
ఓ ఇంట్లోకి వచ్చి చేరిన జింక
జూపార్క్‌కు తరలించిన అటవీ అధికారులు
గచ్చిబౌలి: రోడ్లపై పరుగులు తీసిన ఓ జింక ఎట్టకేలకు ఓ ఇంట్లోకు చేరింది. పోలీసులు, ఫారెస్ట్ అధికారుల దాన్ని జూపార్క్‌కు చేర్చారు. స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం.. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు ఓ జింక గోపన్‌పల్లి ఎన్‌టీఆర్‌నగర్‌లో రోడ్లపై పరుగులు తీయసాగింది. దీనిని కుక్కలు వెంబడించడంతో వాటి బారినుంచి స్థానికులు రక్షించారు.
భయంతో అక్కడే ఉన్న ఓ హార్డ్‌వేర్ షాపులోకి వెళ్లింది. షాపు నిర్వాహకుడు సూరజ్.. దానికి చపాతీ తిపించారు. కొద్ది నిమిషాల అనంతరం అక్కడి నుంచి జింక పరుగుతీసి బస్తీలోకి వెళ్లింది. రాణి అనే మహిళ ఇంట్లో నుంచి కమల అనే మహిళ ఇంటి ఆవరణలోకి చేరింది. ఆ సమయంలో ఆ ఇంట్లో ఉన్నవారు పనికి వెళ్లారు. గమనించిన స్థానికులు బయటకు వెళ్లకుండా గేట్ మూశారు. వి
షయం తెలుసుకున్న శేరిలింగంపల్లి బీజేపీ నాయకులు రవి కుమార్ యాదవ్ పోలీసులకు సమాచారం అందించారు. గచ్చిబౌలి పోలీసులు జింక బయటకు రాకుండా చర్యలు చేపట్టి ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందిచారు. ఎఫ్‌ఆర్‌ఓ రమేష్ కుమార్, వెటర్నరీ డాక్టర్ షానవాజ్ , నెహ్రూ జూలాజికల్ సిబ్బంది రెస్క్యూ వాహనంతో వచ్చారు. మొదట వల వేసి బంధించి ఇంటి నుంచి బయటకు రప్పించాలని చూడగా వారు అనుకున్న రీతిలో జింక స్పందించలేదు. దీంతో దానికి మత్తు ఇంజక్షన్ ఇచ్చి రెస్క్యూ వాహనంలో జూ పార్క్‌కు తరలించారు.
బెదిరి.. సమూహం నుంచి చెదిరి..
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జింకల సమూహాలు ఉన్నాయి. అవి గుంపులు గుంపులుగా ఒకచోట నుంచి మరో చోటికి వెళ్తుంటాయి. గత నాలుగు రోజులుగా కంచ గచ్చి»ౌలి సర్వే నెంబర్ 25లో టీజీఐఐసీ చేపట్టిన పనుల కారణంగా జింకల సమూహాలు బెదిరి.. చెదిరిపోయి ఉంటాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. జేసీబీల శబ్దాలు, చెట్ల నరికివేతతో భయంతో జింకలు కాంక్రీట్ జంగిల్‌లోకి పరుగులు తీస్తున్నాయి. జింకలు, వన్య ప్రాణుల రక్షణ కోసం తక్షణమే చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత యూనివర్సిటీ యాజమాన్యం, ఫారెస్ట్ అధికారులపై ఉంది.