యాలను మనోజ్ షా అనే వన్యప్రాణి ఫోటో గ్రాఫర్ తన కెమెరాలో బంధించారు.