సాక్షి, న్యూఢిల్లీ / సియోల్: దక్షిణ కొరియాలోని కొరియన్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ పరిశోధన కీలక విషయాన్ని వెల్లడించింది. కరోనా వైరస్ బారిన పడి కోలుకున్న రోగుల నుంచి వైరస్ వ్యాప్తి చెందదని వెల్లడించింది. వైరస్ నుంచి కోలుకున్న రోగులకు తిరిగి వైరస్‌పాజిటివ్ రావడం, వారినించి కూడా విస్తరిస్తోందన్న ఆందోళనపై నిర్వహించిన పరిశోధనలో ఈ విషయాన్ని తేల్చింది. దీనికి ప్రకారం కరోనావైరస్ నుండి కోలుకున్న వారంలోనే పాజిటివ్ వచ్చిన వ్యక్తులు (రీపాజిటివ్ రోగులు) ఈ వైరస్‌ను వ్యాప్తి చేయలేరని తెలిపింది. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు చాలా దేశాలు లాక్‌డౌన్ నిబంధనలను సడలించి, ఆర్థిక కార్యలాకాలను ప్రారంభించాలని చూస్తున్న తరుణంలో ఈ ఫలితాలు సానుకూల సంకేతంగా నిలుస్తున్నాయి.
కోలుకున్న తర్వాత మళ్లీ వైరస్ బారిన పడిన 285 కోవిడ్-19 రోగులపై దక్షిణ కొరియా పరిశోధకులు ఈ అధ్యయనం చేశారు. వీరు వ్యాప్తి చెసే వైరస్ కణాల్లో జీవం వుండదని, చనిపోయిన కణాలతో వైరస్‌ను వ్యాప్తి కాదని నివేదించింది. ఈ నేపథ్యంలో కోలుకునే వ్యక్తులు తిరిగి వైరస్‌ను వ్యాప్తి చేస్తారనే అందోళన అససరం లేదని స్పష్టం చేసింది. దీంతో దక్షిణ కొరియా వైరస్‌కు సంబంధించిన ప్రోటోకాల్స్ నిబంధనలను సవరించింది. ఒకసారి కోలుకొని, ఐసోలేషన్ పూర్తి చేసిన రోగులకు పనికి లేదా పాఠశాలలకు వెళ్లేందుకు వైరస్ పరీక్షలు చేయవలసిన అవసరం లేదని దక్షిణ కొరియా అధికారులు తెలిపారు.
కాగా ఆంక్షలున్నప్పటికీ, కొన్ని సడలింపులతో దేశవ్యాప్తంగా మే 18 నుండి నాలుగవ లాక్‌డౌన్ అమల్లో వుంది. దీంతో దేశమంతా వ్యాపార కార్యకాలాపాలు తిరిగి ప్రారంభ మైనాయి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 4,895,033 మంది కరోనా బారినపడగా, 320,192 మరణాలు సంభవించాయి. దేశంలో కరోనా వైరస్ కారణంగా 3,164 మంది మరణించగా కేసులు సంఖ్య లక్ష మార్క్(101,261)ను దాటేసింది. దక్షిణ కొరియాలో 263 మరణాలు 11,078 కేసులు నమోదయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment